కరెంట్ అఫైర్స్(2019, ఫిబ్రవరి 15-21)
1. న్యూ వైరల్ వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఏర్పాటును ఆమోదించిన రాష్ట్రం?
1. ఫరిదాబాద్, హరియాణ
2. పాట్నా, బిహార్
3. కూనూర్, తమిళనాడు
4. గువహతి, అసోం
- View Answer
- సమాధానం: 3
2. భారత పౌరులను, ముఖ్యంగా మహిళలను తమ ఎన్ఆర్ఐ జీవిత భాగస్వాముల దోపిడీ మరియు జవాబుదారీతనం నుండి కాపాడటానికి కేంద్ర మంత్రివర్గం ప్రవేశపెట్టిన బిల్లు?
1. వివాహ నమోదు, భారత పౌరుల రక్షణ బిల్లు 2019
2. భారత మహిళల వివాహ నమోదు 2019
3. ప్రవాస భారతీయుల వివాహ నమోదు (ఎన్ఆర్ఐ) 2019
4.ప్రవాస భారతీయ మహిళల వివాహ నమోదు (ఎన్ఆర్ఐ) బిల్లు 2019
- View Answer
- సమాధానం: 4
3. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదంతోముడి జనపనారకు పెరిగిన కనీస మద్దతు ధర(MSP)?
1. క్వింటాల్‌కు రూ.3550
2. క్వింటాల్‌కు రూ.3650
3.క్వింటాల్‌కు రూ.3750
4.క్వింటాల్‌కు రూ.3950
- View Answer
- సమాధానం: 4
4. రైతులకు ఏటా పదివేల రూపాయలను అందించేందుకు పీఎం-కిసాన్ పథకంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసంధానం చేసిన పథకం పేరు?
1. ఎన్టీఆర్ రైతు నేస్తం
2. అన్నదాతా సుఖీభవ పథకం
3. చంద్రన్న రైతు నేస్తం
4. చంద్రన్న రైతు యోజన
- View Answer
- సమాధానం: 2
5. ఇటీవల ముగిసిన పెట్రోటెక్- 2019ని నిర్వహించిన నగరం?
1. చెన్నై
2. కోల్‌కతా
3. గ్రేటర్ నోయిడా
4. గాంధీనగర్
- View Answer
- సమాధానం: 3
6. భారత ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ శ్రామికులకు ఇటీవల సవరించిన నూతన జాతీయ కనీస వేతనం(NMW) నెలకు ఎంత?
1. నెలకు రూ.8750
2. నెలకు రూ.9750
3. నెలకు రూ.7550
4. నెలకు రూ. 8550
- View Answer
- సమాధానం: 2
7. అసంఘటిత రంగ కార్మికుల లబ్ది కోసం కేంద్ర బడ్జెట్-2019లో ప్రకటించిన పెన్షన్ పథకం?
1. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ్ యోజన
2. ప్రధాన మంత్రి మంత్రిత్వ వందన యోజన
3.ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన
4. ప్రధాన మంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన
- View Answer
- సమాధానం: 3
8. నెలసరి వేతనం రూ.15వేల కంటే తక్కువ ఉన్న 18 ఏళ్ల వయసున్న అసంఘటిత రంగ కార్మికులు ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజనలో చేరేందుకు చెల్లించాల్సిన కనీసం మొత్తం ఎంత?
1. నెలకు రూ.55
2. నెలకు రూ.75
3. నెలకు రూ.120
4. నెలకు రూ.150
- View Answer
- సమాధానం: 1
9. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సెమీ హై స్పీడ్ ట్రైన్ 18- ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ ప్రయాణించే మార్గం?
1. ఢిల్లీ -వారణాసి
2. ముంబై-అహ్మదాబాద్
3. ఢిల్లీ-అమృత్సర్
4. ముంబై-ఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
10. గిరిజనుల నాణ్యమైన విద్యాభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన పాఠశాల?
1. కేంద్రీయ విద్యాలయ సంఘటన్
2. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్
3. నవోదయ విద్యా సమితి
4. ద్రోణాచార్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్
- View Answer
- సమాధానం: 2
11. భారత దేశ తొలి జిల్లా శీతిలీకరణ వ్యవస్థను యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన టాబ్రీడ్ ఏ నగరంలో ఏర్పాటు చేయనుంది?
1. పూణె, మహారాష్ట్ర
2. జైపూర్, రాజస్థాన్
3. అమరావతి, ఆంధ్రప్రదేశ్
4. చెన్నై, తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
12. రాజస్థాన్‌లోని ఫోక్రాన్లో భారత వైమానిక దళం నిర్వహించిన మెగా ఎక్స్‌ర్‌సైజ్ పేరు?
1. యుధ్ అభ్యాస్
2. సేనా శక్తి
3. వాయు శక్తి
4. ఎకువేరిన్
- View Answer
- సమాధానం: 3
13. 4వ వ్యవసాయ నాయకత్వ సదస్సు-2019ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు?
1. హరియాణ
2. హిమాచల్ ప్రదేశ్
3. రాజస్థాన్
4. మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
14. రాజస్థాన్‌లోని ఏ నగరం మూడు రోజుల పాటు జరిగిన 40వ అంతర్జాతీయ వార్షిక ఎడారి ఉత్సవానికి ఆతిథ్యం ఇచ్చింది?
1. ఉదయ్‌పూర్
2. జోధ్‌పూర్
3. అజ్మీర్
4. జైసల్మేర్
- View Answer
- సమాధానం: 4
15. అత్యవసర స్పందన సహకార వ్యవస్థ(ERSS) కింద మహిళల భద్రత కోసం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన హెల్ప్‌లైన్ నంబరు?
1. 144
2. 112
3. 131
4. 121
- View Answer
- సమాధానం: 2
16. ఏ రాష్ట్ర ప్రభుత్వం, సంస్కృతంను రాష్ట్ర రెండో అధికారిక భాషగా చేయడానికి బిల్లును ఆమోదించింది?
1. మధ్యప్రదేశ్
2. హిమాచల్‌ప్రదేశ్
3. ఉత్తరప్రదేశ్
4. ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 2
17. తొలిసారిగా డీజిల్ నుండి విద్యుత్‌కు మార్చిన పదివేల హార్స్ పవర్ కలిగిన లోకోమోటివ్ ట్విన్ ఇంజిన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. కపుర్తలా, పంజాబ్
2. ఐసీఎఫ్-చెన్నై, తమిళనాడు
3. చిత్తరంజన్, పశ్చిమ్ బంగా
4. వారణాసి, ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
18. ప్రపంచంలోనే మహిళల అతిపెద్ద మత సమ్మేళం- ‘అత్తౌకల్ పోంకల్’ పండగకు వేదికైన నగరం?
1. ఉజ్జయిని, మధ్యప్రదేశ్
2. తుల్జాపూర్, మహారాష్ట్ర
3. ఉడిపి, కర్ణాటక
4. తిరువనంతపురం, కేరళ
- View Answer
- సమాధానం: 4
19. తీవ్రవాదాన్ని ఎదుర్కోడానికి జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. మొరాకో
2. జపాన్
3. శ్రీలంక
4. చైనా
- View Answer
- సమాధానం: 1
20. 700 కోట్లు రూపాయలతో 72,400 సిగ్ సావేర్ అస్సాల్ట్ రైఫిళ్లను పొందేందుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. అమెరికా
2. రష్యా
3. ఫ్రాన్స్
4. యూకే
- View Answer
- సమాధానం: 1
21. చమురు శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేయడాకి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్(EIL) తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
1. టాంజానియా
2. మడగాస్కర్
3. మంగోలియా
4. ఉగాండా
- View Answer
- సమాధానం: 3
22. ఏ రంగంలో 7 రీసెర్చ్, ఇన్నోవేషన్ ప్రాజెక్టుల్లో పరస్పరం 40 మిలియన్ల యూరోలు పెట్టబడి పెట్టడానికి భారత్, ఐరోపా సమాఖ్య నిర్ణయించాయి?
1. నీటి సవాళ్లు
2. ఆరోగ్యం, పారిశుద్ధ్యం
3. విద్య, నైపుణ్యాలు
4. పట్టణీకరణ
- View Answer
- సమాధానం: 1
23. నీతీ ఆయోగ్- ఎస్సీఐఎస్పీ వర్క్‌షాప్ సందర్భంగా ఏ దేశంలో ఇన్వెస్ట్ ఇండియా గ్రిడ్ ప్రారంభమైంది?
1. అమెరికా
2. సౌదీ అరేబియా
3. రష్యా
4. జపాన్
- View Answer
- సమాధానం: 2
24. ట్రాన్స్లేషనల్ క్రైమ్స్(దేశ సరిహద్దులోని నేరాలు)ను ఎదుర్కోడం, పోలిస్ సహకారాన్ని పెంపొందించుకోడం కోసం భారత్, ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. దక్షిణ కొరియా
2. చైనా
3. ఇజ్రాయిల్
4. ఈజిప్టు
- View Answer
- సమాధానం: 1
25. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ఔట్లుక్ ట్రెండ్స్ 2019 నివేదికను విడుదల చేసిన సంస్థ?
1. ప్రపంచ వాతావరణ సంస్థ
2. ప్రపంచ వాణిజ్య సంస్థ
3. అంతర్జాతీయ కార్మిక సంస్థ
4. అంతర్జాతీయ సుంకాల(కస్టమ్స్) సంస్థ
- View Answer
- సమాధానం: 3
26. ఇటీవల భారత్, ఏ దేశానికి అత్యంత సానుకూల దేశం (మోస్ట్ ఫేవర్డ్ నేషన్) హోదాను ఉపసంహరించుకుంది?
1. ఉత్తర కొరియా
2. చైనా
3. బంగ్లాదేశ్
4. పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
27. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏ సంస్థతో కలిసి 1.72 కోట్ల మంది డిజిటల్ నైపుణ్యాలను సమీకృతం చేయనుంది?
1. వరల్డ్ ఎకనమిక్ ఫోరం
2. స్కిల్ ఇండియా
3. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్
4. డిజిటల్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
28. క్రిప్టోకరెన్సీ కలిగిన తొలి అమెరికా బ్యాంకు ఏది?
1. జేపీ మోర్గాన్ ఛేజ్
2. బ్యాంక్ ఆఫ్ అమెరికా
3. గోల్డ్‌మేన్ సాచ్స్
4. వెల్స్ ఫార్గో
- View Answer
- సమాధానం: 1
29. ఫస్ట్ ఇండియన్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ-ఎడిల్విస్ తమ ఉత్పత్తుల ప్లాట్ఫార్మలను పరస్పరం పొందడానకి ఏ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది?
1. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్
2. బ్యాంక్ ఆఫ్ సింగపూర్
3. బ్యాంక్ ఆఫ్ అమెరికా
4. ప్రపంచ బ్యాంకు
- View Answer
- సమాధానం: 2
30. స్వచ్ఛ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2019లో మొదటి స్థానం దక్కించుకున్న నగరం?
1. అలప్పూజ, కేరళ
2. అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్
3. కుంబకోణం, తమిళనాడు
4. రాయ్‌గఢ్, ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 4
31. 2018, మార్చి చివరినాటికి ఏ పథకం యొక్క నాన్ ఫర్మామింగ్ ఎస్సెట్స్ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కలిపి రూ. 7277 కోట్లకు చేరాయి?
1. ప్రధాన మంత్రి జన ధన్ యోజన
2. కిసాన్ వికాస్ పత్
3. ప్రధాన మంత్రి ముద్ర యోజన(PMMY)
4. సుకన్య సమృద్ధి యోజన
- View Answer
- సమాధానం: 3
32. క్రైయింగ్ కీల్‌బ్యాక్ (హెబియస్ ల్యాక్రిమ) అనే విషం లేని సర్పాన్ని ఇటీవల ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతంలో కనుగొన్నారు?
1. కేరళ
2. ఆంధ్రప్రదేశ్
3. అరుణాచల్ ప్రదేశ్
4. అండమాన్, నికోబార్ దీవులు
- View Answer
- సమాధానం: 3
33. ఈ క్రింది వానిలో దేనిని న్యానో పార్టికల్స్‌ను ఆంపిసిలిన్ వంటి యాంటిబయాటిక్స్ స్థానంలో బ్యాక్టీరియా వ్యాధుల నివారణ, చికిత్సకు ఉపయోగించవచ్చు?
1. రాగి
2.సెలీనియం
3. సల్ఫర్
4. కార్బన్ నైట్రేట్
- View Answer
- సమాధానం: 2
34. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉత్తమ అభ్యాస అనుభవాలను అందించడానికి ఇన్ఫోసిస్ ప్రారంభించిన అనువర్తనం(యాప్) పేరు ఏమిటి?
1. ఇన్ఫీస్టడ్
2.ఇన్ఫీలర్న్
3. ఇన్పీఇంజ్
4. ఇన్ఫీటీక్యూ
- View Answer
- సమాధానం: 4
35. జాతీయ వన్యప్రాణి కార్యచరణ ప్రణాళిక ద్వివార్షిక నివేదిక ప్రకారం ఎన్ని సముద్ర తీర ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కన్సర్వేషన్ రిజర్వులు(సంరక్షణా కేంద్రాలు)గా గుర్తించింది?
1.101
2.106
3.110
4.111
- View Answer
- సమాధానం: 2
36. ఏ దేశ శాస్త్రవేత్తలు(జీపీఎస్)లేకుండా నావిగేషనల్ సామర్థ్యాలను కలిగి ఉన్న చీమలా నడిచే తొలి రోబోను అభివృద్ధి చేశారు?
1. ఫ్రాన్స్
2. చైనా
3. అమెరికా
4. సింగపూర్
- View Answer
- సమాధానం: 1
37. ఇటీవల తమిళనాడులోని చెన్నైలో ఆవిష్కరించిన డ్రైనేజ్ క్లీనింగ్ రోబో పేరు?
1. మిత్రన్
2. బండీకూట్
3. రోబోస్కావిన్
4. రోబోకాప్
- View Answer
- సమాధానం: 2
38. భూమికి 36వేల కి.మీ ఎత్తులో చరించే తొలి స్పేస్ బే్‌స్డ్ సోలార్ పవర్ స్టేషన్‌ను నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్న దేశం?
1. అమెరికా
2. చైనా
3. రష్యా
4. ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
39. న్యాయవాదుల నుండి అందరూ నాణ్యమైన న్యాయసలహాలను పొందేందుకు వీలుగా న్యాయ శాఖ మంత్రి ప్రారంభించిన మొబైల్ యాప్?
1. లీగల్గురు
2. న్యాయబంధు
3. ఈ-బంధు
4. ఈ-అడ్వైజ్ గురు
- View Answer
- సమాధానం: 2
40. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ ఎన్నికల కమిషనర్‌గా ఎవరిని నియమించారు?
1. సంతోష్ సేన్
2. సునీల్ అరోరా
3. సుశీల్ చంద్ర
4. ఓం హరి రావత్
- View Answer
- సమాధానం: 2
41. ఆస్ట్రొనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలుగా నియమితులైన తొలి మహిళ ఎవరు?
1. జీసీ అనుపమ
2. ఆర్తీ సాహా
3. ఆనందీబాయ్ గోపాల్రావ్ జోషి
4. రైతా ఫరియా పావెల్
- View Answer
- సమాధానం: 1
42. అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన వారిలో ఏడో స్థానంలో ఉన్న భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌ను అధిగమించిన క్రికెటర్?
1. ఎంఎస్ ధోని
2. డేల్ స్టైన్
3. విరాట్ కోహ్లీ
4. రోహిత్ శర్మ
- View Answer
- సమాధానం: 2
43. సంప్రదాయ క్రీడ- మల్లాఖాంబ్కు అంకితమైన ఎవరికి శివ్ ఛత్రపతి జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది?
1. పుల్లెల గోపీచంద్
2. శ్రీరశ్ పాల్ సింగ్
3. న్రిప్జిత్ సింగ్ బేడీ
4. ఉదయ్ దేశ్‌పాండే
- View Answer
- సమాధానం: 4
44. అసోంలోని గువహతిలో జరిగిన 83వ యోనిక్స్ సన్రైస్ సీనియర్ బ్యాడ్మెంటన్ నేషనల్స్‌లో మహిళల సింగిల్స్ విజేత ఎవరు?
1. జ్వాలా గుత్తా
2. సైనా నేహ్వాల్
3. అశ్వనీ పొన్నప్ప
4. పీవీ సింధూ
- View Answer
- సమాధానం: 2
45. ముంబై సెంట్రల్లో శివాజీ పార్కులో జరిగిన తొలి మల్లఖాంబ్ ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత?
1. స్పెయిన్
2. భారత్
3. ఇరాన్
4. నార్వే
- View Answer
- సమాధానం: 2
46. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు?
1. ఫిబ్రవరి 19
2. ఫిబ్రవరి 18
3. ఫిబ్రవరి 17
4. ఫిబ్రవరి 15
- View Answer
- సమాధానం: 1
47. ‘ఎ స్టార్ ఈజ్ బార్న్’ అనే చిత్రానికి పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్(PETA)- ‘ఓస్కాట్ అవారు’్డ ఎవరికి దక్కింది?
1. సోనమ్ కపూర్
2. బ్రాడ్లీ కూపర్
3. అమితాబ్ బచ్చన్
4. అనుష్క శర్మ
- View Answer
- సమాధానం: 2
48. అంతర్జాతీయ మానవ హక్కుల బహుమతి-‘మార్టిన్ ఎన్నల్స్ అవార్డు 2019’ విజేత?
1. అబ్దుల్ కార్డోబా బెరియో
2. అబ్దుల్ అజీజ్ ముహామత్
3. ఎరెన్ కెస్కిన్
4. మారినో కోర్డోబా బెరియో
- View Answer
- సమాధానం: 2
49. భారత వైమానిక దళం నియమించిన తొలి మహిళా ప్లైట్ ఇంజనీర్?
1. హీనా జైస్వాల్
2. అరుణిమా సిన్హా
3. రోషిణి శర్మ
4. షీలా దావ్రే
- View Answer
- సమాధానం: 1
50. జలియన్‌వాలాబాగ్ మారణకాండపై రచించిన నిషిద్ధ పంజాబీ కవిత ‘ఖూనీ వైశాఖీ’ని 99 ఏళ్ల తరువాత ఆంగ్లంలో ప్రచురించనున్నారు. దాని రచయిత?
1. సాహెబ్ సింగ్
2. మోహన్ సింగ్
3. నానక్ సింగ్
4. సోహన్ సింగ్ సీతల్
- View Answer
- సమాధానం: 3