కరెంట్ అఫైర్స్ జనవరి (1 - 7) బిట్ బ్యాంక్
1. కూరగాయల ధరలు తగ్గినప్పుడు రైతులకు పరిహారం చెల్లించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం ‘‘భవంతర్ బర్పాయ్’’ పేరుతో పథకాన్ని ప్రారంభించింది ?
1) హరియాణా
2) తెలంగాణ
3) బిహార్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: హరియాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భవంతర్ బర్పాయ్ పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. కూరగాయల ధరలు తగ్గినప్పుడు రైతులకు నష్టం కలగకుండా పరిహారం అందజేయడం ఈ పథకం ఉద్దేశం.
- సమాధానం: 1
1) ఢిల్లీ
2) విదర్భ
3) బెంగాల్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
వివరణ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో ఢిల్లీని ఓడించి విదర్భ జట్టు తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 2
3. 61వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ విజేత ఎవరు ?
1) యశ్వంత్ సింగ్
2) షహజర్ రిజ్వి
3) ఓం ప్రకాశ్ మిథెర్ వాలా
4) ధర్మేంద్ర సింగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ:ఢిల్లీలో జరిగిన 61వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో షహజర్ రిజ్వి విజేతగా నిలిచాడు.
- సమాధానం: 2
4. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ సంవత్సరాన్ని తెలుగు అభివృద్ధి సంవత్సరంగా ప్రకటించారు ?
1) 2018
2) 2019
3) 2020
4) 2021
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018ని తెలుగు అభివృద్ధి సంవత్సరంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రభుత్వం పరంగా విధాన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
- సమాధానం: 1
5. భారత విదేశాంగ శాఖ తదుపరి కార్యదర్శిగా ప్రభుత్వం ఎవరిని నియమించింది ?
1) హస్ముక్ అదియా
2) రుచి గనశ్యామ్
3) విజయ్ కేశవ్ గోఖలే
4) ఎస్ జయశంకర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న ఎస్ జయశంకర్ పదవి కాలం 2018 జనవరి 28తో ముగుస్తుంది. ఆయన స్థానంలో విజయ్ కేశవ్ గోఖలేని తదుపరి విదేశాంగ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
- సమాధానం: 3
6. ఇటీవల ఏ రెండు దేశాలు తొలిసారి వ్యాట్ పన్నుని అమల్లోకి తెచ్చాయి ?
1) ఇరాక్ , ఒమన్
2) ఇరాన్, ఖతార్
3) సౌదీ అరేబియా, యూఏఈ
4) బహ్రెయిన్, ఆఫ్గనిస్తాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఇటీవల తొలిసారి వ్యాట్ పన్నుని విధించడం ప్రారంభించాయి. అన్ని వస్తువులు, సేవలపై 5 శాతం వ్యాట్‌ను వసూలు చేస్తున్నాయి.
- సమాధానం: 3
7. మాలి నూతన ప్రధాన మంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) జియానైన్ హెన్నిస్
2) సౌమేలో బౌబ్వే మైగా
3) ఇబ్రహీం బౌబాకర్ కెయిటా
4) టీనా కౌలిబాలి
- View Answer
- సమాధానం: 2
వివరణ: మాలి అధ్యక్షుడు ఇబ్రహిం బౌబాకర్ కెయిటా ఇటీవల సౌమేలొ బౌబ్వే మైగాను ఆ దేశ ప్రధాన మంత్రిగా నియమించారు. ఆయన ఇంతక ముందు రక్షణ, విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
- సమాధానం: 2
8. జార్ఖండ్‌లోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరు ఏమిటి ?
1) ఉర్జా సంచార్ యోజన
2) సంయుక్త యోజన
3) సౌభాగ్య యోజన
4) విద్యుత్ శక్తి యోజన
- View Answer
- సమాధానం: 3
వివరణ: జార్ఖండ్‌లో విద్యుత్ సదుపాయం లేని 29,376 గ్రామాలకు ఆ సౌకర్యం కల్పించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ సౌభాగ్య యోజనను ప్రారంభించారు.
- సమాధానం: 3
9. మహిళా సంక్షేమం కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ ఇటీవల ప్రారంభించిన పోర్టల్ ఏది ?
1) KAMINI
2) MAHILA
3) VANITA
4) NARI
- View Answer
- సమాధానం: 4
వివరణ: మహిళల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల సమాచారాన్ని మొత్తం ఒకే చోట పొందేలా రూపొందించిన www.nari.nic.in పోర్టల్‌ను కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఇటీవల ప్రారంభించారు.
- సమాధానం: 4
10. భగవద్దీతను హిందీ నుంచి ఉర్దూలోకి అనువదించిన ప్రముఖ కవి ఎవరు ?
1) అన్వర్ జలాల్ పూరి
2) రహత్ ఇందూరి
3) జాహిబ్ ఖురేషి
4) సబిర్ జాఫర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భగవద్దీతను హిందీ నుంచి ఉర్దూలోకి అనువదించినఉత్తరప్రదేశ్కు చెందినప్రముఖ కవి అన్వర్ జలాల్ పూరి ఇటీవల కన్నుమూశారు.
- సమాధానం: 1
11. ది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బిల్, 2017 ప్రకారం నాబార్డ్ కేపిటల్ మొత్తం 5 వేల కోట్ల నుంచి ఎంతకు పెరగనుంది ?
1) రూ.15,000 కోట్లు
2) రూ.25,000 కోట్లు
3) రూ.30,000 కోట్లు
4) రూ.35,000 కోట్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: The National Bank for Agriculture and Rural Development (Amendment) Bill, 2017కు ఇటీవల రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టం రూపం దాల్చిన తర్వాత నాబార్డ్ కేపిటల్ ప్రస్తుతం ఉన్న 5 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల రూపాయలకు పెరుగుతుంది.
- సమాధానం: 3
12. ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించేందుకు ఉద్దేశించిన హర్బా నౌక క్రూయిజ్ క్షిపణిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది ?
1) భారత్
2) పాకిస్తాన్
3) చైనా
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించే హర్బా నౌకా క్రూయిజ్ క్షిపణిని పాకిస్తాన్ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది.
- సమాధానం: 2
13. కింది వాటిలోని ఏ పేమెంట్స్ బ్యాంక్ తమ సిబ్బందికి శిక్షణ కోసం ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
2) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్
3) ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్
4) ఫినో పేమెంట్స్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పేమెంట్స్ బ్యాంకింగ్ నిర్వహణలో సిబ్బందికి శిక్షణ కోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్.. ది ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఆఫైర్స్(IICA)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2018 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 650 పేమెంట్స్ బ్యాంక్‌లను ప్రారంభించేందుకు ఇండియా పోస్ట్ ఏర్పాట్లు చేస్తుంది.
- సమాధానం: 1
14. ఆసియాలోని అతిపొడవైన జోజిలా పాస్ సొరంగ మార్గాన్ని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు ?
1) జమ్ము అండ్ కశ్మీర్
2) హిమాచల్ ప్రదేశ్
3) ఉత్తరాఖండ్
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్ సొరంగ మార్గ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆసియాలోనే అతిపొడవైన సొరంగ మార్గమైన ప్రాజెక్టుకురూ.6,089 కోట్లు వ్యయం చేయనున్నారు. 14.2 కి.మీ పొడవుండే ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్ మధ్య అనుసంధానత సాధ్యమవుతుంది.
- సమాధానం: 1
15. ఇటీవల ఏ దేశ సెంట్రల్ బ్యాంక్.. చైనాతో ద్వైపాక్షిక వ్యాపారం కోసం డాలర్ల స్థానంలో యూవాన్ కరెన్సీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ?
1) ఆస్ట్రేలియా
2) పాకిస్తాన్
3) దక్షిణ కొరియా
4) హాంగ్ కాంగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్... చైనాతో ద్వైపాక్షిక వ్యాపారం కోసం డాలర్ల స్థానంలో చైనా కరెన్సీ యూవాన్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడం లేదంటు పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన తర్వాత పాక్ సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 2
16. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు భారత్ ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ఫ్రాన్స్
2) అమెరికా
3) యునెటైడ్ కింగ్ డమ్
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు భారత్ ఇటీవల యూకేతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అధిక సామర్థ్యం ఉన్న బస్సులను వినియోగంలోకి తెస్తారు.
- సమాధానం: 3
17. 2017 సంవత్సరానికి సముద్ర మంతన్ - కేరింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న కంటైనర్ పోర్టు ఏది ?
1) హల్దియా పోర్ట్
2) కోల్ కతా పోర్ట్
3) జవహార్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్
4) విశాఖపట్నం పోర్ట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ముంబైలోని జవహార్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్.. సముద్ర మంతన్ - కేరింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ - 2017 అవార్దుని గెలుచుకుంది.
- సమాధానం: 3
18. 8 శాతం సేవింగ్స బాండ్ స్కీమ్ స్థానంలో ఎంత శాతంతో కూడిన సేవింగ్ బాండ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది ?
1) 7 శాతం
2) 7.75 శాతం
3) 6 శాతం
4) 6.75 శాతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: 8 శాతం సేవింగ్స్ బాండ్ స్కీమ్ స్థానంలో 7.75 శాతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేవింగ్స బాండ్ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నోటిఫేకషన్ జారీ చేసింది. దీని ప్రకారం 2018 జనవరి 2 నుంచి 8 శాతం సేవింగ్స బాండ్ స్కీమ్ కింద నమోదులు ఉండవు.
- సమాధానం: 2
19.2022లో జరిగే 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం కోసం ఇటీవల ఏ రాష్ట్రం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) సిక్కిం
2) అస్సోం
3) మేఘాలయ
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2022లో జరిగే 39వ జాతీయ క్రీడల నిర్వహణ కోసం మేఘాలయ ఇటీవల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
- సమాధానం: 3
20. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన అధికారిక చిహ్నం థీమ్ ఏంటి ?
1) అమర్ బంగ్లా
2) బిజాయ్ బంగ్లా
3) బిస్వా బంగ్లా
4) అమ్రా బంగ్లా
- View Answer
- సమాధానం: 3
వివరణ: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల అధికారిక చిహ్నాన్ని ఆవిష్కరించింది. ఈ చిహ్నాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రూపొందించారు. ఈ చిహ్నం థీమ్ బిస్వా బంగ్లా.
- సమాధానం: 3
21. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన కొత్త పది రూపాయల నోటు ఏ రంగులో ఉంది ?
1) బ్రాంజ్ ఎల్లో
2) సీ గ్రీన్
3) చాక్లెట్ బ్రౌన్
4) బ్రైట్ గ్రే
- View Answer
- సమాధానం: 3
వివరణ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా చాక్లెట్ బ్రౌన్ రంగులో పది రూపాయల నోటుని ఇటీవల విడుదల చేసింది.
- సమాధానం: 3
22. దేశంలోనే తొలిసారిగా దివ్యాంగుల కోసం ప్రత్యేక జాతీయ పార్కుని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1) తమిళనాడు
2) ఒడిశా
3) హరియాణా
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
వివరణ: హైదరాబాద్ మలక్‌పేట్‌లోని నల్లగొండ చౌరస్తాలో ఉన్న దివ్యాంగుల సహకార సంస్థ ఆవరణలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాతీయ పార్కుని ఇటీవల ప్రారంభించారు. ఇందులో దివ్యాంగుల కోసం ఫిజియోథెరపీ సెన్సార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 4
23. తెలంగాణ ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) చిలకమర్తి నరసింహ
2) బోయిళ్ల విద్యాసాగర్
3) శంభిపూర్ రాజు
4) ఎర్రోళ్ల శ్రీనివాస్
- View Answer
- సమాధానం: 4
వివరణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నియమించింది. శ్రీనివాస్ సిద్ధిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్‌కు చెందివారు.
- సమాధానం: 4
24. భారత ప్రధాన మంత్రి అధికారిక వైబ్‌సైట్ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది ?
1) 13
2) 15
3) 20
4) 26
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రధాన మంత్రి అధికారిక వెబ్సైట్ www.pmindia.gov.in. ఇటీవల అస్సామీ, మణిపూర్ భాషల్లోను ఈ వైబ్‌సైట్ సేవలని ప్రారంభించారు. దీంతో పీఎం ఇండియా వైబ్‌సైట్ 13 భాషల్లో అందుబాటులోకి వచ్చినట్లయింది.
- సమాధానం: 1
25. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) మనీశ్ పాండే
2) అరవింద్ గుప్తా
3) రాజిందర్ ఖన్నా
4) నిఖిల్ సింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: రా మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా డిప్యూటీ నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ గా ఇటీవల నియమితులయ్యారు. ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు.. అజిత్ దోవల్.
- సమాధానం: 3
26. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరీ చీఫ్‌గా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) ఆర్ ఆర్ భట్నాగర్
2) రీణా మిత్రా
3) అభయ్
4) ఓం ప్రజాపతి
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1986 బ్యాచ్ ఒడిశా కేడర్‌కు చెందిన అభయ్.. ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019 నవంబర్ 18 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
- సమాధానం: 3
27. డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సు - 2018 ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ?
1) ఉత్తరప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) గుజరాత్
4) అస్సోం
- View Answer
- సమాధానం: 2
వివరణ: డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సు - 2018 ఇటీవల మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ బీఎస్ఎఫ్ అకాడమీలో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుని ప్రారంభించారు.
- సమాధానం: 2
28. టాటా ఓపెన్ మహారాష్ట్ర టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు ?
1) రాబెర్టో బటిస్టా
2) బెనాయిట్ పెయిరె
3) యూకీ బాంబ్రీ
4) గిల్లెస్ సైమన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పూణెలో జరిగిన టాటా ఓపెన్ మహారాష్ట్ర పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన గిల్లెస్ సైమన్.. కెవిన్ ఆండర్సన్‌ను ఓడించి టైటిల్ కై వసం చేసుకున్నాడు.
- సమాధానం: 4
29.హిమాలయన్ హైడ్రో ఎక్స్పో - 2018 ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) ఖాట్మాండు
2) షిమ్లా
3) గ్యాంగ్ టక్
4) ఈటానగర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: హిమాలయన్ హైడ్రో ఎక్స్ పో - 2018 ఇటీవల నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగింది. నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేపాల్‌లో ఉన్న జలవిద్యుత్ వనరులకు ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
30. ప్రపంచంలో తొలిసారిగా ఇటీవల ఏ దేశం.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు, పురుషులకు సమాన వేతనాలు ఇచ్చేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది ?
1) ఫిన్లాండ్
2) ఫ్రాన్స్
3) ఐస్లాండ్
4) స్వీడన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐస్లాండ్ ప్రపంచంలోనే తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు, పురుషులకు సమాన వేతనాలు ఇవ్వాలని పేర్కొంటు ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది. నిబంధనలను పాటించని సంస్థలపై చట్టం పరంగా చర్యలు తీసుకుంటారు.
- సమాధానం: 3
31. ఆసియా - పసిఫిక్‌లో 2018 సంవత్సరానికిగాను ఉత్తమ సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌గా ఎవరు ఎంపికయ్యారు ?
1) రవి మీనన్
2) ప్రమోద్ జైన్
3) ఉషా విశ్వాస్
4) నిర్మల్ కుమార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సింగపూర్ సెంట్రల్ బ్యాంక్.. మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగా డెరైక్టర్ అయిన భారత సంతతికి చెందిన రవి మీనన్.. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా ఎంపికయ్యారు. యూకేకు చెందిన ది బ్యాంకర్ మ్యాగజైన్ ఈ మేరకు ప్రకటించింది.
- సమాధానం: 1
32. ప్రకృతి సేద్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు ?
1) సుభాష్ పాలేకర్
2) ఎం ఎస్ స్వామినాథన్
3) యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
4) సాంబశివరావు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ శిబిరాన్ని సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. సుభాష్ పాలేకర్‌ను ప్రకృతి సేద్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
- సమాధానం: 1
33. ఆంధ్రప్రదేశ్‌లో 5వ విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు ?
1) గుంటూరు
2) ప్రకాశం
3) తూర్పు గోదావరి
4) కర్నూలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: 5వ విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా దర్శిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 2న ప్రారంభించారు. జనవరి 11 వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.
- సమాధానం: 2
34. దివ్యాంగులు సాధారణ వ్యక్తులను పెళ్లి చేసుకుంటే ప్రస్తుతం ఇస్తున్న రూ. 50 వేల వివాహ ప్రోత్సహాకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎంతకు పెంచింది ?
1) రూ.75 వేలు
2) రూ. లక్ష
3) రూ. 1.5 లక్షలు
4) రూ. 2 లక్షలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: దివ్యాంగులు సాధారణ వ్యక్తులను పెళ్లి చేసుకుంటే ప్రస్తుతం ఇస్తున్న రూ. 50 వేల వివాహ ప్రోత్సహాకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లక్ష రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
- సమాధానం: 2
35. ఇటీవల ఏ రాష్ట్రం వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్ అందించే విధానాన్ని ప్రారంభించింది.
- సమాధానం: 1
36.‘‘బతుకుపోరు, విలువలు’’ పుస్తక రచయిత ఎవరు ?
1) బీఎస్ రాములు
2) ఘంటా చక్రపాణి
3) అల్లం నారాయణ
4) నందిని సిద్ధారెడ్డి
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన బతుకుపోరు, విలువలు పుస్తకాన్ని ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. రాములు 90కిపైగా పుస్తకాలు రాశారు.
- సమాధానం: 1
37. దేశంలోనే తొలిసారిగా ఇటీవల తెలంగాణలో ప్రారంభించిన రోబో పోలీస్‌ను ఏ కంపెనీ రూపొందించింది ?
1) టీ రోబోటిక్స్
2) భారత్ రోబో
3) హెచ్ బోట్స్
4) టీఎస్ టెక్
- View Answer
- సమాధానం: 3
వివరణ:టీ-హబ్‌లో స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన ‘హెచ్ బోట్స్’ రోబోటిక్స్ కంపెనీ పోలీస్ రోబోను రూపొందించింది. ఈ రోబో జూబ్లీ హిల్స్ చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తుంది. ఈ రోబో పోలీసు అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు తీసుకుని కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. అనుమానితులను, బాంబులను గుర్తిస్తుంది.
- సమాధానం: 3
38. హిజ్రాల సంక్షేమం కోసం ఇటీవల ప్రత్యేక విధానాన్ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకు ఎన్ని రూపాయల పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది ?
1) రూ.1500
2) రూ.1000
3) రూ.2000
4) రూ.3000
- View Answer
- సమాధానం: 1
వివరణ: హిజ్రాల సంక్షేమం కోసం ఇటీవల ప్రత్యేక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా 18 ఏళ్లు పైబడిన హిజ్రాలకు నెలకు 1500 రూపాయల పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
- సమాధానం: 1
39. జాతీయ పౌర రిజిస్టర్-ఎన్సీఆర్ తొలి ముసాయిదాను ఇటీవల ఏ రాష్ట్రం ప్రచురించింది ?
1) అస్సోం
2) తెలంగాణ
3) ఉత్తరాఖండ్
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నేషనల్ రిజి్ట్రార్ ఆఫ్ సిటిజన్స్ - ఎన్సీఆర్ (జాతీయ పౌర రిజిస్టర్) తొలి ముసాయిదాను అస్సోం జనవరి 1న ప్రచురించింది. దీని ప్రకారం ఆ రాష్ట్రంలో మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 1.9 కోట్ల మంది పేర్లను ఇందులో చేర్చారు.
- సమాధానం: 1
40. ఇటీవల మైనారిటీ కమిషన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం చైర్మన్‌గా ఎవరిని నియమించింది ?
1) మహమూద్ అలీ
2) అక్బరుద్దీన్ ఓవైసీ
3) మహమ్మద్ కమరుద్దీన్
4) షబ్బీర్ అలీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: తెలంగాణ మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మహమ్మద్ కమరుద్దీన్‌ను కమిషన్ చైర్మన్‌గా, రాజారపు ప్రతాప్‌ను వైస్ చైర్మన్‌గా నియమించింది.
- సమాధానం: 3
41. దేశంలోనే తొలి కో - ఫైనాన్సింగ్ సంస్థ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటు ఉత్పాదక రంగంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రుణాలను అందించడం కోసం ఏర్పాటవుతున్న తెలంగాణ ఇండస్టియ్రల్ హెల్త్ క్లినిక్‌కు (టీఐహెచ్‌సీ)కి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. దేశంలో ఇదే తొలి కో-ఫైనాన్సింగ్ సంస్థ. ఇది ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానుంది.
- సమాధానం: 2
42. సార్క్ దేశాలను అనుసంధానించేందుకు భారత్ ప్రత్యేకంగా రూపొందించిన ఎన్కేఎన్లో ఏ దేశానికి చోటు ఇచ్చేందుకు భారత్ ఇటీవల నిరాకరించింది ?
1) ఆఫ్గనిస్తాన్
2) బంగ్లాదేశ్
3) పాకిస్తాన్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 3
వివరణ: SAARC (south asia association for regional cooperation) దేశాలను అనుసంధానించేందుకు భారత్ ప్రత్యేకంగా రూపొందించిన నేషనల్ నాలెడ్‌జ నెట్వర్క్ (ఎన్‌కేఎన్)లో పాకిస్తాన్‌కు చోటు ఇచ్చేందుకు భారత్ నిరాకరించింది. సార్క్ సభ్య దేశాలైన ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక, భూటాన్, నేపాల్‌లను హైస్పీడ్ నెట్వర్క్ ద్వారా అనుసంధానిస్తారు. సార్క్ ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఉంది.
- సమాధానం: 3
43. జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ - 2017లో మహిళల టైటిల్‌ను ఏ జట్టు గెలుచుకుంది ?
1) హిమాచల్ ప్రదేశ్
2) మహారాష్ట్ర
3) ఆంధ్రప్రదేశ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: హైదరాబాద్‌లోని బాలయోగి స్టేడియంలో జరిగిన జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ మహిళల ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ ఇండియన్ రైల్వేస్‌ను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. పురుషుల ఫైనల్లో మహారాష్ట్ర.. సర్వీసెస్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది.
- సమాధానం: 1
44. ప్రతిష్టాత్మక హాప్‌మన్ కప్ - 2017ను ఏ దేశ జట్టు గెలుచుకుంది ?
1) స్విట్జర్లాండ్
2) జర్మనీ
3) అమెరికా
4) రష్యా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రతిష్టాత్మక హాప్‌మన్ కప్‌లో రోజర్ ఫెడరర్, బెలిండా బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఫెడరర్, బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు 2-1తో అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎంజెలిక్ కెర్బర్ సభ్యులుగా ఉన్న జర్మనీ జట్టును ఓడించింది.
- సమాధానం: 1
45. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో ప్రతిష్టాత్మక యాషెస్ సీరీస్ ఏ రెండు జట్ల మధ్య జరుగుతుంది ?
1) భారత్ - పాకిస్తాన్
2) దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్
3) ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా
4) శ్రీలంక - బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రతిష్టాత్మక యాషెస్ సీరీస్ ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఇటీవల జరిగిన సీరీస్‌ని ఆస్ట్రేలియా 4-0 తేడాతో గెలుచుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద సీరీస్ పురస్కారం లభించింది. 1882-83లో తొలి యాషెస్ సీరీస్ జరిగింది.
- సమాధానం: 3
46. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటు ఇటీవల ఏ దేశానికి మిలటరీ సాయం నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది ?
1) పాకిస్తాన్
2) ఆఫ్గనిస్తాన్
3) ఇరాక్
4) సిరియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: పాకిస్తాన్ ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకోవడం లేదంటు ఆ దేశానికి ఏటా భారీగా ఇస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. 2 బిలియన్ డాలర్ల భద్రతా సాయంలో కోతతో పాటు మిలటరీ సామాగ్రి సరఫరాను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
- సమాధానం: 1
47. స్పైక్ క్షిపణుల కొనుగోలు కోసం ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది ?
1) అమెరికా
2) రష్యా
3) ఇజ్రాయెల్
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇజ్రాయెల్‌కు చెందిన ఆయుధాల కంపెనీ రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణుల (స్పైక్) కొనుగోలు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. 1,600 క్షిపణుల కోసం జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.3 వేల కోట్లు.
- సమాధానం: 3
48. ప్రపంచంలోనే ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద ప్రధాన సంఖ్య - M77232917 ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
1) జొనాథన్ పేస్
2) ఆర్థర్ కేలే
3) సూపర్ 30 ఆనంద్
4) రొనాల్ట్ జొర్డాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపచంలోనే ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద ప్రధాన సంఖ్యను అమెరికాకు చెందిన ఔత్సాహిక శాస్త్రవేత్త జొనాథన్ పేస్ కనుగొన్నారు. 2ను 7,72,32,917 సార్లు గుణించి, ఆ తర్వాత అందులో నుంచి ‘1’ ని తీసివేశారు. ఆ వచ్చిన సంఖ్యలో 2,32,49,425 అంకెలున్నాయి. ఇప్పటివరకు తెలిసిన ప్రధాన సంఖ్య కన్నా ఎం77232917 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఎక్కువగా ఉన్నాయి.
- సమాధానం: 1
49. అమెరికా ఏ దేశంతో ఉన్న సరిహద్దులో దుర్భేధ్యమైన గోడను నిర్మిస్తుంది ?
1) కెనడా
2) క్యూబా
3) బహమాస్
4) మెక్సికో
- View Answer
- సమాధానం: 4
వివరణ: మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆ దేశ సరిహద్దుల్లో గోడను నిర్మించాలని అమెరికా నిర్ణయించింది. ఇందుకోసం 33 బిలియన్ డాలర్లు అవసరం అని అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం అంచనా వేసింది. అంతా అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి అమెరికా నుంచి మెక్సికోను వేరు చేస్తూ 1552 కి.మీ మేర గోడ లేదా కంచె పూర్తవుతుంది.
- సమాధానం: 4
50. భారత్ దర్శన్ పేరిట దేశంలోని ప్రఖ్యాత ప్రాంతాలు, ప్రముఖ స్థలాలకు విద్యార్థులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం రూపొందించింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: విద్యార్థులు పాఠశాలలకే పరిమితం కాకుండా, వారిలో విషయ పరిజ్ఞానం, వికాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు తెలంగాణ గురుకుల సొసైటీ భారత్ దర్శన్ పేరుతో కార్యక్రమాన్ని రూపొందించింది. వివిధ ప్రదేశాలను సందర్శించి వాటిపై అవగాహన పెంచుకునే విధంగా దీన్ని రూపొందించింది. 9వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న గురుకుల విద్యార్థులకు దీన్ని అమలు చేస్తుంది.
- సమాధానం: 1