కరెంట్ అఫైర్స్ (జనవరి 25-31) బిట్ బ్యాంక్
1. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జనవరి 5
2) జనవరి 10
3) జనవరి 15
4) జనవరి 25
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2011 నుంచి ఏటా జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుతున్నారు. యువ సాధికారత, భవిష్యత్ ఓటర్లు అనేది 2017 థీమ్.
- సమాధానం: 4
2. ప్రాసెస్డ్ ఆహారంలో ఉండే ఏ రసాయనం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ?
1) టార్టా జైన్
2) ఎక్రిలమైడ్
3) సోడియం నైట్రేట్
4) సిలికా డైయాక్సైడ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఎక్రిలమైడ్ అనే రసాయనం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యూకేకు చెందిన ఫుడ్ స్టాండర్స్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. బౌన్ రంగు వచ్చే వరకూ వేయించిన బ్రెడ్, చిప్స్, బంగాళాదుంపల్లో ఈ రసాయనం ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు.
- సమాధానం: 2
3. సూర్యునిపై ఉన్న మచ్చలపై ఇటీవల పరిశోధన జరిపింది ఎవరు ?
1) ఇస్రో
2) నాసా
3) ఈఎస్ఓ
4) చైనా స్పేస్ ఏజెన్సీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ESO - European Southern observatory
- సమాధానం: 3
4. ఇటీవల ఏ దేశం తన మొదటి మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది ?
1) జపాన్
2) చైనా
3) ఇండియా
4) రష్యా
- View Answer
- సమాధానం: 1
వివరణ: H2A అనే రాకెట్ ద్వారా టానెగాసియా అంతరిక్ష కేంద్రం నుంచి జపాన్ తన మొదటి మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ (కిరాముకై-2)ను అంతరిక్షంలోకి పంపింది. ఈ ఉపగ్రహం జీవితకాలం 15 ఏళ్లు. చైనా నావికా విన్యాసాలు, ఉత్తర కొరియా క్షిపణుల మోహరింపు తదితర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది.
- సమాధానం: 1
5. పాకిస్తాన్ ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన అణుసామర్థ్యం గల క్షిపణి ఏది ?
1) ఔరంగజేబ్-1
2) అబాబీల్
3) షరీఫ్-1
4) సుల్తాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అబాబీల్ క్షిపణి గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది ఒకేసారి అనేక వార్హెడ్లను 2,200 కి.మీ. మోసుకెళ్లగలదు.
- సమాధానం: 2
6. మారిషస్ దేశానికి నూతన ప్రధాన మంత్రిగా ఎవరు నియమితులయ్యారు ?
1) ప్రవీణ్ జుగ్నౌధ్
2) అనిరుధ్ జుగ్నౌధ్
3) అమీనా గురిబ్
4) ఆనంద్ రామచంద్రన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మిలిటెంట్ సోషలిస్ట్ పార్టీకి చెందిన అనిరుధ్ జుగ్నౌధ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయటంతో అతడి కుమారుడు ప్రవీణ్ జుగ్నౌధ్ మారిషస్ ప్రధానిగా ఎంపికయ్యారు.
- సమాధానం: 1
7. ప్రతిష్ఠాత్మక ఎన్టిపీసీ 2015-16 పురస్కారానికి ఎంపికైన సంస్థ ?
1) సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ తెలంగాణ లిమిటెడ్
2) దామోదర వ్యాలీ కార్పొరేషన్
3) నర్మదా వ్యాలీ కార్పొరేషన్
4) రిలయన్స్ పవర్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దామోదర వ్యాలీ కార్పొరేషన్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో థర్మల్, హైడల్ పవర్ స్టేషన్లను నిర్వహిస్తోంది.
- సమాధానం: 2
8. ప్రతిష్టాత్మక మెట్రోపాలిటన్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్స్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) జాన్ కొప్పిస్చ్
2) మైఖేల్ బ్సూక్టన్
3) బ్యారీ లాంబర్ట్
4) నీతా అంబానీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: దక్షిణాసియా నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి వ్యక్తి నీతా అంబానీ. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, విపత్తు నిర్వహణ, కళల అభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఆమెకు ఈ పురస్కారం దక్కింది.
- సమాధానం: 4
9. తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది ఎవరు ?
1) ప్రొ. ఎక్కా యాదగిరిరావు
2) దారిపల్లి రామయ్య
3) డా.మహమూద్ అబ్దుల్ వహీద్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: తెలంగాణ నుంచి ప్రొ. ఎక్కా యాదగిరిరావు(శిల్పకళ), దారిపల్లి రామయ్య (సామాజిక సేవ), డా.మహమూద్ అబ్దుల్ వహీద్ (వైద్య రంగం), చంద్రకాంత్ పితావా (సైన్స్ అండ్ ఇంజినీరింగ్), బి.వి.ఆర్ మోహన్‌రెడ్డి (వాణిజ్యం), చింతకింది మల్లేశం (సైన్స్ అండ్ ఇంజినీరింగ్)లకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.
- సమాధానం: 4
10. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైంది ఎవరు ?
1) టి.హనుమాన్ చౌదరి
2) చింతకింది మల్లేశం
3) అరుణా మహంతి
4) సాధు మెహర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్ నుంచి టి.హనుమాన్ చౌదరి (సివిల్ సర్వీసెస్) పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి వి.కోటేశ్వరమ్మ (సాహిత్యం)కు కూడా ఈ పురస్కారం దక్కింది.
- సమాధానం: 1
11. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) యూఎస్ మిలిటరీ అకాడమీ
2) యూకే డిఫెన్స్ నేషనల్ అకాడమీ
3) ఏరోక్యాంపస్ ఆక్విటైన్
4) ట్రాంక్విలీ క్యాంపస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఏరో క్యాంపస్ ఆక్విటైన్ ఫ్రాన్స్‌కు చెందిన బోర్డ్ యాక్స్ అనుబంధ సంస్థ. ఒప్పందంలో భాగంగా రూ.200 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో వైమానిక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
- సమాధానం: 3
12. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ని ఎకరాలకు సాగు నీరు అందివ్వనున్నారు ?
1) 1 లక్ష ఎకరాలు
2) 60 వేల ఎకరాలు
3) 40 వేల ఎకరాలు
4) 20 వేల ఎకరాలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఖమ్మం జిల్లాలోని ఎర్రగడ్డ వద్ద జనవరి 21న భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.
- సమాధానం: 2
13. 2016లో పాస్‌పోర్టుల జారీలో రెండవస్థానంలో ఉన్న రీజనల్ పాస్ పోర్టు కేంద్రం ఏదీ ?
1) లక్నో
2) హైదరాబాద్
3) చెన్నై
4) ముంబయి
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2016లో దేశవ్యాప్తంగా 1.3 కోట్ల పాస్ట్‌పోర్టు జారీ అయ్యాయి. ఇందులో 6.6 లక్షల పాస్ట్‌పోర్టులను జారీ చేసిన హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం రెండో స్థానంలో ఉంది. దేశంలో అత్యధిక పాస్‌పోర్టులను జారీ చేసిన ప్రాంతీయ కార్యాలయం లక్నో.
- సమాధానం: 2
14. ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రత్యేక బ్రహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేశారు ?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) కేరళ
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
వివరణ: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ఛైర్మన్‌గా 17 మంది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసింది.
- సమాధానం: 4
15. ఇటీవల ఏ రాష్ట్రంలో పాలిథీన్ బ్యాగుల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు ?
1) మధ్యప్రదేశ్
2) తమిళనాడు
3) మహారాష్ట్ర
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆవులను కాపాడటం సహా పర్యావరణ పరిరక్షణ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పాలిథీన్ బ్యాగుల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.
- సమాధానం: 1
16. శిశు మరణాలను తగ్గించేందుకు దులాబి కన్యా అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1) మధ్యప్రదేశ్
2) ఛత్తీస్‌గఢ్
3) అరుణాచల్ ప్రదేశ్
4) అసోం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ పథకం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడపిల్ల జన్మిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ పాప పేరుపై రూ.20 వేల డిపాజిట్ చేస్తుంది. అమ్మాయికి 18 ఏళ్లు నిండాక వడ్డీతో కలిపి ఆ మొత్తాన్ని అందజేస్తుంది.
- సమాధానం: 3
17. డ్రగ్స్ స్మగ్లింగ్ నివారణ కోసం అమెరికా-మెక్సికో మధ్య ఎన్ని మైళ్ల గోడను నిర్మించనున్నారు ?
1) 200 మైళ్లు
2) 400 మైళ్లు
3) 1000 మైళ్లు
4) 2000 మైళ్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: మెక్సికో నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ వలసల నిరోధానికి రెండు దేశాల సరిహద్దులో 2 వేల మైళ్ల (3,218 కి.మీ.) గోడను నిర్మించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు.
- సమాధానం: 4
18. ప్రతిష్టాత్మక సర్వోత్తమ జీవన్ రక్షా పతక్కు ఎవరు ఎంపికయ్యారు ?
1) ఎన్.బి.సురేశ్
2) గోవింద్ లక్ష్మణ్ తూపే
3) దారాసింగ్
4) దినేశ్ కుమార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రజల ప్రాణాలను రక్షించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా 1961 నుంచి జీవన్ రక్షా పతక్‌ను ప్రారంభించారు. ఇందులో మూడు విభాగాల కింద పురస్కారాలు ప్రదానం చేస్తారు. అవి సర్వోత్తమ, ఉత్తమ, జీవన్ రక్ష పతకాలు. ఈ అవార్డుల్లో భాగంగా 5 సర్వోత్తమ, 8 ఉత్తమ, 23 జీవన్ రక్ష పతకాలను అందజేస్తారు.
2016 సంవత్సరానికి గాను కేరళకు చెందిన ఎన్.బి.సురేశ్‌కు మరణాంతరం సర్వోత్తమ, గోవింద్ లక్ష్మణ్ తూపేకు ఉత్తమ, దారాసింగ్-దినేశ్ కుమార్‌లకు జీవన్ రక్ష పతకాల పొందారు.
- సమాధానం: 1
19. 7వ జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ విజేత ఎవరు ?
1) పంకజ్ అద్వానీ
2) రుపేష్ షా
3) బ్రిజేశ్ దామని
4) నరేష్ అగర్వాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పూణెలో జరిగిన 7వ జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో రూపేష్ షాను ఓడించి పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు.
- సమాధానం: 1
20. జపాన్ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం యొకోజునాకు ఎవరు ఎంపికయ్యారు ?
1) హకు హోషో
2) కొనిషికి
3) కిసెనోసాతో యుతుకా
4) షోతెన్రో టైషి
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1998 తర్వాత గ్రాండ్ చాంపియన్ (యొకొజునా) పురస్కారానికి ఎంపికైన సుమో రెజ్లర్ కిసెనోసాతో యుతుకా.
- సమాధానం: 3
21. భారత 68వ గణ తంత్ర దినోత్సవాల ముఖ్య అతిథి ఎవరు ?
1) ఫ్రాంకోయిస్ హోలాండ్
2) షేక్ మహమ్మద్ బీన్ జయాద్ అల్
3) వ్లాదిమిర్ పుతిన్
4) డొనాల్డ్ ట్రంప్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బీన్ జయాద్ అల్ నయన్ భారత 68వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకల్లో యూఏఈకి చెందిన 179 మంది సైనికుల బృందం రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొంది.
- సమాధానం: 2
22. దేశంలో నగరు రహిత లావాదేవీల్లో రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
1) గుజరాత్
2) హర్యానా
3) తెలంగాణ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: వాల్నట్ అప్లికేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం నగదు రహిత లావాదేవీల్లో గుజరాత్ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి.
- సమాధానం: 3
23. ఆంధ్రప్రదేశ్‌లో ఫిన్‌టెక్ స్టార్టప్ ద్వారా ఉద్యోగ కల్పనకు ఎన్ని నిధులు కేటాయించారు ?
1) రూ.100 కోట్లు
2) రూ.200 కోట్లు
3) రూ.300 కోట్లు
4) రూ.500 కోట్లు
- View Answer
- సమాధానం: 1
24. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇటీవల విడుదల చేసిన అవినీతి ఇండెక్స్‌లో భారత్ స్థానం ఎంత ?
1) 149
2) 119
3) 99
4) 79
- View Answer
- సమాధానం: 4
వివరణ: బెర్లిన్‌కు చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 179 దేశాల గణాంకాలను పరిగణలోకి తీసుకొని అవినీతి అవగాహన ఇండెక్స్‌ను రూపొందించింది. ఈ నివేదికలో న్యూజిలాండ్, డెన్మార్క్ తొలి స్థానంలో నిలవగా సోమాలియా చివరి స్థానంలో ఉంది. 40 పాయింట్లతో భారత్, చైనా, బ్రెజిల్ 79వ స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 4
25. అమెరికా ఫారెన్ మ్యాగజైన్ విడుదల చేసిన ఎనిమిది గొప్ప దేశాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది ?
1) చైనా
2) అమెరికా
3) జపాన్
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికా ఫారెన్ పాలసీ మ్యాగజైన్ 8 గొప్ప దేశాల జాబితా -2017 ను తయారు చేసింది. ఇందులో తొలిస్థానంలో అమెరికా, రెండవ స్థానంలో చైనా, మూడో స్థానంలో జపాన్, నాల్గొవ స్థానంలో రష్యా ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది.
- సమాధానం: 2
26. హెచ్‌పీసీఎల్, గెయిల్ సంయుక్తంగా పెట్రో కెమికల్ ప్లాంట్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నాయి ?
1) తెలంగాణ
2) కేరళ
3) ఆంధ్రప్రదేశ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
వివరణ: రూ.40,000 కోట్లతో ఈ పెట్రో కెమికల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పెట్రో ఆధారిత సబ్బులు, పెయింట్స్, కాస్మోటిక్స్, వస్త్రాలు, జిగురు తదితర వస్తువులు తయారు చేస్తారు.
- సమాధానం: 3
27. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైంది ఎవరు ?
1) పురుషోత్తమ్ సావరికర్
2) మఖాన్ సింగ్ ఖాంగురే
3) విజయ కుమార్
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 4
వివరణ: వీరందరూ భారత సంతతికి చెందివవారు. వైద్య రంగంలో అందించిన సేవలకు గాను పురుషోత్త సావరికర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన ఆకాశవాణి సిడ్నీ పేరుతో కమ్యూనిటీ రేడియోను ప్రారంభించారు. మఖాన్సింగ్ ఖాంగురే (న్యూరో రేడియాలిజీలో సేవలకు), విజయ కుమార్ (న్యూక్లియర్ మెడిసిన్, బయోలజీలో పరిశోధలకుగాను) వీరికి ఈ పురస్కారం దక్కింది.
- సమాధానం: 4
28. జాతీయ జియో సైన్స్ పురస్కారం-2016కు ఎవరు ఎంపికయ్యారు ?
1) డా.రాధా ముఖర్జి
2) ప్రో.అమీందర్ సింగ్
3) డా.ఎ.కేశవ్ కృష్ణా
4) డా.ఎన్.సతీశ్ రెడ్డి
- View Answer
- సమాధానం: 3
వివరణ: అప్లైడ్ జియో సైన్స్‌లో చేసిన పరిశోధనలకు గాను ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త డా.ఎ. కేశవ్ కృష్ణాకు జాతీయ జియో సైన్స్ పురస్కారం దక్కింది. జియో ఫిజిక్స్‌లో పరిశోధనలకు గాను డా.ఎన్. పూర్ణచంద్రరావు కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
- సమాధానం: 3
29. ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబ్రేన్స్ డేని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జనవరి 27
2) జనవరి 28
3) జనవరి 29
4) జనవరి 30
- View Answer
- సమాధానం: 1
వివరణ: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆష్యిట్జ్ క్యాంపస్‌లో జర్మనీ నాజీలు మారణహోమం సృష్టించారు. వారు 6 మిలియన్ల యూదులతో పాటు లక్షల మందిని ఈ ప్రాంతంలో చంపారు. జనవరి 27న నాజీల నుంచి ఈ క్యాంపస్‌కు స్వేచ్ఛ కల్పించిన సందర్భానికి గుర్తుగా ఏటా ఆ రోజున ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబ్రేన్స్ డేని జరుపుతారు.
- సమాధానం: 1
30. జాతీయ బుక్ ట్రస్ట్ ఇటీవల ఏ ప్రాంతంలో సాహిత్య ఉత్సవాలను నిర్వహించింది ?
1) కలకత్తా
2) కోహిమ
3) గౌహతి
4) ఐజ్వాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బ్రహ్మపుత్ర సాహిత్య పేరుతో ఈ ఉత్సవాలు జరిగాయి.
- సమాధానం: 3
31. లాడెర్ ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన గ్లోబల్ మేథో సంస్థ ఇండెక్స్‌లో ఆసియాలో 5వ స్థానంలో ఉన్న సంస్థ ఏది ?
1) గంగా రీసర్చ్ అండ్ ఫౌండేషన్
2) అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్
3) మేధో రీసర్చ్ ఫౌండేషన్
4) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన లాడెర్ ఇనిస్టిట్యూట్ ఈ నివేదికను రూపొందించింది. ఆసియా విభాగంలోని మొత్తం 90 సంస్థల్లో ఢిల్లీకి చెందిన అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్ 5వ స్థానంలో నిలిచింది.
- సమాధానం: 2
32. ప్రతిష్టాత్మక ఆప్తల్మాలజీ హాల్ ఫేమ్-2017లో స్థానం సంపాదించింది ఎవరు ?
1) డా.తేజస్వర దూపమ్
2) డా.శిబు వర్కే
3) డా.రామ్ నాథ్
4) డా.గుల్లపల్లి నాగేశ్వరరావు
- View Answer
- సమాధానం: 4
వివరణ: అమెరికన్ సొసైటీ ఆఫ్ కాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ (ఏఎస్సీఆర్ఎస్) సంస్థ 1999లో ఆప్తల్మాలజీ హాల్ ఫేమ్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకూ 55 మంది శాస్త్రవేత్తలు, వైద్యులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఎల్ వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ స్థాపక ఛైర్మన్ డా. గుల్లపల్లి నాగేశ్వరరావు పేరుని ఇటీవలే ఈ జాబితాలో చేర్చారు.
- సమాధానం: 4
33. సీఐఐ భాగస్వామ్య సదస్సు-2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) హైదరాబాద్
2) విజయవాడ
3) విశాఖపట్నం
4) కాకినాడ
- View Answer
- సమాధానం: 3
వివరణ: జనవరి 27 నుంచి 28 వరకూ రెండు రోజుల పాటు విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు -2017 జరిగింది.
- సమాధానం: 3
34. నలంద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ప్రొ. గిరీష్ చంద్ర త్రిపాఠి
2) డా. విజయ్ పాండురంగ భత్కర్
3) ప్రొ.యోగిష్ త్యాగి
4) ప్రొ.అమర్త్యసేన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇండియన్ సూపర్ కంప్యూటర్ పితామహుడు డా.విజయ పాండురంగ భత్కర్ నలంద విశ్వవిద్యాలయం వీసీ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
- సమాధానం: 2
35. 2020 టోక్యో ఒలింపిక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఏ పాత్రను ఎంపిక చేశారు ?
1) గోకు
2) డోరేమాన్
3) కాల్విన్
4) ల్యూక్
- View Answer
- సమాధానం: 1
వివరణ: డ్రాగన్ బాల్ జెడ్ అనే యానిమేషన్ టెలివిజన్ సీరిస్‌కు చెందిన పాత్ర గోకును 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారు.
- సమాధానం: 1
36. ప్రపంచ కుష్ఠు నివారణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జనవరి 26
2) జనవరి 28
3) జనవరి 30
4) ఫిబ్రవరి 1
- View Answer
- సమాధానం: 3
వివరణ: కుష్ఠు నివారణ కోసం మహాత్మా గాంధీ ఎంతగానో కృషి చేశారు. అందుకు గుర్తింపుగా ఆయన వర్ధంతి రోజు (జనవరి 30)న ప్రపంచ కుష్ఠు నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 3
37. ఆస్ట్రేలియా ఓపెన్ -2017 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) రఫెల్ నాదల్
2) రోజర్ ఫెదరర్
3) జాన్ పీర్స్
4) ెహ న్రీ కొంటనెన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రఫెన్ నాదల్‌ను ఓడించి రోజర్ ఫెదరర్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్ల ద్వయం గెలుచుకుంది. ( వీరు ఆరుసార్లు ఈ టైటిల్ సొంతం చేసుకున్నారు )
- సమాధానం: 2
38. ఆస్ట్రేలియా ఓపెన్-2017 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) వీనస్ విలియమ్స్
2) మార్టా కొస్త్యుక్
3) కార్సన్ బ్రస్టీన్
4) సెరెనా విలియమ్స్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆస్ట్రేలియా ఓపెన్ - 2017 మహిళల సింగిల్స్ ఫైనల్లో తన సోదరి వీనస్ విలియమ్స్‌ను ఓడించి సెరెనా విలియమ్స్ టైటిల్‌ను గెలుచుకుంది. బెతాని మటెక్ సాండ్స్, లూసి సఫరోవా మహిళల డబుల్స్ విజేతలుగా నిలిచారు.
- సమాధానం: 4
39. ఈశాన్య రాష్ట్రాల పెట్టుబడిదారుల మొదటి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) షిల్లాంగ్
2) గౌహతి
3) ఈటానగర్
4) దిస్పూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జనవరి 29న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
- సమాధానం: 1
40. దేశంలో తొలి మల్టీ స్పోర్ట్స్ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు ?
1) ముంబయి
2) కోల్కత్తా
3) న్యూఢిల్లీ
4) వారణాసి
- View Answer
- సమాధానం: 2
వివరణ: లార్డ్స్ మైదానంలో ఉన్న ఎంసీసీ మ్యూజియం స్పూర్తితో కోల్‌కత్తాలో దేశంలోని తొలి మల్టీ స్పోర్ట్స్ మ్యూజియంను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 2
41. కంబాలా పందేలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ?
1) కర్ణాటక
2) తమిళనాడు
3) కేరళ
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: కర్ణాటకలోని ఉడిపి, దక్షిణ జిల్లాల్లో నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కంబాలా మరియు ఎడ్ల బండి పరుగు పందేలను నిర్వహిస్తారు. వీటి నిర్వహణ కోసం కర్ణాటక ప్రభుత్వం జంతు హింస నిరోధక చట్టంలో మార్పులు కూడా చేసింది.
- సమాధానం: 1
42. ఇటీవల ఏ దేశానికి చెందిన పౌరులు తమ దేశంలోకి రాకుండా అమెరికా ప్రభుత్వ వలసల నిషేధాన్ని విధించింది ?
1) భారత్
2) చైనా
3) ఉత్తర కొరియా
4) సిరియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 7 ముస్లిం దేశాలకు(ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్) చెందిన పౌరులు తమ దేశంలోకి రాకుండా నిషేధాన్ని విధించారు. అయితే వలస ఉత్తర్వులు నిషేధాన్ని సవరించిన ట్రంప్ ఇరాన్‌పై నిషేధాన్ని ఎత్తివేశారు.
- సమాధానం: 4
43. విశ్వసుందరి 2017 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) రాక్వెల్ ఫెఅస్సిర్
2) ఐరిస్ మిత్తెనేర్
3) ఆండ్రియా తోవర్
4) రోష్మిత హరిమూర్తి
- View Answer
- సమాధానం: 2
వివరణ: మనీలాలో జరిగిన 2017 విశ్వ సుందరి పోటీల్లో ఫ్రాన్స్‌కు చెందిన ఐరిస్ మిత్తెనేర్ విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో తొలి రన్నరప్ రాక్వెల్ ఫెఅస్సిర్(హైతి), రెండవ రన్నరప్ ఆండ్రియా తోవర్ (కొలంబియా). భారత్ నుంచి రోష్మిత హరిమూర్తి ఈ పోటీల్లో పాల్గొంది.
- సమాధానం: 2
44. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఇటీవల ప్రెసిడెంట్‌గా ఎవరు ఎంపికయ్యారు ?
1) కులదీప్ వాత్స
2) అశ్వని కుమార్
3) దుష్యంత్ చేతలా
4) రంజిత్ సింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్‌గా ఎంపికైన అతిపిన్న వయస్కుడు దుష్యంత్ చేతలా
- సమాధానం: 3
45. భారత్‌లో ఐరాస సౌహార్ధ రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అశోక్ అమృతరాజ్
2) ఎ.పి.సింగ్
3) వినోద్ రాయ్
4) రహిమర్దిన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐరాస ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు అశోక్ అమృతరాజ్‌ను భారత్‌లో సస్టైనెబుల్ డెవలప్మెంట్ లక్ష్యాల సాధనకు సౌహార్ధ రాయబారిగా నియమించింది.
- సమాధానం: 1
46. బీసీసీఐ పరిపాలన కమిటీ ఛైర్మన్‌గా సుప్రీం కోర్టు ఇటీవల ఎవరిని నియమించింది ?
1) ఎ.పి.సింగ్
2) వినోద్ రాయ్
3) జితూ రాయ్
4) రామచంద్ర గుహ
- View Answer
- సమాధానం: 2
వివరణ: మాజీ కాగ్ ఛైర్మన్ వినోద్ రాయ్‌ని బీసీసీఐ పరిపాలనా కమిటీ ఛైర్మన్‌గా సుప్రీం కోర్టు నియమించింది. జస్టిస్ దీపక్ మిశ్రా, ఎ.ఎమ్. ఖాన్ వికార్, డి.వై. చంద్రచూడ్, రామచంద్రగుహ, విక్రమ లిమాయే, డయాన్ ఎడుల్జిలు ఈ కమిటీలో ఇతర సభ్యులు.
- సమాధానం: 2
47. సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రీ మహిళల బ్యాడ్మింటన్ 2017 టైటిల్ విజేత ఎవరు ?
1) గ్రగేరియా మరిస్క
2) పి.వి.సింధు
3) సైనా నెహ్వాల్
4) సుంగ్ జిహ్వాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ టోర్నీ ఫైనల్స్‌లో గ్రెగేరియా మరిస్కాను ఓడించి పీవీ సింధు టైటిల్ విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్‌ను సమీర్ వర్మ గెలుచుకున్నాడు.
- సమాధానం: 2
48. ప్రపంచంలోనే తొలిసారిగా సంప్రదాయ ఇంధనంపై పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించిన దేశం ఏది ?
1) కెనడా
2) ఆస్ట్రేలియా
3) ఐర్లాండ్
4) నార్వే
- View Answer
- సమాధానం: 3
వివరణ: బొగ్గు, ముడి చమురు, గ్యాస్‌పై పూర్తిగా పెట్టుబడులను ఉపసంహరించుకున్న తొలి దేశం ఐర్లాండ్.
- సమాధానం: 3
49. ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు ?
1) అమీనా మహమ్మద్
2) మౌసాఫాకి మహమత్
3) ఫెలోనోమి వెన్సొస్
4) అబ్దాలయె భదల్వ్
- View Answer
- సమాధానం: 2
50. పోకే-మాన్ వీడియో గేమ్ రూపకర్త ఎవరు ?
1) మసాయా నికముర
2) డేవిడ్ జోన్స్
3) విల్రైట్
4) సిద్ మైయర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మసాయ నికముర నామకో కంపెనీని ప్రారంభించి పోకేమాన్ అనే వీడియో గేమ్‌ను రూపొందించారు. ఈ గేమ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 2007లో జపాన్ ప్రభుత్వం మసాయకు ఆర్డర్ ఆఫ్ రైజింగ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. మసాయ నికముర ఇటీవలే మరణించారు.
- సమాధానం: 1