కరెంట్ అఫైర్స్(2019, నవంబర్,08 - 14) బిట్ బ్యాంక్
1. బంగాళాఖాతంలో జరిగిన భారత్, ఇండోనేషియా దేశాల సంయుక్త నావికాదళ వ్యాయామం పేరు ఏమిటి?
1) అజేయ వారియర్ 2019
2) మైత్రీ 2019
3) సముద్ర శక్తి 2019
4) మిత్ర శక్తి 2019
- View Answer
- సమాధానం: 3
2. గోవాలో ప్రాంతీయ స్థాయి శోధన, రెస్క్యూ వర్క్‌షాప్, వ్యాయామం 2019ని ఏ సాయు ధ దళం నిర్వహించింది?
1) ఇండియన్ కోస్ట్ గార్డ్
2) భారత నావికా దళం
3) భారత వైమానిక దళం
4) సరిహద్దు భద్రతా దళం
- View Answer
- సమాధానం: 1
3. భారత న్యాయ నివేదిక–2019 ప్రకారం జస్టిస్ డెలివరీపై మొత్తం భారతీయ రాష్ట్రాల ర్యాంకింగ్‌లో 18 పెద్ద మధ్యస్థ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
4. 2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనున్న డిఫెన్స్ ఎక్స్పో–2020కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) బెర్లిన్, జర్మనీ
2) బీజింగ్, చైనా
3) లక్నో, ఉత్తరప్రదేశ్, భారత్
4) మాస్కో, రష్యా
- View Answer
- సమాధానం: 3
5. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన నాలుగు రోజుల ద్వైవార్షిక కామన్Ððల్త్ న్యాయ మంత్రుల సమావేశం – 2019 నేపథ్యం ఏమిటి?
1) ‘జస్టిస్ ఇన్ యంగ్’
2) ‘ఈక్వల్ యాక్సెస్ టు జస్టిస్ అండ్ ద రూల్ ఆఫ్ లా’
3) ‘కమ్యునికేషన్స్ యాస్ ఏ కెటలిస్ట్ ఫర్ జాయింట్‌నెస్’
4) ‘దక్షిణాసియాను బలోపేతం చేస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేయడం’
- View Answer
- సమాధానం: 2
6. మిలటరీ అండ్ మిలటరీ టెక్నికల్ కోఆపరేషన్ (ఐఆర్ఐజీసీ–ఎం–ఎంటీసీ) 19వ ఇంటర్ గవర్నమెంట్ కమిషన్ ఎక్కడ జరిగింది?
1) మాస్కో, రష్యా
2) పారిస్, ఫ్రాన్స్
3) బెర్లిన్, జర్మనీ
4) టెల్ అవీవ్, ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 1
7. స్థిరంగా ఉన్న భారతదేశపు ఆర్థిక దృక్పథాన్ని ఏ ఆర్థిక సేవా సంస్థ తగ్గించింది?
1) క్రిసిల్
2) మూడీస్ కార్పొరేషన్
3) ఫిచ్ రేటింగ్స్
4) ఎస్ అండ్ పీ గ్లోబల్
- View Answer
- సమాధానం: 2
8. నాస్కామ్ విడుదల చేసిన ‘ఇండియన్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్: లీడింగ్ టెక్ ఇన్–20’ నివేదికలో భారత్ ర్యాంక్ ఎంత?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 3
9. నాస్కామ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ప్రారంభ పర్యావరణ వ్యవస్థను కలిగిన దేశం?
1) చైనా
2) ఇజ్రాయెల్
3) ఇండియా
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 1
10. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఇచ్చే ఏషియా బిజినెస్ లీడర్షిప్ ఫోరం (ఏబీఎల్‌ఎఫ్) గ్లోబల్ ఏషియన్ అవార్డును 2019 సంవత్సరానికిగాను ఎవరికి ప్రదానం చేశారు?
1) దిలీప్ షాంఘ్వీ
2) కుమార్ మంగళం బిర్లా
3) గౌతమ్ అదాని
4) లక్ష్మీ మిట్టల్
- View Answer
- సమాధానం: 2
11. ప్రపంచ బెంచ్‌మార్క్ అధ్యయనం 2019 –2020 ప్రకారం యూబీఐ ఏ భారతీయ మిషన్‌ను ప్రపంచంలోనే టాప్ పబ్లిక్ బిజినెస్ యాక్సిలరేటర్గా గుర్తించింది?
1) మెగా పెన్షన్ మిషన్
2) స్కిల్ ఇండియా మిషన్
3) మేకిన్ ఇండియా
4) కేరళ స్టార్టప్ మిషన్
- View Answer
- సమాధానం: 4
12. ‘నిషిద్ధో’ అనే మాన్యుస్క్రిప్ట్‌కు 2019 సంవత్సరానికిగాను ‘జెమ్కన్ యంగ్ లిటరేచర్’ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1) సందీప్ కుండాలియా
2) హరీష్ లాంగర్
3) అభిషేక్ సర్కార్
4) సంతోష్ పంత్
- View Answer
- సమాధానం: 3
13. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) బులెటిన్–2016 ప్రకారం ప్రసూతి మరణాల నిష్పత్తిలో అత్యధిక శాతం క్షీణతను కలిగిన రాష్ట్రం ఏది?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
14. 2020 సంవత్సరానికిగాను తొలి మిలాన్ బహుపాక్షిక నావికాదళ వ్యాయామం ఎక్కడ జరిగింది?
1) చెన్నై, తమిళనాడు
2) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
3) హైదరాబాద్, తెలంగాణ
4) ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
15. షాంఘై సభ్యదేశాల విభాగాల అధిపతుల (ఎస్సీఓ) 10వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) ఇస్లామాబాద్, పాకిస్తాన్
2) మాస్కో, రష్యా
3) బీజింగ్, చైనా
4) న్యూఢిల్లీ, ఇండియా
- View Answer
- సమాధానం: 4
16. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగిన ౖ‘రెజింగ్ హిమాచల్: గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్–2019’ మొదటి ఎడిషన్ భాగస్వామ్య దేశం ఏది?
1) రష్యా
2) యూఏఈ
3) చైనా
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
17. ‘రైజింగ్ హిమాచల్: గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్–2019’కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?
1) దివ్య ఖోస్లా కుమార్
2) ఊర్వశి రౌతేలా
3) ఆయుష్మాన్ ఖురానా
4) యామీ గౌతమ్
- View Answer
- సమాధానం: 4
18. ‘బిమ్స్టెక్ పోర్ట్స్’ ఒకటో ఎడిషన్ అంతరంగిక సమావేశం ఎక్కడ జరిగింది?
1) కొచ్చి, కేరళ
2) చెన్నై, తమిళనాడు
3) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
4) ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
19. భారత అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్)–2019 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
2) కోల్‌కతా, పశ్చిమబెంగాల్
3) జైపూర్, రాజస్థాన్
4) ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
20. కోల్‌కతాలోని పశ్చిమ బెంగాల్లో జరిగిన అంతర్జాతీయ సైన్స్ లిటరేచర్ ఫెస్టివల్– 2019 పేరు ఏమిటి?
1) జుగెండ్ఫోర్శెట్
2) రిజెనెరాన్
3) వైజ్ఞానిక
4) చెల్తేన్హమ్
- View Answer
- సమాధానం: 3
21.2020 జనవరి నుంచి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల ఆన్లైన్ లావాదేవీలపై రుసుము వసూలు చేయనిది ఈ కింది వాటిలో ఏది?
1) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్
2) నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్
3) రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్
4) ఇమీడియట్ పేమెంట్ సర్వీస్
- View Answer
- సమాధానం: 2
22. మారిషస్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) పాల్ బెరెంజర్
2) నందో బోధ
3) ప్రవీంద్ జుగ్నౌత్
4) నవీన్ రామ్గులాం
- View Answer
- సమాధానం: 3
23. 2022 ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ప్రపంచ కప్‌కు ఏ రెండు దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి?
1) స్పెయిన్, బంగ్లాదేశ్
2) భారత్, శ్రీలంక
3) స్పెయిన్, నెదర్లాండ్స్
4) భారత్, బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
24. జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
1) నవంబర్ 8
2) నవంబర్ 7
3) నవంబర్ 9
4) నవంబర్ 6
- View Answer
- సమాధానం: 3
25. కర్తార్‌పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) డేరా బాబా నానక్, గురుదాస్‌పూర్
2) డేరా బాబా నానక్, అమృత్సర్
3) గురు గ్రంథ్ నానక్, లుథియానా
4) గురు గ్రంథ్ నానక్, అత్తారి
- View Answer
- సమాధానం: 1
26. 2019 డిసెంబర్ 10 నుంచి 19 వరకు జరిగిన తొలి ఇండో–రష్యన్ ఉమ్మడి ట్రై–సర్వీస్ వ్యాయామం పేరు ఏమిటి?
1) ఇంద్ర–2019
2) అజేయ వారియర్–2019
3) వజ్ర ప్రహార్–2019
4) మైత్రీ–2019
- View Answer
- సమాధానం: 1
27. ప్రపంచంలోనే తొలి సీఎన్జీ పోర్ట్ టెర్మినల్‌ను ఏ పోర్టులో నిర్మించనున్నారు?
1) మోర్ముగావ్ పోర్టు
2) భావ్‌నగర్ ఓడరేవు
3) కండ్లా పోర్ట్
4) జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు
- View Answer
- సమాధానం: 2
28. 19వ హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ) మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) మస్కట్, ఒమన్
2) మనామా, బహ్రేయిన్
3) దోహ, ఖతార్
4) అబుదాబి, యూఏఈ
- View Answer
- సమాధానం: 4
29.హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ 2019–2021 సంవత్సరానికి గాను అధ్యక్ష పదవీ బాధ్యతలను ఏ దేశం తీసుకుంది?
1) మలేషియా
2) ఇండోనేషియా
3) యూఏఈ
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
30. వన్యప్రాణుల సంరక్షణ రంగంలో చేసిన కృషికి 2019 సంవత్సరానికి గాను జార్జ్ షాలర్ జీవితకాల తొలి పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు?
1) ఉల్లాస్ కరాంత్
2) జేమ్స్ నికోలస్
3) ఎస్. థియోడర్ బాస్కరన్
4) మీరా కతిరావన్
- View Answer
- సమాధానం: 1
31. సుదీర్ఘకాలం పాటు బ్రిటిష్ పార్లమెంటులో ఎంపీగా పనిచేసి 32 ఏళ్ల తర్వాత∙పదవీ విరమణ చేసిన ఎంపీ పేరు?
1) క్రిస్ విలియమ్సన్
2) నిగెల్ కీత్ ఆంథోనీ స్టాండిష్ వాజ్
3) లిజ్ కెండల్
4) ఆండ్రూ బ్రిడ్జెన్
- View Answer
- సమాధానం: 2
32. ఏ అంతరిక్ష సంస్థ ‘ఎక్స్57 మ్యాక్స్‌వెల్’ పేరుతో ప్రయోగాత్మక విద్యుత్‌తో నడిచే విమానాన్ని ప్రారంభించింది?
1) యూరోపియన్ అంతరిక్ష సంస్థ
2) జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ
3) నాసా
4) ఇస్రో
- View Answer
- సమాధానం: 3
33.నవోదయ విద్యాలయ సమితి ఈ గవర్నెన్స్ స్కూల్ ఆటోమేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ప్రారంభించిన పోర్టల్?
1) శాలా దర్పణ్
2) శిక్షా వాణి
3) ఉదయం సఖి
4) వీర్ పరివార్
- View Answer
- సమాధానం: 1
34. ఏ సాలెపురుగు జాతికి భారత క్రికెటర్ ‘సచిన్ టెండూల్కర్’ అని పేరు పెట్టారు?
1) ‘చవరపటేర్ సచిన్ టెండూల్కర్’
2) ‘గోలియత్ సచిన్ టెండూల్కర్’
3) ‘ఇండోమారెంగో సచిన్ టెండూల్కర్’
4) ‘మారెంగో సచిన్ టెండూల్కర్’
- View Answer
- సమాధానం: 4
35. గంటకు 120 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో దూసుకొచ్చిన బుల్బుల్ తుఫాను భారత్‌లోని ఏ రాష్ట్రాలపై విరుచుకుపడింది?
1) ఒడిశా, గుజరాత్
2) పశ్చిమ బెంగాల్, ఒడిశా
3) గుజరాత్, అసోం
4) పశ్చిమ బెంగాల్, గుజరాత్
- View Answer
- సమాధానం: 2
36. షార్టెస్ట్ ఫార్మాట్(టీ20ఐ)లో హ్యాట్రిక్ వికెట్ తీసిన తొలి భారత క్రికెటర్ ఎవరు?
1) ఖలీల్ అహ్మద్
2) కృనాల్ పాండే
3) నవ్‌దీప్ సైని
4) దీపక్ చాహర్
- View Answer
- సమాధానం: 4
37. ఇటీవల మరణించిన రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, ఎన్నికలలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?
1) ఆర్.టి. త్రివేది
2) టి.ఎన్. శేషన్
3) కళ్యాణ్ సుందరం
4) ఎస్.పి. సేన్ వర్మ
- View Answer
- సమాధానం: 2
38. ఎవరి జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకొంటారు?
1) ఏపీజే అబ్దుల్ కలాం
2) అటల్ బిహారీ వాజ్‌పేయి
3) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
4) మౌలానా అబుల్ కలాం ఆజాద్
- View Answer
- సమాధానం: 4
39. ప్రపంచ సైన్స్ దినోత్సవం–2019 నేపథ్యం ఏమిటి?
1) ‘ఓపెన్ సైన్స్, లీవింగ్ నో వన్ బిహైండ్’
2) ‘సైన్స్ ఫర్ గ్లోబల్ అండర్స్టాండింగ్’
3) ౖ‘సెన్స్, ఏ హ్యూమన్ రైట్’
4) ‘సెలబ్రేటింగ్ సైన్స్ సెంటర్స్ అండ్ సైన్స్ మ్యూజియమ్స్’
- View Answer
- సమాధానం: 1
40. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్ (ఐడీఈఎక్స్) సమావేశం ఎక్కడ జరిగింది?
1) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
2) కొచ్చి, కేరళ
3) ముంబై, మహారాష్ట్ర
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
41. ఎనిమియా ఎమాంగ్ మెన్ ఇన్ ఇండియా: జాతీయ ప్రాతినిధ్య క్రాస్ సెక్షనల్ అధ్యయనం ప్రకారం పురుషులలో అత్యధిక రక్తహీనత ఉన్న రాష్ట్రం ఏది?
1) బిహార్
2) జార్ఖండ్
3) ఉత్తరప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
42. ప్రపంచంలోనే తొలిసారి సంస్కృత భాషపై ‘సంస్కృత భారతి విశ్వ సమ్మేళన్’ ఎక్కడ జరిగింది?
1) బెర్లిన్, జర్మనీ
2) న్యూఢిల్లీ, ఇండియా
3) రోమ్, ఇటలీ
4) టోక్యో, జపాన్
- View Answer
- సమాధానం: 2
43. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) –2041 ప్రారంభ సమావేశం నేపథ్యం ఏమిటి?
1) ‘ఢిల్లీ క్యాపిటల్ ఫర్ ద వర ల్డ్ సూన్’
2) ‘నేషనల్ క్యాపిటల్ ఫర్ టుమారో’
3) ‘ప్లానింగ్ ఫర్ టుమారోస్ గ్రేటెస్ట్ క్యాపిటల్ రీజియన్’
4) ‘ఢిల్లీ–మెట్రోపోలీస్ ఆఫ్ టుమారోస్ వరల్డ్’
- View Answer
- సమాధానం: 3
44. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్)–2019 నేపథ్యం ఏమిటి?
1) ‘సైన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్’
2) ‘రీసెర్చ్, ఇన్నోవేషన్, అండ్ సైన్స్ ఎంపవరింగ్ ది నేషన్’
3) ‘డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్’
4) ‘రైస్న్ ఇండియా–రీసెర్చ్, ఇన్నోవేషన్, అండ్ సైన్స్ ఎంపవరింగ్ ది నేషన్’
- View Answer
- సమాధానం: 4
45. రిజర్వ్ ఫండ్‌ను సృష్టించేందుకు ఆర్బీఐ ఏ సంస్థలకు ప్రతి సంవత్సరం దాని నికర లాభంలో కనీసం 20 శాతం ఫండ్‌కు బదిలీ చేయాలని తప్పనిసరి చేసింది?
1) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
2) నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ
3) మైక్రో ఫైనాన్స్ సంస్థ
4) హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు
- View Answer
- సమాధానం: 4
46.ఎస్బీఐ విడుదల చేసిన ‘ఎకోర్యాప్’ నివేదిక ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరానికిగాను సవరించిన భారత జి.డి.పి. ఎంత?
1) 5.5%
2) 5.0%
3) 6.0%
4) 6.5%
- View Answer
- సమాధానం: 2
47.ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే ఏ మొదటి భారతీయ యూపీఐ యాప్‌ను సింగపూర్‌లో ప్రారంభించారు?
1) గూగుల్ పే
2) ఫోన్ పే
3) భీమ్ (BHIM)
4) పేటీఎం
- View Answer
- సమాధానం: 3
48.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 100 కేఎల్‌పీడీ లిగ్నో– సెల్యులోజిక్ 2ఎ ఇథనాల్ ప్లాంట్‌ను ఎక్కడ నిర్మించనున్నారు?
1) పానిపట్, హరియాణా
2) ముంబై, మహారాష్ట్ర
3) పాట్నా, బిహార్
4) రాంచీ, జార్ఖంఢ్
- View Answer
- సమాధానం: 1
49.ప్రపంచంలో చూడదగ్గ ప్రదేశాల జాబితా –2020లో స్థానం పొందిన ‘సురంగ బవాడి’ స్మారక చిహ్నం ఏ నగరంలో ఉంది?
1) అమృత్సర్, పంజాబ్
2) వెలంకన్ని, తమిళనాడు
3) గురువాయూర్, కేరళ
4) విజయపుర, కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
50. ఫ్యూజౌ చైనా ఓపెన్–2019 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు?
1) తకేషీ కమూర
2) చౌ తియాన్ చేన్
3) షి యుకి
4) కెంటో మొమోటా
- View Answer
- సమాధానం: 4