కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ (16 – 23) బిట్ బ్యాంక్
1. 2017-18 సంవత్సరంలో ఎన్ని లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినట్టు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ఇటీవల వెల్లడించింది ?
1) లక్ష
2) రెండు లక్షలు
3) 3.15 లక్షలు
4) 4.82 లక్షలు
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017-18 ఆర్థిక సంవత్సరంలో 3.15 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్టు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ తెలిపింది. ఇందుకోసం రూ.3,787 కోట్ల నిధులను ఖర్చు చేసినట్టు వెల్లడించింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎంఏవై అర్బన్ పథకాల కింద ఈ నిర్మాణాలను చేపట్టినట్టు తెలిపింది.
-
2. ఇటీవల వెల్లడించిన సులభతర వాణిజ్య విధానం(Ease of Doing Business) అమలు ర్యాంకుల్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) పై మూడు
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2017లో సులభతర వాణిజ్య విధానం అమలులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హర్యాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాయి. 2016లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉమ్మడిగా తొలి స్థానంలో నిలిచాయి.
-
3. తెలంగాణలోని ఏ ఎత్తిపోతల పథకానికి ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, దివంగత ఆర్.విద్యాసాగర్ రావు పేరు పెట్టారు ?
1) డిండి ఎత్తిపోతల పథకం
2) భక్తరామదాసు ఎత్తిపోతల పథకం
3) కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
4) పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
- View Answer
- సమాధానం: 1
వివరణ: నల్గొండ జిల్లాలో చేపట్టనున్న డిండి ఎత్తిపోతల పథకానికి ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, దివంగత ఆర్. విద్యాసాగర్ రావు పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకనుంచి ఈ ప్రాజెక్టును శ్రీ రామరాజు విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకంగా పరిగణించాలంటూ ఆదేశించింది.
-
4. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 2018 సంవత్సరానికి గాను ఇటీవల ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయితీ సశక్తీకరణ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లా ఎంపికై ంది ?
1) కృష్ణా
2) శ్రీకాకుళం
3) విశాఖపట్నం
4) తూర్పు గోదావరి
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 2018 సంవత్సరానికి గాను ఇటీవల ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయితీ సశక్తీకరణ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఎంపికైంది.
-
5. తైపీలో జరిగిన సాంటైజి ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ ప్లేయర్ ఎవరు ?
1) యూకీ బాంబ్రీ
2) సోందేవ్ దేవర్‌మాన్
3) శశి కుమార్ ముకుంద్
4) సాకేత్ మైనేని
- View Answer
- సమాధానం: 1
వివరణ: తైపీలో జరిగిన సాంటైజి ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ కు చెందిన రామ్ కుమార్ రామనాథన్‌ను ఓడించి యూకీ బాంబ్రీ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో బాంబ్రీకి ఇది తొలి టైటిల్.
-
6. కింది వాటిలో ప్రజా సేవకుగాను ఏ సంస్థ పులిట్జర్ ప్రైజ్ - 2018ని గెలుచుకుంది?
1) ది న్యూయార్క్ టైమ్స్
2) వాషింగ్టన్ పోస్ట్
3) ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్
4) ద గార్డియన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ది న్యూయార్క్ టైమ్స్, ది న్యూ యార్కర్ సంస్థలు 2018 సంవత్సరానికి గాను పులిట్జర్ ప్రైజ్‌ని గెలుచుకున్నాయి. లైంగిక వేధింపులపై రిపోర్టింగ్‌కి గాను ఆ సంస్థలకు ఈ అవార్డు దక్కింది.
-
7. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశం (CHOGM 2018) ఇటీవల ఏ దేశంలో జరిగింది ?
1) భారత్
2) యూకే
3) డెన్మార్క్
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: యూకేలోని లండన్‌లో ఇటీవల కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశం జరిగింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు అన్ని కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Theme : Towards a Common Future
-
8. ఐరాస ఆధ్వర్యంలోని ఎన్జీవోస్ కమిటీకి ఆసియా పసిఫిక్ దేశాల విభాగంలో ఎంపికై న దేశం/దేశాలు ఏవి ?
1) భారత్
2) పాకిస్థాన్
3) చైనా
4) పై మూడు
- View Answer
- సమాధానం: 4
వివరణ: నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కమిటీకి ఆసియా పసిఫిక్ విభాగం నుంచి జరిగిన ఎన్నికల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌తోపాటు పాకిస్థాన్, చైనా, బహ్రెయిన్ ఈ కమిటీకి ఎన్నికయ్యాయి. ఈ కమిటీలో సభ్యత్వం నాలుగేళ్ల పాటు ఉంటుంది. 2019 జనవరి 1 నుంచి పదవీకాలం మొదలవుతుంది. స్వచ్ఛంద సంస్థలు అందించే విజ్ఞాపనలు, నివేదికలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.
-
9. ప్రపంచ బ్యాంక్ ఇటీవల వెల్లడించిన దక్షిణాసియా ఎకనామిక్ ఫోకస్ రిపోర్ట్ ప్రకారం 2020లో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది ?
1) 7.2 శాతం
2) 7.5 శాతం
3) 8 శాతం
4) 8.5 శాతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ బ్యాంక్ ఇటీవల దక్షిణాసియా ఎకనమిక్ ఫోకస్ రిపోర్ట్ ను విడుదల చేసింది. దీని ప్రకారం 2020లో భారత వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదు కానుంది. అదేవిధంగా నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యల నుంచి భారత్ కోలుకుంటోందని కూడా ఈ నివేదిక తెలిపింది.
-
10. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇటీవల వెల్లడించిన వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్ నివేదిక ప్రకారం 2019లో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది ?
1) 7.4 శాతం
2) 7.9 శాతం
3) 7.8 శాతం
4) 7.2 శాతం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇటీవల వెల్లడించిన వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్ ప్రకారం.. 2019లో భారత వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కానుంది. 2018లో 7.4 శాతంగా ఉండనుంది. రానున్న రెండేళ్లలో భారత్ తిరిగి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోకి రాగలదని ఈ నివేదిక తెల్పింది.
-
11. ప్రపంచ హెరిటేజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 16
2) ఏప్రిల్ 18
3) ఏప్రిల్ 20
4) ఏప్రిల్ 22
- View Answer
- సమాధానం: 2
వివరణ: ది వరల్డ్ హెరిటేజ్ డేని ఏటా ఏప్రిల్ 18న నిర్వహిస్తారు. ఇదే దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యూమెంట్స్ అండ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. 1982 నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వారసత్వ సంపద రక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుతారు.
Theme: Heritage for Generations
-
12. గ్లోబల్ మలేరియా సమ్మిట్ - 2018 ఇటీవల ఏ దేశంలో జరిగింది ?
1) భారత్
2) దక్షిణాఫ్రికా
3) ఆస్ట్రేలియా
4) యునెటైడ్ కింగ్ డమ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: గ్లోబల్ మలేరియా సమ్మిట్ - 2018 ఇటీవల యూకేలోని లండన్‌లో జరిగింది. 25వ కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశంలో భాగంగా ఈ సమ్మిట్ నిర్వహించారు. 2015తో పోలిస్తే 2016లో మలేరియా కేసులు 216 మిలియన్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు, దేశాధినేతలు మలేరియాను అదుపు చేసేందుకు సరిపడా నిధులు కేటాయించడంతో పాటు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఈ సమ్మిట్ కోరింది.
-
13. ఇటీవల విడుదల చేసిన కామన్వెల్త్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (సీఐఐ- 2018లో)లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 16
2) 53
3) 20
4) 10
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇటీవల లండన్‌లో జరిగిన 25వ కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశంలో భాగంగా కామన్వెల్త్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను విడుదల చేశారు. 53 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. యూకే, సింగపూర్, కెనడా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. నూతన ఆవిష్కరణల అంశంలో కామన్వెల్త్ ఏ దేశాలు ఏ స్థాయిలో పురోగమిస్తున్నాయో వివరించేందుకు ఈ సూచీని తయారు చేశారు.
-
14. పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల నుంచి ఖాతాదారులకు నగదు తీసుకునే వెసులుబాటును ఇటీవల ఏ బ్యాంక్ కల్పించింది ?
1) ఐసీఐసీఐ బ్యాంక్
2) ఆంధ్రా బ్యాంక్
3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) అలహాబాద్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఏటీఎంలలో నగదు సమస్యను అధిగమించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారులకు పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల నుంచి నగదు పొందే వెసులుబాటు కల్పించింది. వ్యాపారుల వద్ద ఉన్న పీవోఎస్ మెషీన్ల నుంచి ఒక్క కార్డు నుంచి రోజుకి వెయి్య రూపాయలు తీసుకునే అవకాశాన్ని కల్పించింది. కేవలం ఎస్బీఐ ఖాతాదారులకే కాకుండా ఏ బ్యాంక్ ఖాతాదారులైనా తమ డెబిట్ కార్డు ద్వారా ఈ వెసులుబాటుని ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఎస్బీఐ ప్రస్తుతానికి ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదు.
-
15. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎవరి ఆధ్వర్యంలో తొలి పీఆర్సీని ఏర్పాటు చేసింది ?
1) రాజీవ్ శర్మ
2) సీఆర్ బిశ్వాల్
3) మహ్మద్ అలీ రఫత్
4) అనురాగ్ శర్మ
- View Answer
- సమాధానం: 2
వివరణ: తెలంగాణ తొలి వేతన సవరణ సంఘాన్ని(పీఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ సీఆర్ బిశ్వాల్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్‌లు సీ ఉమామహేశ్వరరావు, మహ్మద్ అలీ రఫత్లు సభ్యులుగా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో వీరు నివేదిక ఇవ్వాల్సి ఉంది.
-
16. విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ?
1) 2 శాతం
2) 5 శాతం
3) 3 శాతం
4) 1 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 29 క్రీడలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ప్రస్తుతం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ అమలు చేస్తుండగా.. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
-
17. అమెరికా గూఢా చార సంస్థ - సీఐఏ డెరైక్టర్ గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ?
1) హాస్పెల్
2) మేరీ విలియమ్స్
3) రిచర్డ్ హ్యారీ
4) అల్బర్ట్ నెక్ హామ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికా గూఢాచార సంస్థ - సీఐఏ డెరైక్టర్‌గా 61 ఏళ్ల హాస్పెల్ ఎంపికయ్యారు. ఇందుకోసం అమెరికా సెనేట్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో ఆమెకు అనుకూలంగా 54 మంది, వ్యతిరేకంగా 45 మంది ఓటు వేశారు. దీంతో... సీఐఏ డెరైక్టర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టారు.
-
18. ఆఫ్రో ఏషియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ జాబితా - 2018 ప్రకారం అత్యంత సంపన్న దేశం ఏది ?
1) చైనా
2) జపాన్
3) బ్రిటన్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆఫ్రో ఏషియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ జాబితా - 2018లో అమెరికా అత్యంత సంపన్న దేశంగా నిలిచింది. రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో జపాన్, నాలుగో స్థానంలో బ్రిటన్ నిలిచాయి. భారత్ ఆరో స్థానంలో నిలవగా.. జర్మనీ ఐదో స్థానంలో ఉంది.
-
19. ఐసీసీ చైర్మన్ గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) శశాంక్ మనోహర్
2) శ్రీనివాసన్
3) స్టీవ్ వా
4) అర్జున రణతుంగ
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్‌కు చెందిన శశాంక్ మనోహర్ ఇటీవల మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2016లో ఆయన తొలిసారి ఐసీసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
-
20. హాకీ ఇండియా అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) ధన్ రాజ్ పిళ్లై
2) మరియమ్మ
3) రాజేందర్ సింగ్
4) మన్ ప్రీత్ సింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: హాకీ ఇండియా అధ్యక్షుడిగా రాజేందర్ సింగ్ ఎన్నికయ్యారు. మరియమ్మ ఆ పదవికి రాజీనామా చేయడంతో రాజేందర్ సింగ్‌ను ఎంపిక చేశారు. ఇదివరకు ఆయన జమ్ము కశ్మీర్ హాకీ సంఘంలో పనిచేశారు.
-
21. కింది వారిలో ఎవరు ఇండియా టాలెంట్ మానేజ్మెంట్ అవార్జు - 2018కు ఎంపికయ్యారు ?
1) చందాకొచ్చర్
2) రాణా కపూర్
3) ఉదయ్ కొటక్
4) ఆనంద్ మహీంద్రా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఎస్ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ ఇటీవల ఇండియా టాలెంట్ మానేజ్మెంట్ అవార్డు - 2018కు ఎంపికయ్యారు. బ్యాంకు నిర్వహణలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్నందుకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
-
22. దేశంలోనే వంద శాతం ఎల్ఈడీ వీధి దీపాలు కలిగిన తొలి జిల్లాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లా ఇటీవల గుర్తింపు పొందింది ?
1) శ్రీకాకుళం
2) కృష్ణా
3) అనంతపురం
4) తూర్పు గోదావరి
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా దేశంలోనే వంద శాతం ఎల్ఈడీ వీధి దీపాలు కలిగిన తొలి జిల్లాగా ఇటీవల గుర్తింపు సాధించింది. గ్రామీణ ఎల్ఈడీ వీధి దీపాల పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3.1 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చారు. దీని వల్ల ఏడాదికి 34 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు.
-
23. భారత్ - నార్డిక్ తొలి సమ్మిట్ ఇటీవల ఏ దేశంలో జరిగింది ?
1) స్వీడన్
2) యూకే
3) జర్మనీ
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018 ఏప్రిల్ లో ప్రధాని నరేంద్ర మోదీ యూకే, స్వీడన్ లో పర్యటించారు. రెండు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇటీవల స్వీడన్ లో నిర్వహించిన భారత్ - నార్డిక్ తొలి సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
-
24. ప్రతిష్టాత్మక రాజ్ కపూర్ జీవితకాల సాఫల్యపురస్కారం - 2018ను ఇటీవల ఎవరికి ప్రకటించారు ?
1) గోవిందా
2) అమితాబ్ బచ్చన్
3) సల్మాన్ ఖాన్
4) ధర్మేంద్ర
- View Answer
- సమాధానం: 4
వివరణ: సీనియర్ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఇటీవల రాజ్ కపూర్ జీవితకాల సాఫల్య పురస్కారం - 2018కి ఎంపికయ్యారు. రాజ్ కుమార్ హిరాణి రాజ్ కపూర్ ప్రత్యేక కాంట్రిబ్యూషన్ అవార్డుకి ఎంపికయ్యారు.
-
25. పోస్టల్ నిర్వహణను పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక యాప్ ఏది ?
1) SAMARPAN
2) BHIM
3) TEZ
4) DARPAN
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశంలో పోస్టల్ నిర్వహణను పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు కేంద్ర ఐటీ శాఖ ఇటీవల DARPAN( DIGITAL ADVANCEMENT OF RURAL POST OFFICE FOR A NEW INDIA) యాప్ ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1.29 లక్షల గ్రామీణ పోస్టల్ కార్యాలయాలను ఈ యాప్‌తో అనుసంధానం చేస్తారు.
-
26. నేషనల్ కేడెట్ కార్ప్స్ (NCC) డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అనుజ్ నయ్యర్
2) విజయ్ కుమార్ సింగ్
3) పీపీ మల్హోత్రా
4) అజయ్ అహుజా
- View Answer
- సమాధానం: 3
వివరణ: లెఫ్నెంట్ జనరల్ పీపీ మల్హోత్రా ఇటీవల డెరైక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ కేడెట్ కార్ప్స్ గా నియమితులయ్యారు.
-
27. ఇటీవల ఇస్రో వెల్లడించిన వివరాల ప్రకారం త్వరలో చేపట్టబోయే చంద్రయాన్ - 2 ప్రాజెక్టు వ్యయం ఎంత ?
1) రూ.500 కోట్లు
2) రూ.1000 కోట్లు
3) రూ.800 కోట్లు
4) రూ.1500 కోట్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై ప్రయోగాల కోసం రెండో ఉపగ్రహం ను చంద్రయాన్ -2 పేరుతో 2018 అక్టోబర్ - నవంబర్ నెలలో ప్రయోగించనుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.800 కోట్లు వెచ్చిస్తోంది. రూ.600 కోట్ల ఉపగ్రహ తయారీ ఖర్చు కాగా, రూ.200 కోట్ల ప్రయోగ నిర్వహణ వ్యయమని తెల్పింది.
-
28. ఈ కింది వాటిలో పులిట్జర్ అవార్డుల విభాగానికి చెందనిది ?
1) సైన్స్
2) పాత్రికేయం
3) సాహిత్యం
4) సంగీతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికాలోని వార్తా పత్రికలు, ఆన్లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీతం రంగాల్లో ఉత్తమ ప్రతిభకు పులిట్జర్ ప్రైజ్ అందజేస్తారు. మొత్తం 21 విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తారు. జోసెఫ్ పులిట్జర్ స్మారకంగా 1917 నుంచి ఏటా ఈ అవార్డులని అందజేస్తున్నారు.
-
29. గ్లోబల్ ఐటీ ఛాలెంజ్ ఫర్ యూత్ విత్ డిసెబిలిటీస్ (GITC)- 2018 సమావేశం ఏ నగరంలో జరగనుంది ?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) ముంబయి
4) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 2
వివరణ: గ్లోబల్ ఐటీ చాలెంజ్ ఫర్ యూత్ విత్ డిసెబిలిటీస్(GITC) 2018 నవంబర్ లో న్యూఢిల్లీలో జరగనుంది. ఈ మేరకు కేంద్ర దివ్యాంగుల అభివృద్ధి శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టీస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ ఇంటర్నేషనల్ కొరియా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
-
30. కింది వాటిలోఏ రాష్ట్రం మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ అవార్డు - 2017 కు ఎంపికై ంది ?
1) ఆంధ్రప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) తెలంగాణ
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
వివరణ: సినిమా చిత్రీకరణకు అనువైన మౌలిక సదుపాయాల కల్పన, యూజర్ ఫ్రెండ్లీ వెబ్ సైట్ తదితర వసతులను ఏర్పాటు చేసినందుకుగాను మధ్యప్రదేశ్ రాష్ట్రం కేంద్రం నుంచి మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ అవార్డు - 2017ను దక్కించుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రత్యేక జ్యూరీ అవార్డు పొందింది.
-
31. ప్రతిష్టాత్మక ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీ ఇటీవల వెలువరించిన నివేదిక ప్రకారం 2018లో బ్రిక్స్ దేశాల్లో ఏ దేశం ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేయనుంది ?
1) బ్రెజిల్
2) రష్యా
3) చైనా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రతిష్టాత్మక ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీ నివేదిక ప్రకారం బ్రిక్స్ దేశాల్లో భారత్ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేయనుంది. ఈ మేరకు ఇండియా సోర్స్ హయ్యర్ పేరుతో ఆ సంస్థ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 2018లో భారత వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదు కానుంది.
-
32. ప్రముఖ మ్యాగజైన్ ఫార్చూన్ ఇటీవల వెలువరించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకుల జాబితాలో చోటు సంపాదించిన భారతీయులు ఎవరు ?
1) ముఖేశ్ అంబానీ
2) ఇందిరా జైసింగ్
3) బాల కృష్ణ దోషి
4) పై ముగ్గురు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ మ్యాగజైన్ ఫార్చూన్ ఇటీవల ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకుల జాబితాను విడుదల చేసింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, మానవ హక్కుల న్యాయవాది ఇందిరా జైసింగ్, ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషి స్థానం సంపాదించారు. ముఖేశ్ 24వ స్థానంలో, ఇందిరా 20వ స్థానంలో, బాలకృష్ణ 40వ స్థానంలో నిలిచారు.
-
33. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 17
2) ఏప్రిల్ 19
3) ఏప్రిల్ 21
4) ఏప్రిల్ 23
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఏటా ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1947 ఏప్రిల్ 21న సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సివిల్ సర్వీసెస్ తొలి బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో పటేల్ సివిల్ సర్వీసెస్ అధికారులను భారత దేశానికి ఉక్కు కవచంగా అభివర్ణించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
-
34. టైమ్ మ్యాగజైన్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా- 2018లో చోటు సంపాదించిన అతి పిన్న వయస్కుడు ఎవరు ?
1) విర్గిల్ అబ్లోహ్
2) షాన్ మెండెస్
3) రిహానా
4) మిల్లీ బాబ్బీ బ్రౌన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అమెరికన్ వెబ్ టెలివిజన్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 14 ఏళ్ల మిల్లీ బాబ్బీ బ్రౌన్ టైమ్ మ్యాగజైన్ ప్రపంచ 100 మంది అత్యంత ప్రభావశీలురు జాబితా- 2018లో చోటు సంపాదిండంతో ఈ జాబితాలో చోటు పొందిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ జాబితాలో భారత్‌కు చెందిన సత్యనాదెళ్ల, విరాట్ కోహ్లీ, దీపికా పడుకోన్, భావిష్ అగర్వాల్ చోటు పొందారు.
-
35. ‘‘ఆది శంకరాచార్య : హిందూయిజమ్స్ గ్రేటెస్ట్ థింకర్’’ పుస్తక రచయిత ఎవరు ?
1) పవన్ వర్మ
2) సత్యనారాయణ జతియా
3) కమల్ నాథ్
4) రాజీవ్ గౌడ
- View Answer
- సమాధానం: 1
వివరణ: పవన్ వర్మ రచించిన ‘‘ఆది శంకరాచార్య : హిందూయిజమ్స్ గ్రేటెస్ట్ థింకర్’’ పుస్తకాన్ని ఏప్రిల్ 21న ఆవిష్కరించారు. పుస్తక తొలి కాపీని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కి అందజేశారు.
-
36. ధరిత్రి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 20
2) ఏప్రిల్ 22
3) ఏప్రిల్ 18
4) ఏప్రిల్ 16
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1970 నుంచి ఏటా ఏప్రిల్ 22న ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం నుంచి భూమిని రక్షించేందుకు ప్రభుత్వాలు, ప్రజలు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
Theme : End Plastic Pollution
-
37. ఎయిర్ పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియాలో ఫైర్ ఫైటర్ గా ఇటీవల నియమితులైన తొలి మహిళ ఎవరు ?
1) తానియా సన్యాల్
2) ఆయేషా ఫరూక్
3) భావనా కాంత్
4) కవితా నాయర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కోల్‌కతాకు చెందిన తానియా సన్యాల్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఫైర్ ఫైటర్‌గా నియమితులైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. పురుషులతో పాటుగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్న విధానంలో భాగంగా ఎయిర్ పోర్ట్స అథారిటీ అధికారులు ఆమెను ఈ విభాగానికి ఎంపిక చేశారు.
-
38. కిందివాటిలో ఏ దేశం ఇటీవల అణు పరీక్షలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ?
1) ఉత్తర కొరియా
2) దక్షిణ కొరియా
3) అమెరికా
4) రష్యా
- View Answer
- సమాధానం: 1
వివరణ: నిరంతర ఆయుధ పరీక్షలతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఉత్తర కొరియా అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపేయాలని నిర్ణయించింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లతో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీ నేపథ్యంలో ఈ మేరకు ప్రకటించింది.
-
39. భారత సుప్రీంకోర్టు ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎవరు ?
1) జస్టిస్ జాస్టి చలమేశ్వర్
2) జస్టిస్ దీపక్ మిశ్రా
3) జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్
4) జస్టిస్ రమేశ్ రంగనాథన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా (సీజేఐ)పై ఇటీవల అభిశంసన నోటీసులు జారీ చేశారు. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఇందులో ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలో 6 విపక్ష పార్టీలు ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సీజేఐ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి ఏప్రిల్ 20న నోటీసులు అందజేశాయి. ఈ నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. వీటినివెంకయ్య నాయుడు తిరస్కరించారు.
-
40. తెలంగాణలోని ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డును పొందింది ?
1) వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్
2) ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్
3) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
4) నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంపికై ంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో జీహెచ్ఎంసీకి ఈ అవార్డు దక్కింది. సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 21న ఢిల్లీలో జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి ఈ అవార్డును స్వీకరించారు.
-
41. భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా నియమితులయ్యారు ?
1) గుంటూరు
2) కృష్ణా
3) విశాఖపట్నం
4) తూర్పు గోదావరి
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ క్రీడల కోటాలో గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా నియమితుడయ్యాడు. ఈ మేరకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) అనిల్ చంద్ర పునీత నియామక పత్రాలు అందజేశారు. ఏపీ ప్రభుత్వం క్రీడల కోటాలో ఇదివరకే బ్యాడ్మింటన్ మహిళా క్రీడాకారిణి పి.వి. సింధును కూడా డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది.
-
42. పేద ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి ?
1) చంద్రన్న పెళ్లి కానుక
2) కల్యాణ లక్ష్మీ
3) షాదీ ముబారక్
4) ఎన్టీఆర్ పెళ్లి కానుక
- View Answer
- సమాధానం: 1
వివరణ: చంద్రన్న పెళ్లి కానుక కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ఈ పథకం కింద ఎస్టీ, మైనార్టీలకు రూ. 50,000, ఎస్సీలకు రూ.40,000, బీసీలకు రూ.35,000, దివ్యాంగులకు లక్ష రూపాయలను కానుకగా ఇస్తారు. కులాంతర వివాహాలు చేసుకునే దళితులకు రూ.75,000, బీసీలకు రూ.50,000 లను అందజేస్తారు. మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 20 శాతం, పెళ్లి రోజున 80 శాతం ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
-
43. వంద బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ సాధించిన తొలి భారత ఐటీ కంపెనీగా ఇటీవల గుర్తింపు పొందిన సంస్థ ఏది ?
1) విప్రో
2) టీసీఎస్
3) టెక్ మహీంద్రా
4) ఇన్ఫోసిస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: వంద బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ సాధించిన తొలి భారత ఐటీ కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్కు అందుకున్న వాటిలో 64వ కంపెనీగా నిలిచింది.
-
44. సౌరకుటుంబంలో గ్రహాంతర జీవులకు ఆవాసం కల్పించేందుకు అనువుగా ఉన్న గ్రహాల అన్వేషణకు ఇటీవల వ్యోమనౌకను ప్రయోగించిన సంస్థ ఏది ?
1) ఇస్రో
2) జాక్సా
3) రాస్ కాస్మోస్
4) నాసా
- View Answer
- సమాధానం: 4
వివరణ: సౌరకుటుంబంలో గ్రహాంతర జీవులకు ఆవాసం కల్పించేందుకు అనువుగా ఉన్న గ్రహాల అన్వేషణకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తొలిసారిగా వ్యోమనౌకను ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 19న వ్యోమనౌకను ప్రయోగించారు.
-
45. ఇటీవల జరిగిన మోంటెకార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) రోజర్ ఫెడరర్
2) నిషికోరి
3) రాఫెల్ నాదల్
4) నొవాక్ జకోవిచ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మోంటెకార్లో మాస్టర్స్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో జపాన్ కు చెందిన నిషికోరిని ఓడించి రాఫెల్ నాదల్ (స్పెయిన్) టైటిల్ గెలుచుకున్నాడు.
-
46. కమ్యూనిస్టు నాయకుడు మిగ్వెల్ డియాజ్ కానెల్ ఏ దేశ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు ?
1) మెక్సికో
2) క్యూబా
3) ఇరాన్
4) అర్జెంటీనా
- View Answer
- సమాధానం: 2
వివరణ: క్యూబా నూతన అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్ నాయకుడు మిగ్వెల్ డియాజ్ కానెల్ ఎన్నికయ్యారు. 2013 నుంచి క్యూబాకు తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న కానెల్ ప్రస్తుత అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో స్థానంలో బాధ్యతలు చేపడతారు. క్యాస్టో కుటుంబేతర వ్యక్తి ఈ పదవికి ఎన్నికవడం ఆరు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి.
-
47. ఇటీవల యునెస్కో ప్రెస్ ప్రీడమ్ పురస్కారానికి ఎంపికై న ఫొటో జర్నలిస్ట్ మెహమూద్ జైద్ అలియాస్ షాకన్ ఏ దేశానికి చెందినవాడు ?
1) ఈజిప్ట్
2) క్యూబా
3) రష్యా
4) ఇరాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నిర్భంధంలో ఉన్న ఈజిప్టు ఫొటో జర్నలిస్టు మెహముద్ అబు జైద్ అలియాస్ షౌకన్కు యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం దక్కింది. 2013లో కైరో రక్షణ దళానికి, ఇస్లామిస్ట్ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలను కవర్ చేసినందుకుగాను షౌకన్‌ను అరెస్టు చేశారు.
-
48. ప్రతిష్టాత్మక యుధ్ వీర్ పురస్కారం - 2018కి ఇటీవల ఎంపికై న వారు ఎవరు ?
1) సయ్యద్ ఉస్మాన్ అజహర్ మక్సూసీ
2) అజరుద్దీన్
3) యూసఫ్ పఠాన్
4) మహమ్మద్ అబ్దుల్లా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018 సంవత్సరానికి ప్రతిష్టాత్మక యుధ్వీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారం హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఉస్మాన్ అజహర్ మక్సూసీ కి దక్కింది. ఉచితంగా అన్నదానం చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్నందుకు ఆయనకు ఈ పురస్కారం లభించింది.
-
49. అమెరికాకు చెందిన హెరిటేజ్ ఫౌండేషన్ రూపొందించిన ఆర్థిక స్వేచ్ఛ సూచీలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 150
2) 180
3) 130
4) 100
- View Answer
- సమాధానం: 3
వివరణ: అమెరికాకు చెందిన హెరిటేజ్ ఫౌండేషన్ 180 దేశాలతో రూపొందించిన ఆర్థిక స్వేచ్ఛ సూచీలో భారత్‌కు 130వ స్థానం దక్కింది. కాగా, 2017తో పోల్చితే భారత్ 13 స్థానాలను మెరుగుపరుచుకోగా, చైనా ఒక స్థానం ఎగబాకి 110వ ర్యాంకు పొందింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 43 దేశాల్లో భారత్‌కు 30వ స్థానం దక్కింది.
-
50. భారత్ సొంతంగా రూపొందిస్తున్న సొంత నావిగేషన్ వ్యవస్థ పేరు ఏమిటి ?
1) జీపీఎస్
2) నావిక్
3) గ్లోనాస్
4) గెలీలియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్‌కు సొంత నావిగేషన్ వ్యవస్థ (నావిక్)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహాన్ని ఇస్రో ఇటీవల ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 43వ ఉపగ్రహం అయిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ (రీప్లేస్మెంట్) బరువు 1,425 కిలోలు. నావిక్ వ్యవస్థవల్ల భారత్ చుట్టూ 1500 కిలోమీటర్ల మేర నిర్ధిష్ట సమయం, పొజిషన్, నావిగేషన్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి.
-