కరెంట్ అఫైర్స్ (జనవరి1- 8) బిట్ బ్యాంక్
1. ఇటీవల ఏ దేశంలో ఏనుగు దంతాల వ్యాపారం మీద పూర్తి నిషేధం విధించారు?
1) చైనా
2) దక్షిణాఫ్రికా
3) కెనడా
4) ఇండియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఏనుగు దంతాల వ్యాపారం ఎక్కువగా చైనా, హంకాంగ్, యూఎస్ఏలో ఉంది.2017 డిసెంబర్‌లోపు చైనాలోని అన్ని ఏనుగు దంతాల ప్రాసెసింగ్ యూనిట్లను మూసివేయాలని ప్రకటించింది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం 20,000ల కంటే ఎక్కువ ఏనుగులను దంతాల కోసం చంపుతున్నారు.
- సమాధానం: 1
2. ఇటీవల ఇండియా ఏ దేశంలో ఎల్ఎన్జీ దిగుమతి ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయుటకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) నేపాల్
2) శ్రీలంక
3) భూటన్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇండియా అతి పెద్ద ఎల్ఎన్జీ దిగుమతిదారు పెట్రోనెట్. బంగ్లాదేశ్‌లో 950 మిలియన్ల ఎల్ఎన్జీ దిగుమతి ప్రాజెక్టు కోసం బంగ్లాదేశ్‌కు చెందిన పెట్రో బంగ్లాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
- సమాధానం: 4
3. ప్రపంచంలో ఎతైన బ్రిడ్జ్‌ను నిర్మించిన దేశం ఏది?
1) యూఎస్ఏ
2) బ్రెజిల్
3) చైనా
4) స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచంలో ఎతైన వంతెనను చైనా సిడ్యూనదిపై 565 మీటర్లు ఎత్తున నిర్మించింది. ఈ వంతెన యూనాన్, గుయ్జౌ రాష్ట్రాలను కలుపుతుంది.
- సమాధానం: 3
4. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 నుంచి నైట్‌హుడ్ పురస్కారాన్ని అందుకున్న భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఎవరు?
1) వెంకటరామ రామకృష్ణన్
2) శ్రీశంకర్ బాల సుబ్రమణ్యన్
3) సయ్యద్ హసనైన్
4) పొదిలి అప్పారావు
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత సంతతికి చెందిన బ్రిటిష్ కెమిస్ట్రి ప్రొఫెసర్ శంకర్ బాల సుబ్రమణ్యన్‌కు బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 సైన్స్, మెడిసిన్ విభాగంలో నైట్ హుడ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. శంకర్కణంలోని అనువంశిక క్రమంను కనుగొన్నాడు.
- సమాధానం: 2
5. భారతీయ జ్ఞానపీఠ్ ‘‘ నవలేఖన్ పురస్కారం- 2016’’ నకు ఎంపికైంది ఎవరు?
1) రాధా రవళి ముఖర్జీ
2) రాజేంద్రమిత్తర్
3) అఖిలేష్ చౌదరి
4) ఘన శ్యామ్ కుమార్ దేవాంశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2006లో భారతీయ జ్ఞానపీఠ్ ట్రస్ట్ యువ రచయితలను ప్రోత్సహించడం కోసం ‘నవలేఖన్’ పురస్కారాన్ని ప్రారంభించింది. 2016 సంవత్సరానికి గాను ఘనశ్యామ్ కుమార్ దేవాంశ్, శ్రద్ధాలను ఎంపిక చేశారు. దేవాంశ్ రాసిన పద్యం ఆకాశ్ మేదే (Akash Mein Deh) కు గాను నవలేఖన్ పురస్కారానికి ఎంపికయ్యాడు. శ్రద్ద రాసిన హవమైన్ పాడ్ పాడతి చిత్తి (Hawa mein phad phadathi chitti) అనే చిన్న కథకుగాను ఈ పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కారం కింద సరస్వతి విగ్రహం, ప్రశంసా పత్రం, నగదు బహుమతిని ప్రదానం చేస్తారు.
- సమాధానం: 4
6. ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) బిపిన్ రావత్
2) బి.ఎస్.ధనోవా
3) ప్రవీణ్ బక్షి
4) పి.ఎమ్. హరిజ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రస్తుత ఆర్మీ ముఖ్య అధికారిగా జనరల్ దల్బీర్ సింగ్ సుహాన్స్థానంలో జనరల్ బిపిన్ రావత్ ఎంపికయ్యాడు. నూతన ఎయిర్ చీఫ్ మార్షల్‌గా బీరేంద్ర సింగ్ ధనోవా నియమితులయ్యారు.
- సమాధానం: 1
7. జాతీయ ఫిజికల్ ల్యాబోరేటరీ ఇటీవల ఏ రోజుకు లీఫ్ సెకండ్‌ను చేర్చింది?
1) జనవరి 8
2) జనవరి 6
3) జనవరి 4
4) జనవరి 1
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఢిల్లీలోని జాతీయ ఫిజికల్ ల్యాబోరేటరీలోని ఆటామిక్ గడియారంనకు ఒక లీఫ్ సెకండ్‌ను చేర్చారు. భూమి తన చుట్టు తాను తిరిగే వేగం తగ్గడంతో ఒక లీఫ్ సెకండ్‌ను చేర్చారు. భూ భ్రమణం వేగం తగ్గడం వలన ఖగోళ శాస్త్ర రంగంలో, ఉపగ్రహాల నావిగేషన్, కమ్యూనికేషన్ల వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
- సమాధానం: 1
8. ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష పథకం కింద ఏ వర్గాల వారికి ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తారు?
1) ద్రారిధ్యరేఖకు దిగువన ఉన్న వారి కోసం
2) దారిధ్యరేఖకు ఎగువన ఉన్న వారి కోసం
3) వితంతువుల కోసం
4) వృద్ధుల కోసం
- View Answer
- సమాధానం: 2
వివరణ: దారిధ్యరేఖకు ఎగువ (APL) ఉన్న వారి కోసం ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష పథకంను ప్రారంభించారు. సంవత్సరానికి రూ. 1200 ప్రీమియం కడితే రూ. 2 లక్షల వరకు ఉచిత వైద్య సహాయం పొందవచ్చు. ఈ స్కీమ్ కింద 1044 రోగాలను చేర్చారు.
- సమాధానం: 2
9. ఇటీవల మేజర్ జనరల్ ఆఫ్ కిర్గిస్థాన్గా ఎంపికైన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు?
1) ఆల్మాజ్ మహమ్మద్
2) బెక్ఆలీ
3) షేక్ రఫిక్ మహమ్మద్
4) షేక్ ఉమర్ అబ్ధుల్లా
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత సంతతికి (కేరళ) చెందిన షేక్ రఫిక్ మహమ్మద్ కిర్గిస్థాన్ దేశానికి సైన్యాధక్షుడుగా ఎంపిక య్యాడు.
- సమాధానం: 3
10. ముబాదాలా ప్రపంచ టె న్నిస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు?
1) రఫెల్ నాదల్
2) డేవిడ్ గోఫిన్
3) రోజర్ ఫెదరర్
4) జకోవిచ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అబుదాబిలో జరిగిన ముబాదాలా ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను డేవిడ్ గోఫిన్‌ను ఓడించి రఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. విజేతకు 2,50,000 డాలర్లు బహుమతిగా ఇస్తారు.
- సమాధానం: 1
11. 2016 సంవత్సరానికి ప్రపంచంలో ఉత్తమ క్రీడకారునిగా ఎంపికైంది ఎవరు?
1) సోమ్‌దేవ్ దెవ్వర్మన్
2) లెయెనైల్ మెస్సీ
3) అండ్రెస్ ఇనిఎస్తా
4) ట్రోని క్రోస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అర్జెంటినా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లెయెనైల్ మెస్సీ 2016 సంవత్సరానికి ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. ఈ పురస్కారాన్ని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ హిస్టరీ అండ్ స్టాటిస్టిక్స్ ప్రదానం చేస్తుంది.
- సమాధానం: 2
12. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధనువ జాతరను ఎక్కడ నిర్వహిస్తారు?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
వివరణ: దనువజాతరను ఒడిశాలోని బార్గార్ పట్టణంలో నిర్వహిస్తారు. ధనువజాతరలో కంస వధ నాటకం ప్రదర్శిస్తారు. ప్రపంచంలో ఇదే అతి పెద్ద బహిరంగ నాటక ప్రదర్శన.
- సమాధానం: 4
13. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద ఇప్పటి వరకు ఎన్ని బ్యాంక్ ఖాతాలు తెరిచారు?
1) 10 కోట్ల 26 లక్షలు
2) 19 కోట్ల 10 లక్షలు
3) 26 కోట్ల 3 లక్షలు
4) 36 కోట్ల 1 లక్ష
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద2016 డిసెంబర్ 21 లోపు దేశంలో 26 కోట్ల 3 లక్షల బ్యాంక్ ఖాతాలు ప్రారంభించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. గ్రామాల్లో 15. 56 కోట్లు, పట్టణ ప్రాంతాలలో 10.17 కోట్లు బ్యాంక్ ఖాతాలు తెరిచారు.
- సమాధానం: 3
14. అంగారక గ్రహం మీదకు మనుషులను తీసుకు వెళ్లేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన అంతరిక్ష నౌక ఏది?
1) ఫాల్కన్ రాకెట్
2) ఫ్లెమింగో రాకెట్
3) మార్స్ రాకెట్
4) మకావు రాకెట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్పెస్ ఎక్స్ సంస్థ 2018లో అంగారక గ్రహం మీదకు ఫాల్కన్ హెని రాకెట్‌ను పంపించనుంది. ఈ రాకెట్ 54 మెట్రిక్ టన్నుల బరువును అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు.
- సమాధానం: 1
15. ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేత ఎవరు?
1) మాగ్నస్ కార్లసన్
2) డానిల్ డు బోవ్
3) విశ్వనాథన్ ఆనంద్
4) సెర్గి కర్జకిన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: దోహలో జరిగిన పపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మాగ్నస్ కార్లసన్‌ను ఓడించి రష్యాకు చెందిన సెర్గి కర్జకిన్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
- సమాధానం: 4
16. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) విజయవాడ
2) తిరుపతి
3) హైదరాబాద్
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశాభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానం అనే ఇతివృత్తంతో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించారు.
- సమాధానం: 2
17. 99వ భారత ఆర్థిక సదస్సును ఎక్కడ నిర్వహించారు?
1) ముంబయి
2) భువనేశ్వర్
3) తిరుపతి
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 3
18. 77వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన 2017ను ఎక్కడ నిర్వహించారు?
1) హైదరాబాద్
2) చెన్నై
3) ముంబయి
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఎగ్జిబిషన్ సొసైటీ నూమాయిష్ పేరుతో అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన-2017 ను హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించింది. ఇందులో తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా తయారయ్యే వస్తువులను ప్రద ర్శిస్తారు.
- సమాధానం: 1
19. ఇటీవల కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్ సభ్యురాలిగా నియమితులైంది ఎవరు?
1) సుష్మా స్వరాజ్
2) కె. కవిత
3) వంగవీటి సులోచన రాణి
4) రూపాలిజైన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కామన్వెల్త్ పార్లమెంటరీ సంఘం భారత చైర్పర్సన్ లోక్‌సభ స్వీకర్ సుమిత్రా మహజన్ నిజామాబాద్ ఎంపీ కవితను కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటెరీయన్ సభ్యురాలిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యే వంగలపూడి అనితా కూడా సభ్యురాలిగా నియమితులైనారు.
- సమాధానం: 2
20. తెలంగాణ రాష్ట్రానికి నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంపికైంది ఎవరు?
1) ప్రదిప్ చంద్ర
2) ఎ.కె. మహంతి
3) శేఖర్ ప్రసాద్ సింగ్
4) స్మితా సబర్వాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: తెలంగాణ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర స్థానంలో శేఖర్ ప్రసాద్ సింగ్ నియమితులయ్యారు.
- సమాధానం: 3
21. తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత కల్పించేందుకు ఎంత భృతిని అందించనున్నట్లు ప్రకటించింది?
1) రూ. 500
2) రూ. 900
3) రూ. 1100
4) రూ. 1000
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఒంటరి జీవితం గడుపుతున్న పేద మహిళలకు జీవన భృతి కింద మార్చి 2017 నుంచినెలకు రూ. 1000 అందివ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
- సమాధానం: 4
22. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లలకు ఎస్సీ హోదాను ఇవ్వనున్నట్లు ప్రకటించింది?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
23. సుప్రీం కోర్టు ఏ చట్టం ప్రకారం భాష, మత, కులాల ఆధారంగా ఓట్లు అడగడం నేరమని ప్రకటించింది?
1) ప్రజా ప్రాతినిధ్య చట్టం
2) భారత ప్రభుత్వ చట్టం 1919
3) భారత ప్రభుత్వ చట్టం 1935
4) భారత ఎన్నికల చట్టం 1970
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017జనవరి 1న సుప్రీం కోర్టు 20 సంవత్సరాల నాటి హిందుత్వ కేసులో తీర్పు చెబుతూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం కుల, మత, భాష ప్రాతిపదికన ఓట్లు అడగడం నేర మని ప్రకటించింది.
- సమాధానం: 1
24. సిరియాలో శాంతి స్థాపన కోసం ప్రత్యేక డ్రాఫ్ట్‌ను త యారు చేసిన దేశం ఏది?
1) బ్రిటన్
2) రష్యా
3) సౌది అరేబియా
4) కెనడా
- View Answer
- సమాధానం: 2
వివరణ: సిరియాలో గత ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్న హింసను నిరోధించడం కోసం రష్యా దేశం టర్కీ సహాయంతో ఒక ముసాయిదాను త యారు చేసింది. ఈ ముసాయిదాను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.
- సమాధానం: 2
25. ఇటీవల చైనా ఏ ప్రాంతానికి సరుకు రవాణా కోసం గూడ్స్ రైలును ప్రారంభించింది?
1) మాస్కో
2) మంచూరియా
3) లండన్
4) పారిస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: చైనా సరుకు రవాణా కోసం లండన్కుప్రత్యేక, మొదటి గూడ్స్ రైలును ప్రారంభించింది. ఈ రైలు చైనాలో బయలుదేరి ఖజకిస్తాన్, రష్యా, బెలారస్, పొలాండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ గుండా ప్రయాణించి లండన్ చేరుకుంటుంది. చైనా నుంచి సరుకు రవాణా చేయబడుతున్న 15వ యురోపియన్ నగరం లండన్.
- సమాధానం: 3
26. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) జనవరి 4
2) జనవరి 8
3) జనవరి 12
4) జనవరి 16
- View Answer
- సమాధానం: 1
వివరణ: బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 4 ను ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ రోజు అంధులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలలో అవగాహన కల్పిస్తారు.
- సమాధానం: 1
27. ఇటీవల జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ ప్రాంతంలో నిర్మిస్తున్న మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణం పై స్టే విధించింది?
1) హైదరాబాద్
2) విశాఖపట్నం
3) కోయంబత్తూరు
4) పూణె
- View Answer
- సమాధానం: 4
వివరణ: జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 ప్రకారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. పర్యావరణ, నది, అడవులు సంబంధిత కేసుల పరిష్కరించే హక్కు దీనికి ఉంటుంది. పూణె మెట్రోరైల్ ప్రాజెక్ట్‌ను ములమూత నది మీదుగా (1.7 కి.మీ) నిర్మిస్తున్నారు.
- సమాధానం: 4
28. ప్రపంచంలో నిరుద్యోగులకు జీతాలు ఇవ్వడం ప్రారంభించిన తొలి దేశం ఏది?
1) లాట్వియా
2) ఫిన్‌ల్యాండ్
3) స్వీడన్
4) నార్వే
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫిన్‌ల్యాండ్ జనాభా 5.5 మిలియన్లు. అందులో నిరుద్యోగులు 8.1 శాతం. ప్రతినెల ఎంపిక చేసిన 200 మంది నిరుద్యోగులకు 560 యూరోల జీతం ఇస్తారు.
- సమాధానం: 2
29. సిక్కు పదవ గురువు గురుగోవింద్ సింగ్ 350 జన్మదినం ఎక్కడ నిర్వహించారు?
1) లూదియానా
2) పాటియాలా
3) పాట్నా
4) పావాపురి
- View Answer
- సమాధానం: 3
వివరణ: సిక్కు 10వ గురువు గురుగోవింద్ సింగ్ పాట్నాలో జనవరి 15న జన్మించారు. సిక్కు మతస్థులు ఈయన జన్మదినంను ప్రకాశ్ పర్వ్ పేరుతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. గురుగోవింద్ సింగ్ 350వ జన్మదినం పురస్కరించుకొని ఒక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విడుదల చేశారు.
- సమాధానం: 3
30. ఇటీవల ‘‘ మధుమేహ నివారణకు యోగ’’ అనే పేరుతో అంతర్జాతీయ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) పాట్నా
3) హైదరాబాద్
4) మధుర
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆయుష్ మంత్రిత్వశాఖ న్యూఢిల్లీలో మధుమేహ నివారణ కోసం యోగా అనే అంశం మీద అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది.
- సమాధానం: 1
31. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు మానవ జీర్ణవ్యవస్థ లోపల నూతన అవయవాన్ని కనుగొన్నారు?
1) కెనడా
2) ఆస్ట్రేలియా
3) రష్యా
4) ఐర్లాండ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మానవ జీర్ణవ్యవస్థలో ఇప్పటి వరకు తెలియని అవయవం ‘‘అంత్రవేష్టన ముడత (Mesentery) ని ఐర్లాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నూతన ఆవిష్కరణ వలన జీర్ణవ్యవస్థ సమస్యలు, పొత్తి కడుపు చికిత్స సులభతరం అవుతుంది.
- సమాధానం: 4
32. దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ నిర్వహించిన మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు?
1) దక్షిణ కొరియా
2) ఇండియా
3) బంగ్లాదేశ్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించివరుసగా నాల్గోసారి ఈ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. గతంలో 2010, 2012, 2014లలో ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 2
33. ‘‘ ది పిపుల్స్ ప్రెసిడెంట్: డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’’ పుస్తక రచయిత ఎవరు?
1) ఎస్.ఎమ్. ఖాన్
2) అరుణ్ తివారి
3) స్నెహ తక్కర్
4) మాధుర్ ముఖర్జీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాంనకు ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన ఎస్.ఎమ్. ఖాన్ ఈ పుస్తకాన్ని రాశాడు.
- సమాధానం: 1
34. ఇటీవల ఇండియా ఏ దేశంతో ‘‘ద్వంద పన్నుల ఎగవేత ఒప్పందం’’ ను కుదుర్చుకుంది?
1) శ్రీలంక
2) బంగ్లాదేశ్
3) ఖజకిస్థాన్
4) పాకిస్థాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ ఒప్పందం ప్రకారం పన్ను వివరాలను ఇండియా, ఖజకిస్థాన్ పరస్పరంఇచ్చి పుచ్చుకుంటాయి.
- సమాధానం: 3
35. ఇటీవల ఇండియా ద్వీపాల పర్యాటక ఉత్సవాలు 2017ను ఎక్కడ ప్రారంభించారు?
1) డయ్యూ
2) సాల్సెట్టి
3) మున్రో
4) పోర్ట్‌బ్లెయిర్
- View Answer
- సమాధానం: 4
36. ప్రపంచంలో అతిపెద్ద బుల్లెట్ రైలును ప్రారంభించిన దేశం ఏది?
1) జపాన్
2) చైనా
3) దక్షిణ కొరియా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: చైనా ప్రపంచంలో అతి పొడవైన బుల్లెట్ రైలు వ్యవస్థను బీజింగ్ నుంచి కున్మింగ్ మధ్య ప్రారంభించింది. షంగ్రీలా ఆఫ్ ది వరల్డ్ అనే పేరుతో బుల్లెట్ రైలు వ్యవస్థను ప్రారంభించింది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 2,760 కి.మీ.
- సమాధానం: 2
37. ఇటీవల ఇండియా ఏ దే శాల నుంచి దిగుమతి అయ్యే జనపనార పై యాంటి డంపింగ్ డ్యూటీని విధించింది?
1) శ్రీలంక
2) బంగ్లాదేశ్
3) సురినామ్
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 2
వివరణ: స్థానిక జనపనార పరిశ్రమలను రక్షించడం కోసం నేపాల్ బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యే జనపనారపై యాంటి డంపింగ్ డ్యూటిని విధించారు. ఈ పన్ను 5 సంవత్సరాల వరకు దిగుమతి అయ్యే జనపనారపై విధిస్తారు.
- సమాధానం: 2
38. 4వ యశ్‌చోప్రా స్మారక పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) షారుఖ్ ఖాన్
2) లతా మంగేష్కర్
3) అమితాబ్ బచ్చన్
4) ధర్మేంద్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: టి. సుబ్బిరామిరెడ్డికి చెందిన టి.ఎస్.ఆర్. ఫౌండేషన్ ప్రముఖ దర్శకుడు యశ్చోప్రాగౌరవార్థం ఈ పుర స్కారాన్ని ప్రారంభించింది. పురస్కారం కింద రూ. 10 లక్షల నగదు బహుమతి, బంగారు పతకం, ఒక సర్టిఫికేట్ అందిస్తారు. గతంలో లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖాలకు ఈ పురస్కారం దక్కింది.
- సమాధానం: 1
39. ఆంధ్రకు చెందిన శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి సాధిస్తే ఎన్ని కోట్లు నగదు బహుమతి ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
1) రూ. 50 కోట్లు
2) రూ. 75 కోట్లు
3) రూ. 100 కోట్లు
4) రూ. 150 కోట్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: తిరుపతిలోని పద్మావతి విశ్వ విద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ పిల్లల సైన్స్ కాంగ్రెస్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి నోబెల్ బహుమతి సాధించిన వారికి రూ.100 కోట్లు నగదు బహుమతిని ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు.
- సమాధానం: 3
40. ప్రపంచంలో ఎఫ్ఎమ్ రెడియో సేవలను పూర్తిగా రద్దు చేసిన మొదటి దేశం ఏది?
1) స్వీడన్
2) నార్వే
3) ఉత్తర కొరియా
4) ఇరాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో జాతీయ రెడియోల అభివృద్ధి కోసం ఎఫ్ఎమ్ రెడియోను నార్వే రద్దు చేసింది. డెన్మార్క్, స్విట్జర్లాండ్, యూకే దేశాలు కూడా ఎఫ్ఎమ్ రెడియో సేవలను రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి.
- సమాధానం: 2
41. ప్రపంచంలో ఎతైన సొలార్ టవర్‌ను ఏ ప్రాంతంలో ప్రారంభించారు?
1) నెగెవ్ ఎడారి
2) విక్టోరియా ఎడారి
3) గోబి ఎడారి
4) అటాకామా ఎడారి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇజ్రాయిల్‌లోని నెగెవ్ ఎడారిలో ప్రపంచంలో ఎతైన సొలార్ టవర్‌ను నిర్మిస్తున్నారు. దీని ఎత్తు 250 మీటర్లు (820 అడుగులు). ఈ టవర్ చుట్టు 50, 100 హెలియోస్టాట్లు (అద్దాలు) ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.
- సమాధానం: 1
42. భారత కరెన్సీని ఎన్ని దేశాలు చట్టబద్ధ ద్రవ్యంగా గుర్తించాయి?
1) 1
2) 2
3) 3
4) 5
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత కరెన్సీని నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, జింబాబ్వే చట్టబద్ధ ద్రవ్యంగా గుర్తించాయి. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంది. ఇటీవల నేపాల్ జాతీయ బ్యాంక్ 1 బిలియన్ 100 రూపాయల నోట్లను పంపమని ఆర్బీఐని కోరింది.
- సమాధానం: 4
43. ప్రపంచంలో అతి ఎక్కువ విదేశీ మారక నిల్వలు కలిగి ఉన్న దేశం ఏది?
1) ఇండియా
2) యూఎస్ఏ
3) చైనా
4) కెనడా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచంలో అతి ఎక్కువ విదేశీ మారక నిల్వలు కలిగి ఉన్న దేశం చైనా. ప్రస్తుతం చైనా వద్ద 3.12 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నిల్వలు ఉన్నాయి. తర్వాత స్థానంలో జపాన్ 1.321 ట్రిలియన్ డాలర్లు కలిగి ఉంది. డిసెంబర్ 30వ తేదీన ఆర్బీఐ భారత విదేశీ మారక నిల్వలు 360.296 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగాయని ప్రకటించింది.
- సమాధానం: 3
44. ఇటీవల డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రెడ్ ఏ వస్తువుల దిగుమతుల మీద నిషేధం విధించింది?
1) గంజాయి
2) ఆస్బెస్టాస్
3) జంతువుల కొవ్వుతో తయారు చేసే నూనెలు
4) సరీసృపాల చర్మాల దిగుమతి
- View Answer
- సమాధానం: 4
వివరణ: సరీసృపాలు, మొసళ్లు, ఇతర జంతువుల చర్మాల దిగుమతి మీద నిషేధం విధించింది. పర్యావరణం చట్టం 1972 ప్రకారం జంతు చర్మాలు, సరీసృపాల చర్మాలు తీయడం తీవ్ర నేరం.
- సమాధానం: 4
45. అమెరికా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘‘బెటర్ మేక్ రూమ్’’ విద్యా ప్రచార కార్యక్రమానికి భారత సంతతికి చెందిన ఏ విద్యార్థిని విద్యార్థుల సలహా బోర్డుకు ఎంపికైంది?
1) శ్వేత ప్రభాకరన్
2) శ్వేత కరణం
3) చైత్రా చంద్రన్
4) భానుశ్రీ మెహ్రా
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత సంతతికి చెందిన 16 సంవత్సరాలశ్వేత ప్రభాకరన్‌ను ‘‘ బెటర్ మేక్ రూమ్’’ విద్యా ప్రచార కార్యక్ర మ బోర్డులో నియమించారు.
- సమాధానం: 1
46. బ్రిస్బేన్ అంతర్జాతీయ మహిళ డబుల్ టైటిల్ విజేతగా నిలిచింది ఎవరు?
1) ఎకటేరిన మకరోవ, ఎలీనా వెస్నినా
2) సానియా మిర్జా, బేథాని మాటెక్శాండ్
3) బెలీజీన్ కింగ్, చెరిస్ ఎవర్ట్
4) కరొలిన్ వూజ్ నియాకి, మోనికా సీలేస్
- View Answer
- సమాధానం: 2
47. ప్రతిష్టాత్మక ఖతార్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ విజేత ఎవరు?
1) ఆండిముర్రే
2) రఫెల్ నాదల్
3) నోవాక్ జకొవిచ్
4) రొజర్ ఫెదరర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఖతార్ ఓపెన్ టెన్నిస్‌లో ఆండిముర్రే ని ఓడించి నోవాక్ జకోవిచ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను జెర్మిచార్డి, ఫాబ్రిస్ మార్టిన్ గెలుచుకున్నారు.
- సమాధానం: 3
48. అంతర్జాతీయ పతంగుల ఉత్సవం- 2017ను ఎక్కడ నిర్వహించారు?
1) హైదరాబాద్
2) కోట
3) అహ్మదాబాద్
4) గోవా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ‘‘పర్యాటకుల గమ్యస్థానం గుజరాత్’’ అనే థీమ్‌తో ఈ ఉత్సవాలను అహ్మదాబాద్‌లో నిర్వహించారు.
- సమాధానం: 3
49. ప్రపంచంలో ఎతైన గురుత్వాక ర్షణ తరంగ టెలిస్కోప్‌ను ప్రారంభించిన దేశం ఏది?
1) రష్యా
2) ఆస్ట్రేలియా
3) నార్వే
4) చైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: సముద్ర మట్టం నుంచి 5,250 మీటర్లు ఎత్తులో గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్‌ను చైనా టిబెట్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ టెలిస్కోప్‌ను 18.8 మిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. దీని ద్వారా బిగ్ బ్యాంక్ సిద్దాంతం పై పరిశోధన చేసే అవకాశం ఏర్పడుతుంది.
- సమాధానం: 4
50. 14వ అంతర్జాతీయ ముంబయి మారథాన్ పరుగు పందెంనకు సౌహర్ధ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) డేవిడ్ రుడిషా
2) షారుఖ్ ఖాన్
3) హేమమాలిని
4) అభిషేక్ బచ్చన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కెన్యాకు చెందిన అథ్లెట్ డేవిడ్ రుడిషాను అంతర్జాతీయ ముంబయి మారథాన్‌కు సౌహర్ధ రాయబారిగా నియమించారు. డేవిడ్ రియో ఓలింపిక్స్లో 800 మీ. పరుగు పందెంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
- సమాధానం: 1