కరెంట్ అఫైర్స్ నవంబర్ (24 - 30) బిట్ బ్యాంక్
1. ప్రపంచ చేపల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది ?
1) భారత్
2) చైనా
3) ఇండోనేషియా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ చేపల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. భారత్ రెండో స్థానంలో ఉంది. నవంబర్ 21న ప్రపంచ ఫిషరీస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన సదస్సులో పాల్గొన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్.. 2016-17లో దేశంలో 11.41 మిలియన్ టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయని తెలిపారు.
- సమాధానం: 2
2. భారత నావికా దళంలో మొట్ట మొదటిసారిగా ఓ మహిళ పైలట్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) సుభాంగి స్వరూప్
2) సారా అహ్మద్
3) ఆస్తా సెహగల్
4) కవితా మోహన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత నావికా దళంలో మొట్టమొదటి మహిళా పైలట్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుభాంగి స్వరూప్ ఎంపికయ్యారు. మహిళా పైలట్‌గా సుభాంగి హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకడామిలో శిక్షణ పొందుతారు.
- సమాధానం: 1
3. స్వయం సహాయక బృందాలను వ్యాపారాం చేసేలా ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ బ్యాంకు పట్టాభి సీతారామయ్య - స్వయం వ్యాపార సంఘాల పథకాన్ని ప్రారంభించింది ?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) ఐసీఐసీ బ్యాంక్
3) విజయ బ్యాంక్
4) ఆంధ్రాబ్యాంక్
- View Answer
- సమాధానం: 4
వివరణ: స్వయం సహాయక బృందాలు(SHG) వ్యాపారాం చేసేలా ప్రోత్సహించేందుకుఆంధ్రాబ్యాంక్పట్టాభి సీతారామయ్య-స్వయం వ్యాపార సంఘాల పథకం(PS-SBG)ని ప్రారంభించింది. ఆంధ్రబ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య. నవంబర్ 24న ఆయన 138వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రబ్యాంక్ ఇటీవల ఈ పథకాన్ని ప్రారంభించింది.
- సమాధానం: 4
4. దూరదర్శన్ న్యూస్ కొత్త డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) బర్కా దత్
2) అర్నబ్ గోస్వామి
3) సుప్రీయా సాహు
4) ఇరా జోషి
- View Answer
- సమాధానం: 4
వివరణ: దూరదర్శన్ న్యూస్ డెరైక్టర్ జనరల్‌గా ఇరా జోషిని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఇటీవల నియమించింది. ఆమెకన్నా ముందు ఈ పదవిలో ఉన్న వీణా జైన్ 2017 ఆగస్టులో పదవీ విరమణ చేశారు.
- సమాధానం: 4
5. దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ?
1) 115
2) 130
3) 145
4) 160
- View Answer
- సమాధానం: 1
వివరణ: గ్రామీణ మహిళల్లో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా బాగా వెనకబడిన 115 జిల్లాల్లో ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది.
- సమాధానం: 1
6. బాలికల రక్షణ, చదువు కోసం ప్రవేశపెట్టిన బేటీ బచావ్ - బేటీ పడావ్ పథకాన్ని ఎన్ని జిల్లాలకు విస్తరించాలని ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయించింది ?
1) 560
2) 450
3) 640
4) 370
- View Answer
- సమాధానం: 3
వివరణ: బేటీ బచావ్ - బేటీ పడావ్ పథకాన్ని 2015 జనవరి 22న ప్రారంభించారు. ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని 640 జిల్లాలకు విస్తరించే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. అలాగే లైంగిక హింస బాధితులకు సాంత్వన చేకూర్చేందుక మరో 150 వన్ స్టాప్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ది నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కార్యక్రమం కింద ఈ పథకాలను చేపట్టనున్నారు.
- సమాధానం: 3
7. బ్యాంకు ఖాతాల నిర్వహణ, రుణాల దరఖాస్తు, ఆన్లైన్ షాపింగ్ తదితర సేవలకు యోనో(YONO - You only need one) పేరుతో కొత్త యాప్‌ను ఇటీవల ఏ బ్యాంకు అందుబాటులోకి తెచ్చింది ?
1) కెనరా బ్యాంక్
2) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన యోనో యాప్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నవంబర్ 24న ఆవిష్కరించారు. ఆన్లైన్లోనే బ్యాంకు ఖాతా తెరవడం, లావాదేవీలు నిర్వహించడం, రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆన్లైన్ షాపింగ్ వంటి సేవలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
- సమాధానం: 3
8. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్ ఇటీవల భారత్ కు స్టేబుల్ అవుట్‌లుక్‌తో ఏ రేటింగ్‌ను ఇచ్చింది ?
1) AA +
2) AAA -
3) BBB -
4) BB +
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్(ఎస్ అండ్ పీ) గతంలో భారత్‌కు ఇచ్చిన బీబీబీ - మైనస్ స్టేబుల్ అవుట్‌లుక్ రేటింగ్‌ను అదే విధంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది. స్టేబుల్ అవుట్‌లుక్ అనేది భారత పటిష్ట వృద్ధికి సంకేతమని వివరించింది.
- సమాధానం: 3
9. తమ దేశం నుంచి ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లిన రోహింగ్యా ముస్లింలను తిరిగి రప్పించేందుకు మయన్మార్ ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ఆఫ్గనిస్తాన్
2) బంగ్లాదేశ్
3) యూఏఈ
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2017 ఆగస్టులో మయన్మార్‌లో రోహింగ్యా తిరుగుబాటు దారులు, ఆ దేశ సైన్యం మధ్య పరస్పర దాడులు జరిగాయి. రాను రాను ఇవి మరింత తీవ్ర రూపం దాల్చడంతో లక్షల మంది రోహింగ్యా ముస్లింలు సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటు బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా తరలివెళ్లారు. అలా వెళ్లిన వారందరినీ వెనక్కి రప్పించేందుకు మయన్మార్, బంగ్లాదేశ్ మధ్య నవంబర్ 23న అవగాహన ఒప్పందం కుదిరింది.
- సమాధానం: 2
10. భారత్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) నవంబర్ 26
2) నవంబర్ 27
3) నవంబర్ 28
4) నవంబర్ 29
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాజ్యాంగం గొప్పదనాన్ని గుర్తు చేసుకోవడానికి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
- సమాధానం: 1
11. చైనాలో జరిగిన ఆసియాన్ మారథాన్ చాంపియన్‌షిప్ - 2017ను ఎవరు గెలుపొందారు ?
1) రామ్ యాదవ్
2) ఆండ్రే పెట్రోవ్
3) బ్యాంబలేవ్ సేవీన్రదన్
4) గోపీ థొనకల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత్ అథ్లెట్ గోపీ థొనకల్ ఆసియాన్ మారథాన్ చాంపియన్‌షిప్ - 2017ను గెలుపొందాడు. తద్వారా ఈ చాంపియన్‌షిప్‌ను గెలుపొందిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు.
- సమాధానం: 4
12. అయోధ్య సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చాటేందుకు 2018లో అయోధ్య మహోత్సవ్‌ని దేశం నిర్వహించనుంది ?
1) ఉత్తర కొరియా
2) వియత్నాం
3) ఇండోనేషియా
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: అయోధ్య సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చాటే ఉద్దేశంతో 2018లో దక్షిణ కొరియాలో అయోధ్య మహోత్సవ్ జరగనుంది. ప్రతిగా భారత్ లోని లక్నో, అయోధ్యలో కొరియా ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
- సమాధానం: 4
13. The Ajeya Warrior 2017 పేరుతో భారత్ ఇటీవల ఏ దేశంతో కలిసి సంయుక్త సైనిక శిక్షణ విన్యాసాలు నిర్వహించింది ?
1) అమెరికా
2) యూఏఈ
3) ఉక్రెయిన్
4) యునెటైడ్ కింగ్ డమ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: The Ajeya Warrior 2017 పేరుతో భారత్ ఇటీవల యునెటైడ్ కింగ్ డమ్‌తో కలిసి మూడోసారి సంయుక్త సైనిక శిక్షణ విన్యాసాలు నిర్వహించింది. రాజస్తాన్ బికనీర్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ విన్యాసాలు జరిగాయి. భారత్, యూకే 2013లో తొలిసారి ఈ విన్యాసాలను కర్ణాటకలోని బెల్గాంలో నిర్వహించాయి.
- సమాధానం: 4
14. ఇటీవల 15వ ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం.. చైర్మన్‌గా ఎవరిని నియమించింది ?
1) ఎన్ కే సింగ్
2) శక్తికాంత్ దాస్
3) అనూప్ సింగ్
4) రమేశ్ చంద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు ఎన్ కే సింగ్‌ను 15వ ఫైనాన్స కమిషన్ చైర్మన్‌గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ 2020 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి తగిని సిఫార్సులు చేస్తుంది. కమిషన్‌లో మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరి సభ్యులుగా ఉన్నారు.
- సమాధానం: 1
15. అబుదాబి గ్రాండ్ ప్రీ - 2017 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) వాల్తెరి బొటాస్
2) లూయిస్ హామిల్టన్
3) సెబాస్టియన్ వెటెల్
4) మాక్స్ వెర్స్టాపెన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 ఫార్ములా వన్ సీజన్లో చివరి రేసు అయిన అబుదాబి గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడీస్ డ్రైవర్ వాల్తెరీ బొటాస్ గెలుచుకున్నాడు.
- సమాధానం: 1
16. మిస్ యూనివర్స్ - 2017 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) లారా గొంజాలెజ్
2) డెమీ లీగ్ నెల్ పీటర్స్
3) డవీన్ బెన్నెట్
4) మొనాలిసా అల్కాంటారా
- View Answer
- సమాధానం: 2
వివరణ: దక్షిణాఫ్రికాకు చెందిన డెమీ లెయిగ్ నెల్ పీటర్స్ మిస్ యూనివర్స్-2017 టైటిల్‌ను గెలుచుకుంది. ఈ పోటీలు అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగాయి.
- సమాధానం: 2
17. దేశంలో అత్యవసర పరిస్థితులని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ ఏ దేశ సహాయంతో జాతీయ సంక్షోభ నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ?
1) అమెరికా
2) రష్యా
3) ఇజ్రాయెల్
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కునేందుకు జాతీయ సంక్షోభ నిర్వహణ కేంద్రాన్ని (National Crisis Management Centre (NCMC)) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన చర్చల్లో ఈ కేంద్రం ఏర్పాటులో సహకరించేందుకు రష్యా అంగీకరించింది.
- సమాధానం: 2
18. ఐరాస పర్యావరణ ప్రోగ్రామ్ (UNEP) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న రసాయనాల విడుదలను పూర్తిగా నిర్మూలించేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు 2018 నుంచి మూడేళ్ల పాటు ఎన్ని మిలియన్ డాలర్ల నిధులను అందించనున్నాయి ?
1) 540 మిలియన్ డాలర్లు
2) 440 మిలియన్ డాలర్లు
3) 340 మిలియన్ డాలర్లు
4) 240 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐరాస పర్యావరణ ప్రోగ్రామ్ (UNEP) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న రసాయనాల విడుదలను పూర్తిగా నిర్మూలించేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు 2018 నుంచి మూడేళ్ల పాటు 540 మిలియన్ డాలర్ల నిధులను అందించనున్నాయి. మాంట్రియాల్ ప్రోటోకాల్ అమలులో భాగంగా ఈ నిధులు ఇవ్వనున్నాయి.
- సమాధానం: 1
19. ఇండియన్ స్పోర్ట్స హానర్స్ - 2017లో వ్యక్తిగత క్రీడల విభాగంలో స్పార్ట్స ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఎవరికి ప్రకటించారు ?
1) సానియా మిర్జా
2) దీపా మలిక్
3) పీవీ సింధు
4) అదితి అశోక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇండియన్ స్పార్ట్స హానర్స్ తొలి ఎడిషన్ ఇటీవల ముంబైలో జరిగింది. వ్యక్తిగత క్రీడల విభాగంలో స్పోర్ట్స ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పీవీ సింధు, స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని కిదాంబి శ్రీకాంత్ అందుకున్నారు. టీమ్ స్పోర్ట్స విభాగంలో క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు స్పోర్ట్స మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని, స్పోర్ట్స ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మిథాలి రాజ్‌కు ప్రదానం చేశారు.
- సమాధానం: 3
20. ఉహురు కెన్యట్టా ఇటీవల ఏ దేశానికి వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ?
1) ఉగాండా
2) కెన్యా
3) ఇథియోపియా
4) సుడాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కెన్యాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఉహురా కెన్యట్టా తన ప్రత్యర్థి రైలా ఒడింగాను ఓడించి వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
- సమాధానం: 2
21. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి ?
1) అమెజాన్ సంగిని
2) అమెజాన్ సఖి
3) అమెజాన్ సాక్షమ్
4) అమెజాన్ సహేలి
- View Answer
- సమాధానం: 4
వివరణ: మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం ద్వారా వారిని శక్తిమంతంగా మార్చే లక్ష్యంతో అమెజాన ఇండియా ‘‘అమెజాన్ సహేలి’’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మహిళలు రూపొందించిన ఉత్పత్తులకు అమెజాన్.ఇన్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది.
- సమాధానం: 4
22. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ యాంటీ- ప్రాఫిటీరింగ్ అథారిటీ చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) బీ ఎన్ శర్మ
2) అరుణ్ గోయల్
3) సంతోష్ కుమార్
4) సుశీల్ చంద్రా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 జూలై 1 నుంచి దేశంలో వస్తు సేవల పన్ను విధానం అమల్లోకి వచ్చింది. ఈ జీఎస్టీ చట్టం ప్రకారం జాతీయ అక్రమ సంపాదన వ్యతిరేక అథారిటీ (National Anti&Profiteering Authority-NAA)ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇటీవల దీనికి చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి బీఎన్ శర్మను నియమించింది.
- సమాధానం: 1
23. ఆసియాన్ కబడ్డీ చాంపియన్‌షిప్ - 2017లో పురుషుల టీమ్ టైటిల్‌ను ఏ దేశ జట్టు గెలుచుకుంది ?
1) భారత్
2) ఇరాన్
3) పాకిస్తాన్
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆసియాన్ కబడ్డీ చాంపియన్‌షిప్ ఇటీవల ఇరాన్లో జరిగింది. ఈ టోర్నీ ఫైనల్లో భారత పురుషుల జట్టు 36-22 తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. భారత మహిళల జట్టు దక్షిణ కొరియాను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది.
- సమాధానం: 1
24. లోక్‌సభ తొలి మహిళా సెక్రెటరీ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) మీనాక్షి లేఖి
2) రాణి నారాహ
3) స్నేహలతా శ్రీవాత్సవ
4) అరుణ సుందరరాజన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: లోక్‌సభ తొలి మహిళా సెక్రెటరీ జనరల్‌గా 1982 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి స్నేహలతా శ్రీవాత్సవ నియమితులయ్యారు. నవంబర్ 30న అనూప్ మిశ్రా పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో నియమితులైన స్నేహలతా శ్రీవాత్సవ డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టారు. 2018 నవంబర్ 30 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు.
- సమాధానం: 3
25. న్యూజిలాండ్‌కు చెందిన వ్యాపారవేత్త నిక్ గెర్రిట్సెస్ రూపొందించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సతో పనిచేసే ప్రపంచంలోనే తొలి వర్చువల్ రాజకీయ నేత పేరు ఏమిటి ?
1) TIM
2) JOE
3) KEY
4) SAM
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచంలోనే కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స)తో పనిచేసే తొలి వర్చువల్ రాజకీయ నేత ‘శామ్’ను న్యూజిలాండ్‌కు చెందిన ఎంట్రప్రెన్యూర్ నిక్ గెర్రిట్‌సెన్ రూపొందించారు. ఫేస్బుక్ మెసెంజర్‌తో పాటు తన హోమ్‌పేజ్‌లో ఉన్న సర్వేల సాయంతో విషయాల్ని నేర్చుకునే శామ్.. ప్రపంచవ్యాప్తంగా విద్య, వలసలు, ఇళ్లు సహా పలు అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తుంది.
- సమాధానం: 4
26. ఇటీవల జరిగిన 48వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో గోల్డెన్ పీకాక్ అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది ?
1) ఏంజెల్స్ వేర్ వైట్
2) టేక్ ఆఫ్
3) 120 బీట్స్ పర్ మినెట్
4) వియిజో కలవెరా
- View Answer
- సమాధానం: 3
వివరణ: 48వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ఇటీవల గోవాలో జరిగింది. ఈ వేడుకల్లో రోబిన్ కాంపిల్లో దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ సినిమా 120 బీట్స్ పర్ మినెట్ గోల్డెన్ పీకాక్ అవార్డు గెలుచుకుంది.
- సమాధానం: 3
27. పురుషుల టెన్నిస్ టైటిల్ డేవిస్ కప్ - 2017ను ఏ దేశం గెలుచుకుంది ?
1) ఫ్రాన్స్
2) బెల్జియం
3) ఆస్ట్రేలియా
4) న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 10వ డేవిస్ కప్‌ను ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. ఫైనల్లో 3-2తో బెల్జియంను ఓడించి ఫ్రాన్స్ ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 1
28. వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రైతులకు అందించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘‘జై కిసాన్’’ అనే యాప్‌ను ఆవిష్కరించింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) గోవా
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 3
వివరణ: వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రైతులకు అందించేందుకు గోవా ప్రభుత్వం ‘‘జై కిసాన్’’ పేరుతో ప్రత్యేకా యూప్‌ను రూపొందించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికల్ ఇటీవల యాప్‌ను ఆవిష్కరించారు.
- సమాధానం: 3
29. ఇటీవల ఏ దేశం.. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టామని ప్రకటించింది ?
1) సిరియా
2) ఇరాన్
3) ఇరాక్
4) ఈజిప్ట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రూనీ 2017 నవంబర్ 21న ప్రకటించారు. తరచుగా ఉగ్ర దాడులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇరాన్.. ఇస్లామిక్ స్టేట్‌పై యుద్ధం ప్రకటించింది. నవంబర్ 18 నాటికి ఐఎస్‌ను నిర్మూలించామని ఇరాన్ సైన్యం ప్రకటించింది.
- సమాధానం: 2
30. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సీరీస్ - 2017 మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) పీవీ సింధు
2) తై జ యింగ్
3) సైనా నెహ్వాల్
4) నోజోమి ఓకుహారా
- View Answer
- సమాధానం: 2
వివరణ: బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనీస్ తైపీ ప్లేయర్ తై జు యింగ్, భారత్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుని ఓడించి విజేతగా నిలిచింది.
- సమాధానం: 2
31. ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ - 2017 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) అమీర్ నర్థోష్
2) పంకజ్ అద్వానీ
3) మార్క్ సెల్బీ
4) జాన్ హిగ్గిన్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత క్యూ స్పోర్ట్స(బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో ఇరాన్‌కు చెందిన అమీర్ నర్థోష్ను ఓడించి టైటిల్‌ను గెలుచుకన్నాడు. పంకజ్‌కు కెరీర్లో ఇది 18వ ప్రపంచ కప్ టైటిల్.
- సమాధానం: 2
32. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కొత్త మేనేజింగ్ డెరైక్టర్, సీఎండిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) సత్యేంద్ర కుమార్ మిశ్రా
2) ప్రదీప్ సింగ్ ఖరోలా
3) పంకజ్ శ్రీవాత్సవ
4) రవీంద్ర కుమార్ త్యాగి
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ కొత్త సీఎండీగా ప్రదీప్ సింగ్ ఖరోలా నియమితులయ్యారు. ఆయన 1985 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి.
- సమాధానం: 2
33. ఈ కింది వారిలో ఎవరికి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అందించే ఓజోన్ అవార్డు - 2017ను ప్రకటించారు ?
1) అనిల్ దవే
2) హర్ష వర్దన్
3) వెంకయ్య నాయుడు
4) మేనకా గాంధీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర పర్యావరణశాఖ మాజీ మంత్రి అనిల్ దవే, సెంటర్ ఫర్ సైన్స అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) డిప్యూటీ డెరైక్టర్ చంద్ర భూషణ్‌లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అందించే ఓజోన్ అవార్డులకు ఎంపికయ్యారు. రువాండాలో గత ఏడాది కిగాలీ ఒప్పందం కుదరడంలో దవే చొరవకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం ‘రాజకీయ నాయకత్వ అవార్డు’ను ప్రకటించారు. దవే తరఫున భారత పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి అవార్డు స్వీకరించారు. కిగాలీ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించినందుకు చంద్రభూషణ్‌కు భాగస్వామ్య అవార్డు లభించింది.
- సమాధానం: 1
34. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సైకియాట్రి నుంచి ‘డాక్టర్ అమిత్ బోరా ఆరేషన్ అవార్డు - 2017’ కు ఎవరు ఎంపికయ్యారు ?
1) డా. నాగేశ్వరరెడ్డి
2) డా. వినితా రెడ్డి
3) డా. ఏజీకే గోఖలే
4) డా. రామారెడ్డి
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్యులు, బీసీరాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డికి ‘డాక్టర్ అమిత్ బోరా ఆరేషన్ అవార్డు’ లభించింది. అకాల మరణం పొందిన యువ మానసిక వైద్యుడు అమిత్ బోరా పేరు మీదుగా ఆయన తల్లిదండ్రులు ప్రతి ఏడాది ఈ అవార్డును అందిస్తున్నారు.
- సమాధానం: 4
35. 8వ గ్లోబల్ ఎంట్రప్రెన్యుర్‌షిప్ సదస్సు(GES) ఇటీవల భారత్‌లోని ఏ నగరంలో జరిగింది ?
1) ముంబై
2) హైదరాబాద్
3) బెంగళూరు
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్, అమెరికా సంయుక్తంగా 8వ గ్లోబల్ ఎంట్రప్రెన్యుర్‌షిప్ సదస్సుని నవంబర్ 28 - 30 వరకు హైదరాబాద్‌లో నిర్వహించాయి. ఈ సదస్సుని ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు, కూతురు ఇవాంకా ట్రంప్‌తో కలిసి ప్రారంభించారు.
Theme : Women First, Prosperity for All
- సమాధానం: 2
36. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో మెట్రో రైలుని ఏ తేదీన ప్రారంభించారు ?
1) నవంబర్ 27
2) నవంబర్ 28
3) నవంబర్ 29
4) నవంబర్ 30
- View Answer
- సమాధానం: 2
వివరణ: హైదరాబాద్‌లో మెట్రో రైలుని ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో కలిసి నవంబర్ 28న ప్రారంభించారు. అనంతరం మెట్రో పైలాన్, మెట్రో జర్నీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన టీ-సవారీ మొబైల్ యాప్‌ని ఆవిష్కరించారు. మెట్రో తొలి దశలో నాగోల్-అమీర్ పేట్ (17 కిలోమీటర్లు), మియాపూర్-అమీర్‌పేట్ (13 కిలోమీటర్లు), మొత్తంగా 30 కిలోమీటర్ల మార్గంలో రవాణా సేవలు ప్రారంభమయ్యాయి.
- సమాధానం: 2
37. ఎన్‌వోటీటీవో ఇటీవల వెల్లడించిన 2017 నివేదిక ప్రకారం అవయవ దానంలో ఏ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: అవయవదానంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇందుకు గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌వోటీటీవో) ఈ అవార్డును ప్రకటించింది. నవంబర్ 27న ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’ సందర్భంగా అవార్డుని ప్రదానం చేశారు.
- సమాధానం: 1
38. చంఢీగఢ్ సాహిత్య సొసైటీ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఇటీవల ఎవరు అందుకున్నారు ?
1) విక్రమ్ సేథ్
2) రస్కిన్ బాండ్
3) చేతన్ భగత్
4) అరుంధతి రాయ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రముఖ రచయిత, పద్మభూషణ్ రస్కిన్ బాండ్ చంఢీగడ్ సాహిత్య సొసైటీ నుంచి ఇటీవల జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. చంఢీగడ్ 5వ సాహిత్య ఉత్సవంలో భాగంగా ఆయనకు ఈ అవార్డుని అందజేశారు.
- సమాధానం: 2
39. అంతర్జాతీయ బహుముఖ సముద్ర శోధన, రక్షణ విన్యాసాలు - 2017(IMMSAREX 2017) ఇటీవల ఏ దేశంలో జరిగాయి ?
1) చైనా
2) భారత్
3) బంగ్లాదేశ్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 3
వివరణ: అంతర్జాతీయ బహుముఖ సముద్ర శోధన, రక్షణ విన్యాసాలు - 2017(IMMSAREX 2017) ఇటీవల బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్లో జరిగాయి. ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియమ్ పర్యవేక్షణలో ఈ విన్యాసాలు జరిగాయి. భారత నౌకాదళం చీఫ్ సునీల్ లాంబా ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు.
- సమాధానం: 3
40. 3వ ICCR Distinguished indologist అవార్డుని ఇటీవల ఎవరికి ప్రకటించారు ?
1) హరోషి మారుయి
2) ఎం డేవిడ్ ఎకెల్
3) జాన్ కీష్ నిక్
4) ఫ్రాన్సెస్ గారెట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇండాలజీ స్టడీస్‌లో చేసిన కృషికి గాను జపాన్‌కు చెందిన హిరోషి మారుయి 3వ ICCR Distinguished indologist అవార్డుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. భారత దేశ చరిత్ర, సంస్కృతి, భాషలు, సాహిత్యంలో అకడమిక్ పరిశోధనలను ఇండాలజీ అంటారు.
- సమాధానం: 1
41. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ - 2017లో స్వర్ణాన్ని గెలుచుకున్న భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు ?
1) కవితా దేవి
2) సాయిఖోమ్ మీరాబాయి చాను
3) గీతా రాణి
4) స్వాతి సింగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికాలోని అనాహెమ్లో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణాన్ని గెలుచుకుంది. తద్వారా కరణం మల్లీశ్వరీ(1994, 1995లో స్వర్ణం) తర్వాత ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ గెలిచిన అథ్లెట్‌గా మీరాబాయి గుర్తింపు పొందింది.
- సమాధానం: 2
42. ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంకుని ఎవరు ప్రారంభించారు ?
1) అరుణ్ జైట్లీ
2) నరేంద్ర మోదీ
3) రామ్ నాథ్ కోవింద్
4) ఉర్జిత్ పటేల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో అతిపెద్ద డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం.. ఇటీవల పేమెంట్స్ బ్యాంకుని ప్రవేశపెట్టింది. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లాంఛనగా ప్రారంభించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాదారులకు జీరో బ్యాలెన్స అకౌంట్, ఎలాంటి రుసుములు లేకుండా ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, యూపీఐ లావాదేవీలు నిర్వహించుకునే సదుపాయం కల్పిస్తుంది. ఈ సేవలు పొందేందుకు ఖాతాదారులు ఏడాదికి వంద రూపాయల వార్షిక సబ్స్కిప్ష్రన్ ఫీజు చెల్లించాలి.
- సమాధానం: 1
43. తొలి నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ సమ్మిట్ - 2017 ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ?
1) మిజోరం
2) మేఘాలయ
3) మణిపూర్
4) నాగాలాండ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: తొలి నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ సమ్మిట్ మణిపూర్‌లో నవంబర్ 21 - 22 వరకు జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్, వెదురు పరిశ్రమలు, మత్స్య రంగంలో ఇతర ప్రాంతాల నుంచి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ఈ సమ్మిట్‌ను నిర్వహించారు.
- సమాధానం: 3
44. ఇన్సిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసీస్(IDSA) ప్రెసిడెంట్‌గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) సుభాష్ భమ్రే
2) నిర్మలా సీతారామన్
3) మనోహర్ పారికర్
4) అరుణ్ జైట్లీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఇన్సిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసీస్(IDSA) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 1965లో ఏర్పాటైన ఈ సంస్థ రక్షణ రంగంలో పరిశోధన, విధాన రూపకల్పనలపై అధ్యయనం చేస్తుంది.
- సమాధానం: 2
45. 2020లో జరిగే 36వ అంతర్జాతీయ జియోలాజికల్ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది ?
1) భారత్
2) చైనా
3) ఆస్ట్రేలియా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2020లో 36వ అంతర్జాతీయ జియోలాజికల్ కాంగ్రెస్ భారత రాజధాని న్యూఢిల్లీలో జరగనుంది.
- సమాధానం: 1
46. డిజిటల్ లాకర్ సర్వీసెస్ అభివృద్ధి, ఏర్పాటులో భారత్ ఏ దేశానికి సాంకేతిక సహకారం అందించనుంది ?
1) దక్షిణ కొరియా
2) మారిషస్
3) మయన్మార్
4) మలేషియా
- View Answer
- సమాధానం: 2
47. ఇటీవల లండన్‌లోని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ప్రపంచంలో అత్యధిక మంది సందర్శించిన పుణ్యక్షేత్రంగా అవార్డు పొందిన పవిత్ర క్షేత్రం ఏది ?
1) జగన్నాథ దేవాలయం
2) వైష్ణోదేవి దేవాలయం
3) హజీ అలీ దర్గా
4) గోల్డెన్ టెంపుల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: గోల్డెన్ టెంపుల్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంది. ప్రపంచంలో అత్యధిక మంది ఈ దేవాలయాన్ని సందర్శించారని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది.
- సమాధానం: 4
48. చేపల ఉత్పత్తిని పెంచేందుకు ఇటీవల ఏ రాష్ట్రం ‘‘ఫిష్ పాండ్ యోజన’’ పథకాన్ని ప్రారంభించింది ?
1) కేరళ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఒడిశాలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు ‘‘ఫిష్ పాండ్ యోజన’’ పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటీవల ప్రారంభించారు. ఈ పథకం అమలుకు 96 కోట్ల రూపాయలు కేటాయించారు.
- సమాధానం: 4
49. ఆసియా అభివృద్ధి బ్యాంకు - ADB, 2018 నుంచి 2022 వరకు భారత్‌కు ఇచ్చే వార్షిక రుణాన్ని ఎంతకు పెంచింది ?
1) 2.6 బిలియన్ డాలర్లు
2) 3 బిలియన్ డాలర్లు
3) 4 బిలియన్ డాలర్లు
4) 5 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్‌లో ఆర్థికాభివృద్ధి కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏటా ఇచ్చే వార్షిక రుణాన్ని 4 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించింది. 2018 నుంచి 2022 వరకు ఏటా 4 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించనుంది.
- సమాధానం: 3
50. కింది వాటిలో ఏ దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు భారత్ 2.87 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఇటీవల అంగీకరించింది ?
1) ఆఫ్గనిస్తాన్
2) బంగ్లాదేశ్
3) మయన్మార్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆఫ్గనిస్తాన్‌లో ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు భారత్ 2.87 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఇటీవల అంగీకరించింది.
- సమాధానం: 1