కరెంట్ అఫైర్స్(జనవరి - 1st వీక్) బిట్ బ్యాంక్
1. 2020 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారతదేశంలో ఎఫ్‌డీఐ (8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు) అత్యధికంగా ఉన్న దేశం?
1) జపాన్
2) మారిషస్
3) యూఎస్ఏ
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 4
2. గత దశాబ్దంలో ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా ఎంపికైన భారత క్రికెటర్ ఎవరు?
1) మహేంద్ర సింగ్ ధోని
2) సురేశ్ రైనా
3) విరాట్ కొహ్లి
4) రోహిత్ శర్మ
- View Answer
- సమాధానం: 1
3. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలనే తీర్మానాన్ని ఆమోదించిన భారతదేశంలోని తొలి రాష్ట్రం ఏది?
1) పశ్చిమ బెంగాల్
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
4. చైనా ఇటీవల ఏ రకమైన చేపలను అంతరించిపోయినట్లు ప్రకటించింది?
1) పాడిల్ చేప
2) పోలియోడాన్
3) చొండ్రోస్టెల్
4) బౌఫిన్
- View Answer
- సమాధానం: 1
5. భారతదేశంలోని 10 రాష్ట్రాల్లో, యూఎస్ఎ, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ‘జో కుట్పుయ్ పండుగ’ 2020, 1వ ఎడిషన్‌ను ఏ రాష్ట్రం నిర్వహించింది?
1) ఉత్తరప్రదేశ్
2) మిజోరాం
3) నాగాలాండ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 2
6. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) జనవరి 3
2) జనవరి 4
3) జనవరి 2
4) జనవరి 1
- View Answer
- సమాధానం: 2
7. ఏరోస్పేస్ భాగాలు తయారు చేయడానికి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది?
1) టాటా గ్రూప్
2) విప్రో 3డి
3) రిలియన్స్ ఇండస్ట్ర్సీ
4) భారత్ ఫోర్జ్
- View Answer
- సమాధానం: 2
8. 2019 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) నివేదిక ప్రకారం 2004 నుంచి 2017 వరకు భారతదేశ అడవుల్లో ఎంత శాతం మంటలు సంభవించాయి?
1) 21.40%
2) 23.40%
3) 25.40%
4) 27.40%
- View Answer
- సమాధానం: 1
9. ఇటీవల 2020ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) సంవత్సరంగా ప్రకటించిన రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
10. పగడాలు, సముద్ర ప్రాణులను కాపాడటానికి ‘రీఫ్ టాక్సిక్’ సన్క్రీమ్ను నిషేధించిన ప్రపంచంలోని మొదటి దేశం?
1) నౌరు
2) మార్షల్ దీవులు
3) కిరిబతి
4) పలావు
- View Answer
- సమాధానం: 4
11. చిన్న శాటిలైట్ వాహనాలను ప్రయోగించడానికి ఇస్రో తన రెండో ప్రయోగ నౌకాశ్రయాన్ని ఎక్కడ ఏర్పాటుచేయనుంది?
1) కొచ్చి, కేరళ
2) మంగళూరు, కర్ణాటక
3) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
4) తూత్తుకోడి, తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
12. యునైటెడ్ కింగ్డమ్ క్వీన్స్ విశ్వవిద్యాలయానికి మొదటి మహిళా చాన్సులర్‌గా ఎవరిని నియమించారు?
1) హిల్లరీ రోధమ్ క్లింటన్
2) ఎస్తేర్ మేక్వే
3) థెరోస్ కాఫీ
4) ప్రీతి పటేల్
- View Answer
- సమాధానం: 1
13. ఇటీవల రిటైర్మంట్ ప్రకటించిన భారతదేశానికి చెందిన సునీతా లక్రా ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి?
1) హాకీ
2) క్రికెట్
3) ఫుట్‌బాల్
4) బాడ్మింటన్
- View Answer
- సమాధానం: 1
14. అస్సాంలోని గువహతిలో జరిగిన మూడో ఖేలో ఇండియా గేమ్స్–2020లో ‘సైక్లింగ్’తో పాటు ఏ ఆటను తొలిసారిగా చేర్చారు?
1) బొక్కియా
2) క్రాక్వెట్
3) లాన్ బౌల్స్
4) బొకే
- View Answer
- సమాధానం: 3
15. వ్యోముగాములకు శిక్షణ ఇవ్వడానికి భారతదేశం కొత్త ప్రపంచ స్థాయి సౌకర్యాల కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది?
1) తిరువనంతపురం, కేరళ
2) విశాఖపట్నం, కర్ణాటక
3) చల్లకెరే, కర్ణాటక
4) హైదరాబాద్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
16. కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక వ్యవహారాల విభాగం(డీఎంఏ) కి ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) రామ్‌నాథ్ కోవింద్
2) రాజ్‌నాథ్ సింగ్
3) నరేంద్రమోడి
4) బిపిన్ రావత్
- View Answer
- సమాధానం: 4
17. స్వచ్ఛ్ సర్వేక్షన్ లీగ్–2020, 5వ ఎడిషన్‌లో 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరం ఏది?
1) నాసిక్, మహారాష్ట్ర
2) సూరత్, గుజరాత్
3) భూపాల్, మధ్యప్రదేశ్
4) ఇండోర్, మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
18. ఆరు ఖండాల్లోని ఆరు పర్వత శిఖరాలను అధిరోహించి ప్రపంచంలోని మొట్టమొదటి, అతిపిన్న వయస్కురాలైన భారతీయ గిరిజన బాలిక పేరు ఏమిటి?
1) సంతోష్ యాదవ్
2) మాలావత్ పూర్ణ
3) బచేంద్రి పాల్
4) డిక్కి డోల్మా
- View Answer
- సమాధానం: 2
19. 75 మెగావాట్ల కాంతి విపీడన సౌర ఉద్యానవనాలకు ఆర్థిక సహాయం చేసేందుకు భారతదేశానికి చెందిన ఎక్సిమ్ బ్యాంక్ 75 మిలియన్ డాలర్లను ఏ దేశానికి ఇచ్చింది?
1) గ్వాటెమాల
2) క్యూబా
3) కెనడా
4) మెక్సికో
- View Answer
- సమాధానం: 2
20. కంటి చూపు సరిగా లేనివారు కరెన్సీ నోట్ల ను గుర్తించే విధంగా ఆర్బీఐ ఏ యాప్‌ను ప్రారంభించింది?
1) విఎఎన్ఐఎ–విజువల్లీ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ అప్లికేషన్
2) ఎంవిఎఎన్ఐ–మొబైల్ ఆప్ ఫర్ విజువల్లీ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్
3) విఎఎన్ఐ–విజువల్లీ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్
4) ఎంఎఎన్ఐ–మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంట ఫైయర్
- View Answer
- సమాధానం: 4
21. 2018–19 సంవత్సరానికి సంబంధించి క్రిప్టోగ్రఫీ, ఇన్ఫర్మేషన్ థియరీ రంగంలో స్వర్ణ జయంతి ఫెలోషిప్ అవార్డును ఎవరు పొందారు?
1) డా.సమరజిత్ కర్మాకర్
2) డా.యోగేష్ సింహాన్
3) డా.అనినిద్య దాస్
4) డా.శ్వేత అగర్వాల్
- View Answer
- సమాధానం: 4
22. 2020 ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1 వరకు ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల 1వ ఎడిషన్‌ను ఏ నగరం నిర్వహిస్తుంది?
1) గువహతి, అస్సాం
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) బెంగళూరు, కర్ణాటక
4) భువనేశ్వర్, ఒడిశా
- View Answer
- సమాధానం: 4
23. కింది ఏ పారా మిలటరీ సంస్థ 2020ను ‘ఇయర్ ఆఫ్ మొబిలిటీ’గా పాటిస్తుంది?
1) కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం
2) కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం
3) సరిహద్దు భద్రతా దళం
4) కేంద్ర సాయుధ పోలీసు దళం
- View Answer
- సమాధానం: 1
24. భారత ప్రభుత్వం 1961 నియమాల్లో మార్పులు చేసిన తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటుచేసిన ఐదో విభాగం ఏది?
1) రక్షణ శాఖ
2) సైనిక వ్యవహారాల విభాగం
3) రక్షణ ఉత్పత్తి విభాగం
4) రక్షణ పరిశోధన విభాగం
- View Answer
- సమాధానం: 2
25. సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫూలే జన్మదినం సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘సైబర్ సేఫ్ ఉమెన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) ఆంధ్రప్రదేశ్
2) అస్సాం
3) పశ్చిమ బెంగాల్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
26. ‘లై హరోబా’ అనే ఆచార పండుగను ఇటీవల జరుపుకున్న రాష్ట్రం ఏది?
1) మణిపూర్
2) నాగాలాండ్
3) త్రిపుర
4) మిజోరాం
- View Answer
- సమాధానం: 3
27. 2020 జనవరి 1న అణు సంస్థాపనల జాబితాను మార్పిడి చేసిన రెండు దేశాలు ఏవి?
1) భారత్, పాకిస్తాన్
2) పాకిస్తాన్, చైనా
3) చైనా, రష్యా
4) భారత్, శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
28. సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్ అనే ఇతివృత్తంతో 2020 సంవత్సరపు 107వ అంతర్జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది?
1) కొచ్చి, కేరళ
2) బెంగళూరు, కర్ణాటక
3) గువహతి, అస్సాం
4) కొలకత్తా, పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 2
29. పోషన్ అభియాన్ నిధులను బాగా వినియోగించుకున్న రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ఏది?
1) మిజోరాం
2) లక్షద్వీప్
3) హిమాచల్‌ప్రదేశ్
4) బీహార్
- View Answer
- సమాధానం: 1
30. గుజరాత్‌లోని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) 8000–10,000 కెమెరాలను ఉపయోగించి 2020 మేలో ఏ జంతు గణనను నిర్వహించనుంది?
1) ఆసియా సింహం
2) అడవి గాడిద
3) బెంగాల్ పులి
4) బ్లాక్ బక్
- View Answer
- సమాధానం: 1
31. 2019–20 నుంచి 2024–25 వరకు జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ కింద రైల్వే రంగానికి ఎంత నిధులు కేటాయించారు?
1) రూ.15.69 లక్ష కోట్లు
2) రూ.11.69 లక్ష కోట్లు
3) రూ.12.69 లక్ష కోట్లు
4) రూ.13.69 లక్ష కోట్లు
- View Answer
- సమాధానం: 4
32. కింది ఏ నగరంలో రోహిత్ శర్మ క్రికెట్ స్టేడియానికి పునాది రాయి వేశాడు?
1) బెంగళూరు, కర్ణాటక
2) గువహతి, అస్సాం
3) హైదరాబాద్, తెలంగాణ
4) కొలకత్తా, పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
33. 2019 సంవత్సరానికి దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డులలో ఉత్తమ పురుషుల క్రీడాకారుడి టైటిల్‌ను ఎవరు పొందారు?
1) కైలియన్ మెబప్పి
2) క్రిస్టియానో రొనాల్డో
3) లియోనెల్ మెస్సీ
4) ఎడెన్ హజార్డ్
- View Answer
- సమాధానం: 2
34. ఇర్ఫాన్ పఠాన్ ఇటీవల పదవీ విరమణ ప్రకటించాడు. ఈయన ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు?
1) టెన్నిస్
2) క్రికెట్
3) ఫుట్‌బాల్
4) బ్యాడ్మింటన్
- View Answer
- సమాధానం: 2
35. జాతీయ వైద్య కమిషన్ మొదటి చైర్మన్‌గా ఎవరిని నియమించారు?
1) మహేశ్ వర్మ
2) రాజేంద్ర పాండే
3) సురేశ్ చంద్ర శర్మ
4) రాకేశ్ కుమార్ వాట్స్
- View Answer
- సమాధానం: 3
36. వాతావరణ మార్పుల నుంచి వాయు కాలుష్యం వరకు ‘భూమి పర్యావరణ సమస్యల’ను పరిష్కరించడానికి బ్రిటన్ ప్రిన్స్ విలియం ఆవిష్కరించిన బహుమతి పేరు ఏమిటి?
1) ఎర్త్ సేవర్ ప్రైజ్
2) క్లైమేట్ ఛేంజర్ ప్రైజ్
3) ఎర్త్‌షాట్ ప్రైజ్
4) క్లైమేట్ ఛేంజ్ ప్రైజ్
- View Answer
- సమాధానం: 3
37. స్వచ్ఛ్ సర్వేక్షన్ లీగ్ 2020, 5వ ఎడిషన్‌లో పాల్గొనని ఏకైక రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) పశ్చిమ బెంగాల్
3) అస్సాం
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
38. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య శాఖ ప్రకారం భారతదేశంలో 2020 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగానికి సంబంధించి ఎఫ్‌డీఐ ఎంత శాతం పెరిగింది?
1) 15%
2) 20%
3) 25%
4) 30%
- View Answer
- సమాధానం: 1
39. ఇటీవల గోవాలో జరిగిన ‘నసీమ్–అల్–బహర్’ అనే నావికాదళ వ్యాయామంలో పాల్గొన్న రెండు దేశాలు?
1) భారత్, యెమన్
2) భారత్, ఒమన్
3) భారత్, సౌదీ అరేబియా
4) భారత్, ఇరాన్
- View Answer
- సమాధానం: 2
40. 7.5 లక్షలకు పైగా ఎకె–203 అటాల్ట్ రైఫిల్స్ కొనుగోలు కోసం భారతదేశం ఏ దేశంతో కలిసి అవగాహన ఒప్పందంపై సంతకం చేస్తుంది?
1) యూఎస్ఎ
2) ఫ్రాన్స్
3) ఇజ్రాయిల్
4) రష్యా
- View Answer
- సమాధానం: 4
41. బక్సాబర్డ్ ఫెస్టివల్–2020, 4వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో జరిగింది?
1) గుజరాత్
2) అరుణాచల్‌ప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
42. కొత్త పౌరసత్వ సవరణ చట్టం (íసీఏఏ) 2019 ప్రకారం అర్హత కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన వారిని షార్ట్‌లిస్ట్ చేసిన మొదటి రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) ఉత్తరప్రదేశ్
3) గుజరాత్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
43. భారత్, రష్యా జాయింట్ వెంచర్ అయిన ఇండో–రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ ఉంది?
1) బెంగళూరు, కర్ణాటక
2) ముంబై, మహారాష్ట్ర
3) అమేథి, ఉత్తరప్రదేశ్
4) పూణె, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
44. 2020 ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల 1వ ఎడిషన్ మస్కట్ ఏమిటి?
1) జై, విజయ్
2) జై, బిజయ్
3) అజయ్, బిజయ్
4) అజయ్, విజయ్
- View Answer
- సమాధానం: 2
45. ఇస్రో తన నాల్గో రీజనల్ అకాడెమిక్ సెంటర్ ఫర్ స్పేస్ (ఆర్ఏసీ–ఎస్) ను ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేసింది?
1) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) సూరత్కల్, కర్ణాటక
4) హైదరాబాద్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
46. 2021 సంవత్సరంలో 14వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది?
1) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) ముంబై, మహారాష్ట్ర
4) కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
47. ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో అమెరికా వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ మిలటరీ కమాండర్ పేరు ఏమిటి?
1) కస్సేమ్ సోలైమని
2) హసన్ నస్రాల్లా
3) మహ్మద్ జావాద్ జరీఫ్
4) అబూ అజ్రెల్
- View Answer
- సమాధానం: 1
48. భారతదేశపు తాబేలు పునరావాస కేంద్రాన్ని తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) పశ్చిమ బెంగాల్
2) గుజరాత్
3) ఉత్తరప్రదేశ్
4) బీహార్
- View Answer
- సమాధానం: 4
49. యూఎస్ భాషా శాస్త్రవేత్తలు ‘దశాబ్ద పదం’ గా ఎంపికచేసిన పదం ఏది?
1) వెబ్
2) గూగుల్
3) క్లైమేట్
4) దే (They)
- View Answer
- సమాధానం: 4
50. భారత నావికాదళ వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, తీర భద్రత గురించి అవగాహన కల్పించడానికి మహారాష్ట్రలో భారత నావికాదళం ప్రారంభించిన ఒకటో త్రిమితీయ యాత్ర పేరు ఏమిటి?
1) మహా–నావీ కనెక్ట్ 2020
2) సెక్యూర్–నావీ కనెక్ట్ 2020
3) అవేర్–నావీ కనెక్ట్ 2020
4) హెరిటేజ్–నావీ కనెక్ట్ 2020
- View Answer
- సమాధానం: 1