కరెంట్ అఫైర్స్ ( మార్చి 9 - 16, 2017) బిట్ బ్యాంక్
1. బరూచ్ వంతెనను ఏ నదిపై నిర్మించారు ?
1) నర్మదా
2) గోదావరి
3) కృష్ణా
4) గంగా
- View Answer
- సమాధానం: 1
వివరణ: గుజరాత్‌లోని బరూచ్ వద్ద నర్మదా నదిపై నిర్మించిన వంతెన దేశంలోనే అతి పొడవైన కేబుల్ వంతెనగా గుర్తింపు పొందింది. 216 కేబుల్స్‌తో 1.3 కిలోమీటర్ల పొడవైన వంతెనను ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది.
- సమాధానం: 1
2. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అవినీతిలో తొలిస్థానంలో ఉన్న దేశం ?
1) వియత్నాం
2) థాయ్‌లాండ్
3) భారత్
4) చైనా
- View Answer
- సమాధానం: 3
వివరణ: బెర్లిన్‌కు చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. భారత్‌లో 69 శాతం మంది ప్రజలు తమ పనులకు అధికారులు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని చెప్పారని సర్వే పేర్కొంది. రెండో స్థానంలో ఉన్న వియత్నాంలో 65 శాతం మంది, మూడో స్థానంలో ఉన్న థాయ్‌లాండ్‌లో 41 శాతం అవినీతి ఉంది.
- సమాధానం: 3
3. ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ శిఖరాగ్ర సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) కొలంబో
2) జకర్తా
3) సింగపూర్
4) కౌలాలంపూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జకార్తాలో జరిగిన ఈ సమావేశానికి 21 దేశాధినేతలు హాజరయ్యారు. భారత్ నుంచి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. హిందూ మహాసముద్రంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధిపై ఇందులో చర్చించారు.
- సమాధానం: 2
4. యుజిసి 12591 గెలాక్సీని కనుగొన్న అంతరిక్ష టెలిస్కోప్ ఏది ?
1) ఏజిల్
2) గ్రాంట్
3) హబుల్
4) సాస్ - 2
- View Answer
- సమాధానం: 3
వివరణ: భూమికి 400 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో గల యూజిసి 12591 గెలాక్సిని హబుల్ టెలిస్కోప్ కనుగొంది. ఇది పాలపుంత కంటే 4 రెట్లు ద్రవ్యరాశిని కలిగి ఉంది.
- సమాధానం: 3
5. గ్రేట్ బ్యాక్ యార్డ్ కౌంట్ 2017 ప్రకారం అత్యధిక పక్షి జాతులు గల ప్రాంతం ?
1) తెలంగాణ
2) కేరళ
3) మేఘాలయ
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కార్నెల్ ల్యాబ్ ఆఫ్ ఆర్నిథాలజీ అండ్ నేషనల్ ఆడుబోన్ సొసైటీ సంయుక్తంగా 1998 నుంచి ఏటా ఫిబ్రవరిలో పక్షి జాతుల సర్వే నిర్వహిస్తునాయి. 2017 సర్వే ప్రకారం 45 శాతం (564) పక్షిజాతులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి.
- సమాధానం: 4
6. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి 8
2) మార్చి 10
3) మార్చి 12
4) మార్చి 14
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1900 నుంచి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో స్వచ్ఛశక్తి పేరుతో మహిళా సర్పంచుల సమావేశాన్ని నిర్వహించారు. మహిళా చేనేత కార్మికులు, హస్త కళల కళాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కమలాదేవీ ఛటోపాద్యాయ పురస్కారాన్ని ప్రారంభించారు.
- సమాధానం: 1
7. 10వ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ గవర్నెన్స్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) బీజింగ్
2) ఉలాన్ బాటర్
3) బాకు
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ మరియు యునెస్కో సహకారంతో న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు " International Conference on theory and practice of electronic governance " ను నిర్వహించారు.
- సమాధానం: 4
8. 5వ భారత - నైలు సాంస్కృతిక ఉత్సవాలను ఎక్కడ నిర్వహించారు ?
1) ఉగాండా
2) దక్షిణ సుడాన్
3) సుడాన్
4) ఈజిప్ట్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈజిప్ట్‌తో సత్సంబంధాల బలోపేతానికి భారత్ - నైలు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భారత సంస్కృతి, కళలు, నృత్యాలు, సంగీతం, ఆహారం, యోగాను ప్రదర్శించారు. దీనికి ఈజిప్ట్‌లో నిర్వహించే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా కూడాగుర్తింపు ఉంది.
- సమాధానం: 4
9. ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ - 2016 పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) మనోజ్ దాస్
2) దిపిల్ కౌర్ తివానా
3) మహబలేశ్వర్ సెయిల్
4) గోవింద చంద్ర పాండే
- View Answer
- సమాధానం: 3
వివరణ: కొంకణి రచయిత మహబలేశ్వర్ సెయిల్ రచించిన హవథాన్ పుస్తకానికి గాను ఆయనకు సరస్వతీ సమ్మాన్ పురస్కారం దక్కింది. ఈ అవార్డును కె.కె. బిర్లా ఫౌండేషన్ 1991లో ప్రారంభించింది. భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో చేసిన రచనల్లో ఒక ఉత్తమ రచనకు సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని అందజేస్తారు.
- సమాధానం: 3
10. హార్వర్డ్ ఫౌండేషన్ నుంచి ఆర్టిస్ ఆఫ్ ది ఇయర్ 2017 పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) వయోల డేవిస్
2) జెన్నిఫర్ లారెన్స్
3) ఎమ్మా స్టోన్
4) మెగాన్ ఫాక్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 32వ సాంస్కృతిక రిథమ్ ఉత్సవాల్లో వయోల డేవిస్‌కు హార్వర్డ్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
- సమాధానం: 1
11. ఇటీవల జల ప్రవేశం చేసిన ఇండియన్ జెట్ ఫాస్ట్ ఎటాక్ నౌక ఏది ?
1) INS Tillanchang
2) INS Tarmugli
3) INS Tihaya
4) INS Mohiri
- View Answer
- సమాధానం: 1
వివరణ: INS Tillanchang జెట్ ఫాస్ట్ ఎటాక్ తరగతికి చెందిన 3వ నౌక. దీని పొడవు 50 మీటర్లు. ఇది గరిష్ఠంగా 35 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది.
- సమాధానం: 1
12. ప్రపంచంలో అతి చిన్న అయస్కాంతాన్ని తయారు చేసిన సంస్థ ఏది ?
1) ఇన్ఫోసిస్
2) ఫోర్డ్
3) ఐబిఎమ్
4) ఆపిల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రస్తుతం హార్డ్ డిస్క్ డ్రైవ్‌లలో ఒక బిట్ సమాచారాన్ని నిల్వ చేసేందుకు 1,00000 అణువులు ఉపయోగిస్తున్నారు. ఐబిఎమ్ సంస్థ ఒకే అణువుతో తయారు చేసిన అతి చిన్న అయస్కాంతం ఒక బిట్ సమాచారాన్ని నిల్వ చేసుకోలగదు.
- సమాధానం: 3
13. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) మార్చి మొదటి శుక్రవారం
2) మార్చి రెండో శుక్రవారం
3) మార్చి రెండో గురువారం
4) మార్చి మొదటి శనివారం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా మార్చి రెండవ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహిస్తాయి.
- సమాధానం: 3
14. కేంద్ర ప్రభుత్వం ప్రసూతి సెలవులను ఎన్ని రోజులకు పెంచింది ?
1) 6 వారాలు
2) 12 వారాలు
3) 20 వారాలు
4) 26 వారాలు
- View Answer
- సమాధానం: 4
వివరణ: సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగినులకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతూ ప్రసూతి సెలవుల చట్టాన్ని సవరించింది. దీంతో ప్రపంచంలో అతి ఎక్కువ ప్రసూతి సెలవులు ఇస్తున్న మూడో దేశంగా భారత్ నిలిచింది. కెనడా 50 వారాలు, నార్వే 44 వారాల సెలవులు ఇస్తున్నాయి.
- సమాధానం: 4
15. మహారాష్ట్రకు చెందిన యానిమల్ అండ్ ఫిషరీస్ యూనివర్సిటీ నుంచి ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందింది ఎవరు ?
1) మోహన్ భగవత్
2) చంద్రశేఖరన్
3) రామ్జి కిషన్
4) కిషన్ చంద్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: గోవులపై పరిశోధనలకు గాను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు డాక్టర్ ప్రదానం చేశారు.
- సమాధానం: 1
16. ఇటీవల సర్వీస్ సొైసైటీ పురస్కారానికి ఎంపికైన యూనివర్సిటీ ?
1) ఐఐటీ ఖరగ్‌పూర్
2) ఐఐడీ ఢిల్లీ
3) ఐఐటీ మద్రాస్
4) ఐఐటీ కోల్కత్తా
- View Answer
- సమాధానం: 3
వివరణ: సోలార్ డీసీ ఇన్వర్టర్ వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు గాను ఐఐటీ మద్రాస్ ఈ పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 3
17. యూరోపియన్ కౌన్సెల్‌కు అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ?
1) టోని అబాట్
2) డొనాల్డ్ టస్క్
3) మార్క్ హంటర్
4) జాన్ రాబర్ట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పోలాండ్ మాజీ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ యూరోపియన్ కౌన్సెల్‌కు రెండోసారి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. పదవీ కాలం రెండు సంవత్సరాలు.
- సమాధానం: 2
18. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ - 2017కు రాయబారిగా ఎవరు వ్యవహరించనున్నారు ?
1) రికీ పాంటింగ్
2) స్టీవ్ వా
3) రాహుల్ ద్రవిడ్
4) సచిన్ టెండూల్కర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2017 జూన్‌లో జరగనున్న మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు రాయబారిగా సచిన్‌ను ఐసీసీ నియమించింది.
- సమాధానం: 4
19. ఇటీవల హొర్ముజ్ - 2 క్షిపణిని పరీక్షించిన దేశం ఏది ?
1) పాకిస్తాన్
2) ఇరాన్
3) సిరియా
4) ఉత్తర కొరియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ క్షిపణి సముద్రంలో 300 కి.మీ. పరిధిలో కదులుతున్న నౌకలను నాశనం చేయగలదు.
- సమాధానం: 2
20. భారత్‌లో జనటికల్ మోడిఫైడ్ కాటన్‌ను అభివృద్ధి చేసినది ?
1) పంజాబ్ వ్యవసాయ యూనివర్సిటీ
2) బెనారస్ హిందూ యూనివర్సిటీ
3) కాకతీయ యూనివర్సిటీ
4) ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: లూథియానాలో ఉన్న పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దేశంలోనే తొలి జెనటకిల్ మోడిఫైడ్ పత్తిని ఉత్పత్తి చేసింది. ఇవి " PAU BT1, F1861, RS2013 ".
- సమాధానం: 1
21. 46వ జాతీయ భద్రతా వారోత్సవాలను ఎప్పుడు నిర్వహించారు ?
1) మార్చి 2 - 8
2) మార్చి 4 - 10
3) మార్చి 6 - 12
4) మార్చి 8 -14
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1966 మార్చి 4న నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 1972 నుంచి ఏటా మార్చి 4 - 10వ వరకూ జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తోంది.
- సమాధానం: 2
22. దేశంలో అతిపెద్ద ప్రవాహ సోలార్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) బందిపూర్
2) జీమ్ కార్బెట్
3) సరిస్కా జాతీయ పార్కు
4) కాయామ్ కులమ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేరళలోని కాయామ్ కులమ్లో ఉన్న రాజీవ్ గాంధీ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ వద్ద తేలియాడే సోలార్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. నీటిపై తేలియాడే ప్లాంట్ వల్ల నీటి ఆవిరి, నిర్వహణ వ్యయం తగ్గుతుంది.
- సమాధానం: 4
23. దేశంలో వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అతిపెద్ద ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) నరేలా - బవానా
2) బడయాన్
3) పానిపట్టు
4) కనోజ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఢిల్లీలోని నరేలా - బవానా వద్ద వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద ప్లాంట్‌ను హైదరాబాద్‌కు చెందిన రాంకీ గ్రూప్ పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసింది. దీని సామర్థ్యం 24 మెగావాట్లు.
- సమాధానం: 1
24. సీఎస్ఐఆర్ - ఎన్ఐఓ శాస్త్రవేత్తలు ఇటీవల ఏ ప్రాంతంలో మూడు కాన్యన్లను కనుగొంది ?
1) నాగపట్నం
2) సేలం
3) కొవ్వాడ
4) మథురై
- View Answer
- సమాధానం: 3
వివరణ: కంది వలస నది వల్ల కొవ్వాడ ప్రాంతంలోని బంగాళాఖాతంలో కాన్యన్లు ( లోతైన అగాధాలు ) ఏర్పిడనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీటి కింద ముడి చమురు లభించే అవకాశం ఉందని ప్రకటించారు.
- సమాధానం: 3
25. మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ - 2016 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) నటాలియా ఓలివైరా
2) జిరాత్ చాయ సిరిమోంగ్ కొల్నవిన్
3) ఆండ్రియా కొలాజో
4) విన్సియా రాబర్ట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: థాయ్‌లాండ్ ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ఈ పోటీలను నిర్వహిస్తారు.
- సమాధానం: 2
26. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంకు ఎంత ?
1) 132
2) 136
3) 139
4) 142
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫిఫా (federation of international football association) ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో అర్జెంటీనా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో జర్మనీ ఉన్నాయి.
- సమాధానం: 1
27. 2017-18 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత ?
1) రూ. లక్ష కోట్లు
2) రూ.1,10,000 కోట్లు
3) రూ.1,49,000 కోట్లు
4) రూ.1,69,464 కోట్లు
- View Answer
- సమాధానం: 3
28. మార్చి 25ను మారణహోమ దినంగా ప్రకటించిన దేశం ఏది ?
1) నేపాల్
2) శ్రీలంక
3) సిరియా
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1971 మార్చి 25న పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో బంగ్లాదేశ్‌లో అనేక మందిని ఊచకోత కోసింది. అందుకే మార్చి 25న బంగ్లాదేశ్ మారణహోమ దినంగా ప్రకటించింది.
- సమాధానం: 4
29. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) లీ చాంగ్ వై
2) షియుకి
3) మార్కస్ గి డోయిన్
4) లీజున్హ్యు
- View Answer
- సమాధానం: 1
వివరణ: టోర్నీ ఫైనల్లో షియుకిని ఓడించి లీ చుంగ్ వై టైటిల్ సొంతం చేసుకున్నాడు.
- సమాధానం: 1
30. హీరో ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ 2017 టైటిల్ విజేత ఎవరు ?
1) యాంగ్ యంగ్ యన్
2) శివ శంకర ప్రసాద్ చౌరాసియా
3) లైంగ్ వెన్ చూంగ్
4) చోయగ్జు
- View Answer
- సమాధానం: 2
వివరణ: హోరీ ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను వరుసగా రెండోసారి గెలుచుకున్న తొలి భారతీయ గోల్ఫర్ శివశంకర ప్రసాద్ చౌరాసియా. ఈ టైటిల్ కింద 2,91,660 డాలర్ల నగదు పురష్కారం లభిస్తుంది.
- సమాధానం: 2
31. ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న జట్టు ఏది ?
1) రైల్వేస్
2) సర్వీసెస్
3) హర్యానా
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: గోవాలో జరిగిన సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో రైల్వేస్‌ను ఓడించి పంజాబ్ టైటిల్ దక్కించుకుంది.
- సమాధానం: 4
32. దేశంలో చేపల పెంపకాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ?
1) రూ. 20,000 కోట్లు
2) రూ. 30,000 కోట్లు
3) రూ. 52,000 కోట్లు
4) రూ. 72,000 కోట్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: నీలి విప్లవం సాధించటం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.52,000 కోట్లతో చిన్న చేపల మిషన్ (Mission Fingerlings) ను ప్రారంభించింది. 2020 - 2021 లోపు చేపల ఉత్పత్తిని 10.79 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
- సమాధానం: 3
33. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అరటి పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తోంది ?
1) వైశాలి
2) అవంతి
3) థౌలి
4) సారనాథ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బిహార్ రాష్ట్రంలోని వైశాలి ప్రాంతంలో గల గోరొలెలో అరటి పరిశోధన కేంద్రానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు.
- సమాధానం: 1
34. మెర్సర్ సంస్థ నివేదిక ప్రకారం భారత్‌లో జీవించ డానికి ఉత్తమ ప్రమాణాలు ఉన్న నగరం ?
1) ముంబయి
2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
వివరణ: జీవన ప్రమాణాల ఆధారంగా మెర్సెర్ సంస్థ ఉత్తమ నగరాల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌లో ఉత్తమ నగరంగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో ఉత్తమ నగరంగా వియత్నాం ఎంపికైంది.
- సమాధానం: 3
35. ప్రపంచంలో తొలి ఫ్లోరోసెంట్ కప్పను ఎక్కడ కనుగొన్నారు ?
1) బ్రెజిల్
2) అర్జెంటీనా
3) ఈక్వెడార్
4) చిలీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆకుపచ్చ, పుసుపు, ఎరుపు రంగులను వెలువరించే కప్పను అర్జెంటీనాలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- సమాధానం: 2
36. కోర్ట్ ఆఫ్ ఆర్బిటేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇటీవల ఎవరిపై జీవితకాల నిషేధం విధించింది ?
1) సురేష్ కల్మాడీ
2) విజేందర్ సింగ్
3) సెర్గి పోర్చుగలోవ్
4) జియా వెన్ చావో
- View Answer
- సమాధానం: 3
వివరణ: రష్యన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ మెడికల్ కమిషన్ మాజీ అధికారి సెర్గి పోర్చుగలోవ్పై కోర్ట్ ఆఫ్ ఆర్బిటేషన్ ఫర్ స్పోర్ట్స్ జీవితకాల నిషేధం విధించింది. రష్యా క్రీడాకారులు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడేలా ప్రోత్సహించినందుకు ఆయనపై నిషేధం విధించారు.
- సమాధానం: 3
37. కామన్వెల్త్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి రెండో సోమవారం
2)మార్చి రెండో మంగళవారం
3) మార్చి మూడో సోమవారం
4) మార్చి మూడో మంగళవారం
- View Answer
- సమాధానం: 1
వివరణ: బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన 52 దేశాలు కామన్వెల్త్ కూటమిగా ఏర్పడ్డాయి.
- సమాధానం: 1
38. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత ?
1) రూ. 1,10,000 కోట్లు
2) రూ. 1,20,000 కోట్లు
3) రూ. 1,56,999 కోట్లు
4) రూ. 1,79,666 కోట్లు
- View Answer
- సమాధానం: 3
39. ఇటీవల ఏ ఇస్లామిక్ దేశం గర్ల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది ?
1) ఈజిప్ట్
2) ఇరాక్
3) ఇరాన్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: మహిళలను అన్ని రంగాల్లో భాగస్వామ్యం చేసేందుకు సౌదీ అరేబియా గర్ల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. 2030 నాటికి దేశంలో పనిచేసే మహిళల సంఖ్యను 22 శాతం నుంచి 30 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
- సమాధానం: 4
40. ఐక్యరాజ్యసమితికి సభ్యత్వ రుసుము కింద భారత్ ఎంత మొత్తం చెల్లిస్తుంది ?
1) రూ. 100 కోట్లు
2) రూ. 157 కోట్లు
3) రూ. 180 కోట్లు
4) రూ. 244 కోట్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: సభ్యత్వ రుసుము కింద ఐరాసకు భారత్ గతంలో రూ. 157 కోట్లు చెల్లించేది. ఇటీవల ఈ మొత్తం రూ. 244 కోట్లకు పెరిగింది.
- సమాధానం: 4
41. ప్రపంచంలో అత్యంత నైతిక విలువలు కలిగి ఉన్న సంసల్థ జాబితాలో చోటు సంపాదించిన భారత్ సంస్థ ఏది ?
1) రిలయన్స్
2) టాటా స్టీల్
3) భారతీ ఎయిర్టెల్
4) ఇన్ఫోసిస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికాకు చెందిన Ethisphere సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సంస్థ నిర్వహణ ఆధారంగా నైతిక విలువల గల కంపెనీల జాబితాను తయారు చేస్తుంది. 2017లో 19 దేశాలకు చెందిన 124 కంపెనీలకు జాబితాలో చోటు కల్పించింది. ఇందులో భారత్‌కు చెందిన టాటా స్టీల్, విప్రో ఉన్నాయి. ఫోర్డ్ మోటార్ కంపెనీ వరుసుగా 8వ సారి ఈ జాబితాలో చోటు సంపాదించింది.
- సమాధానం: 2
42. మణిపూర్ నూతన ముఖ్యమంత్రి ఎవరు ?
1) ఓక్రమ్ ఇబొబిసింగ్
2) ఎన్. బీరెన్ సింగ్
3) జెయ్ కుమార్‌సింగ్
4) హోకిప్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మణిపూర్‌లో నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతుతో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
- సమాధానం: 2
43. ప్రపంచంలో అత్యంత పురాతనమైన మొక్క శిలాజాలను ఎక్కడ కనుగొన్నారు ?
1) భారత్
2) సిరియా
3) ఇరాన్
4) మంగోలియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్వీడిష్ మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీ మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ వద్ద ఆల్గే (మొక్క) శిలాజాలను కనుగొంది. ఇది 1.6 బిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
- సమాధానం: 1
44. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి 9
2) మార్చి 10
3) మార్చి 12
4) మార్చి 15
- View Answer
- సమాధానం: 4
45. ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2017 జాబితాలో తొలి స్థానంలో ఉన్న విశ్వవిద్యాలయం ?
1)నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్
2) పెకింగ్ యూనివర్సిటీ
3) సింగ్హూ యూనివర్సిటీ
4) నాన్ యంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ది టైమ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 33 భారతీయ యూనివర్సిటీలు చోటు సంపాదించాయి. ఐఐఎస్సీ బెంగళూరు 27వ స్థానంలో, ఐఐటీ బాంబే 42వ స్థానంలో ఉన్నాయి.
- సమాధానం: 1
46. స్కై ట్రాక్స్ ప్రపంచ ఎయిర్‌పోర్ట్స్ పురస్కారాలలో ప్రపంచంలో అత్యత్తుమ ఎయిర్‌పోర్ట్‌గా ఏది ఎంపికైంది ?
1) టోక్యో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్
2) మ్యూనిచ్ ఎయిర్ పోర్ట్
3) చంగీ ఎయిర్పోర్ట్
4) హాంకాంగ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: చంగీ ఎయిర్పోర్ట్ మొత్తంగా 5 సార్లు స్కై ట్రాక్స్ ఎయిర్పోర్ట్ పురస్కారాన్ని పొందింది. ఈ ఏడాది అవార్డుల ప్రదానోత్సవం అమిస్టర్ డ్యామ్‌లో జరిగింది.
- సమాధానం: 3
47. పంజాబ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు ?
1) ప్రకాశ్ సింగ్ బాదల్
2) కెప్టెన్ అమిరిందర్ సింగ్
3) రాజిందర్ కౌర్ భట్టాల్
4) సుర్జిత్ సింగ్ బర్నాలా
- View Answer
- సమాధానం: 2
వివరణ: పంజాబ్ 26వ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమిరిందర్ సింగ్ ( కాంగ్రెస్ ) పదవీ బాధ్యతలు చేపట్టారు.
- సమాధానం: 2
48. ఇటీవల అధికార భాష పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది ?
1) కర్ణాటక బ్యాంకు
2) కెనరా బ్యాంకు
3) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) ఆంధ్రాబ్యాంకు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ముంబయికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికార భాష ప్రమోషన్లో తనదైన పాత్ర పోషించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ అవార్డు అందుకుంది.
- సమాధానం: 3
49. గోవా నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) మనోహర్ పారికల్
2) దిగంబర్ కామత్
3) లక్ష్మీకాంత్ పర్సేకర్
4) ప్రతాప్ సింగ్ రాణే
- View Answer
- సమాధానం: 1
50. జీ - 20 ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) పారిస్
2) బాడెన్ - బాడెన్
3) బెర్లిన్
4) న్యూయార్క్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జర్మనీలోని బాడెన్ - బాడెన్ నగరంలో జీ - 20 ఆర్థిక మంత్రులు మరియు కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం జరిగింది.
- సమాధానం: 2