కరెంట్ అఫైర్స్ (ఏప్రిల్ 1 - 8) బిట్ బ్యాంక్
1. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలో పాస్‌పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించారు ?
1) ఏలూరు
2) భీమవరం
3) కడప
4) తిరుపతి
- View Answer
- సమాధానం: 3
2. ఆంధ్రప్రదేశ్‌లో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు ఏ దేశంతో అవగాహనా ఒప్పందం జరిగింది ?
1) సింగపూర్
2)మలేషియా
3)తైవాన్
4)జపాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఏపీలో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం మలేషియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి విడతలో రూ. 400 కోట్ల పెట్టుబడులతో బియ్యం, జొన్న, చెరుకు వ్యర్థాలతో బయో డీగ్రేడబుల్ వస్తువుల తయారీ యూనిట్‌ను ఈ పార్కులో ఏర్పాటు చేయనున్నారు.
- సమాధానం: 2
3. దేశంలో తొలి డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసిన హైకోర్టు ఏది?
1) ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ఉమ్మడి హైకోర్టు
2) బాంబే హైకోర్టు
3) గాంధీనగర్ హైకోర్టు
4) ఢిల్లీ హైకోర్టు
- View Answer
- సమాధానం: 1
వివరణ: హైదరాబాద్ హైకోర్టు దేశంలోనే తొలి డిజిటల్ లైబ్రరీ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు వెలువరించిన తీర్పులు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను ఇందులో పొందుపరుస్తారు.
- సమాధానం: 1
4. ఇటీవల తెలంగాణలో ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) కరీంనగర్
2) హన్మకొండ
3) నిజామాబాద్
4) సిద్ధిపేట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: విదేశాంగ మంత్రిత్వశాఖ, పోస్టల్ శాఖ సంయుక్తంగా హన్మకొండ హెడ్ పోస్టాఫీస్‌లో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
- సమాధానం: 2
5. ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్ సీజన్ - 9 విజేత ఎవరు ?
1) ఖుదాబక్షీ
2) ఎల్.వి. రేవంత్
3) మికాసింగ్
4) అంకిత్ తివారి
- View Answer
- సమాధానం: 2
వివరణ: తెలుగు నేపథ్యగాయకుడు ఎల్.వి. రేవంత్ ఇండియన్ ఐడల్ సీజన్ - 9 ఫైనల్లో ఖుదాబక్షీని ఓడించి టైటిల్ విజేతగా నిలిచాడు. ట్రోఫీతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. ఇండియన్ ఐడల్ సీజన్ - 5 టైటిల్‌ను శ్రీరామచంద్ర గెలుచుకున్నాడు.
- సమాధానం: 2
6. చెదిరిన శ్వేత సౌధ స్వప్నం - హిల్లరీ క్లింటన్ పుస్తక రచయిత ఎవరు ?
1) అప్పారావు
2) రాజా రవిశ్
3) అలేఖ్య సుబ్బారావు
4) యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం అమెరికాలోని డెట్రాయిట్లో జరిగింది.
- సమాధానం: 4
7. నాటోలో 29వ సభ్యదేశంగా చేరినది?
1) సిరియా
2) ఉత్తర కొరియా
3) మాంటెనిగ్రో
4) వియత్నాం
- View Answer
- సమాధానం: 3
8. ప్రపంచ ఆహార పథకం (డబ్ల్యూఎఫ్‌పీ)నకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) డేవిడ్ బేస్లెయ్
2) గై రైడర్
3) క్రిస్టినా లగార్డె
4) కిటాక్ లీమ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సౌత్ కరోలినా మాజీ గవర్నర్ డేవిడ్ బేస్లెయ్ని ప్రపంచ ఆహార పథకానికి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఐరాస నియమించింది. డబ్ల్యూఎఫ్‌పీ పథకాన్ని 1961లో ఐరాస ప్రారంభించింది.
- సమాధానం: 1
9. ఇటీవల ఆర్బీఐ ఏ నాణేలను చట్టబద్ద ద్రవ్యం కాదని ప్రకటించింది ?
1) రూ.10
2) బిట్ కాయిన్
3) డాలర్
4) రూ.5
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ విలువ రూ.1,49,593. ప్రైవేటు వ్యక్తులు బిట్‌కాయిన్‌ను ఎలక్ట్రానిక్ మాధ్యమంలో విడుదల చేశారు. దీని వల్ల అనేక సమస్యలు ఉండటంతో వీటిని చట్టబద్దత లేని ద్రవ్యంగా ఆర్బీఐ ప్రకటించింది.
- సమాధానం: 2
10. భారత్ భూటాన్ నుంచి ఎంత విద్యుత్ దిగుమతి చేసుకుంటుంది ?
1) 5,185 మిలియన్ యూనిట్లు
2) 5,285 మిలియన్ యూనిట్లు
3) 5,585 మిలియన్ యూనిట్లు
4) 5,785 మిలియన్ యూనిట్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భూటాన్ నుంచి 5,585 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న భారత్.. నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు 5,789 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తుంది.
- సమాధానం: 3
11. ఇంటిగ్రేటెడ్ ఆటోమేటిక్ ఏవియేషన్ మెటిరోలాజికల్ సిస్టమ్స్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) అరక్కోణం
2) యుండియార్
3) పులికాట్
4) గజ్వేల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తమిళనాడులోని అరక్కోణం రాజోలీ ఎయిర్‌స్టేషన్‌లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైమానిక భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ నిరంతరం వాతావరణ మార్పులను గమనిస్తుంది.
- సమాధానం: 1
12. వియత్నాం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విజేత ఎవరు ?
1) హూ ఓంగ్, చాన్వెన్ హ
2) హ్యూన్ యె చూ మై, హుంగ్కాంగ్
3) త్రావుత్ పోత్పింగ్, నంతకరన్ యార్డె ఫిసాంగ్
4) చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ టోర్నీ ఫైనల్లో త్రావుత్ పోత్సింగ్ - నంతకరన్ యార్డె ఫిసాంగ్ల జోడిని ఓడించి చిరాగ్ శెట్టి - సాత్విక్ సాయిరాజ్ల ద్వయం టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 4
13. ప్రతిష్టాత్మక ఇండియా ప్రైడ్ 2016-17 పురస్కారానికి ఎంపికైన సంస్థ ?
1) ఓఎన్జీసీ
2) బీఈఎల్
3) ఎంటీఎన్ఎల్
4) ఏఏఐ
- View Answer
- సమాధానం: 4
వివరణ: దైనిక్ భాస్కర్ ప్రదానం చేసే ఇండియా ప్రైడ్ పురస్కారాలలో మౌళిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అవార్డుకు ఎంపికైంది. విద్యుత్ రంగంలో ఉత్తమ ప్రదర్శనకు గాను ఎన్టీపీసీ ఇండియా ప్రైడ్ పురస్కారాన్ని గెలుచుకుంది.
- సమాధానం: 4
14. అంతరిక్షంలో ఎక్కువ సమయం నడిచిన మహిళగా ఇటీవల రికార్డు సృష్టించిన వ్యోమగామి ఎవరు?
1) సునీతా విలియమ్స్
2) పెగ్గి విట్సన్
3) శాల్లీ రైడ్
4) స్వెత్లానా సావిత్స్కయా
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికాకు చెందిన వ్యోమగామి పెగ్గి విట్సన్ అంతరిక్షంలో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు నడిచి సునీతా విలియమ్స్ (7 సార్లు) రికార్డును అధిగమించారు. తాజాగా ఆరున్నర గంటల పాటు అంతరిక్షంలో నడిచి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌ను అధునీకరించడంతో ఆమె మొత్తం 53 గంటలు 22 నిమిషాలు నడిచినట్లయింది.
- సమాధానం: 2
15. ప్రపంచంలో తొలిసారిగా ఖనిజ లోహ గనులపై నిషేధం విధించిన దేశం ?
1) కెనడా
2) దక్షిణాఫ్రికా
3) చిలీ
4) ఎల్ సాల్వడార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: pac rim cayman కంపెనీ వల్ల తలెత్తిన వివాదంతో దేశంలో లోహ గనుల తవ్వకాలపై ఎల్ సాల్వడార్ నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- సమాధానం: 4
16. ఆసియా హాకీ ఫెడరేషన్ నుంచి బెస్ట్ ప్లేయర్ - 2016 పురస్కారానికి ఎంపికైంది ఎవరు ?
1) ఎస్ వి సునిల్
2) హర్మన్ ప్రీత్ సింగ్
3) వీ ఆర్ రఘునాథ్
4) పీటీ రావు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఎస్. వి. సునీల్ భారత హాకీ జట్టు సభ్యుడు. ఆసియాన్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2016 పురస్కారానికి హర్మన్ ప్రీత్‌సింగ్ ఎంపికయ్యాడు.
- సమాధానం: 1
17. బ్రిక్స్ బిజినెస్ ఆఫ్ దక్షిణాఫ్రికాకు ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) రజనిష్ గుప్తా
2) రాజేంద్ర కౌర్
3) డా. ఇక్బాల్ సుర్వె
4) డా. రామచంద్ర
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా పౌరుడు డా. ఇక్బాల్ సుర్వె బ్రిక్స్ బిజినెస్ ఆఫ్ దక్షిణాఫ్రికాకు చైర్మన్‌గా నియమితులయ్యారు.
- సమాధానం: 3
18. ''యుఫ్రెటెస్ షిల్డ్'' పేరుతో ఇటీవల ఏ దేశం మిలటరీ ఆపరేషన్‌ను నిర్వహించింది ?
1) ఇరాక్
2) టర్కీ
3) ఇరాన్
4) సిరియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఉత్తర సిరియా సరిహద్దులో యుఫ్రెటెస్ షిల్డ్ పేరుతో టర్కీ మిలటరీ ఆపరేషన్‌ను ఏడు నెలల పాటు నిర్వహించింది. దీని ముఖ్య ఉద్దేశం టర్కీ - సిరియా సరిహద్దు వెంట భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయటంతో పాటు ఐసీస్ తీవ్రవాదులను ఏరివేస్తూ సిరియా వాసులను వారి సొంత దేశానికి పంపటం.
- సమాధానం: 2
19. దేశంలో తొలిసారి అధికారిక మస్కట్‌ను విడుదల చేసిన టైగర్ రిజర్వ్ ఏది ?
1) సోనా బేడా టైగర్ రిజర్వ్
2) రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్
3) రత్నపాని టైగర్ రిజర్వ్
4) కన్హ టైగర్ రిజర్వ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మధ్యప్రదేశ్‌లోని కన్హ టైగర్ రిజర్వ్ దేశంలోనే తొలిసారిగా అధికారిక మస్కట్‌ను విడుదల చేసింది. దీని పేరు ''Bhoorsingh the Barasingha''. బారాసింఘా (జింక) మధ్యప్రదేశ్ రాష్ట్ర జంతువు.
- సమాధానం: 4
20. 22వ ఆసియాన్ అథ్లెటిక్స్ను నిర్వహించనున్న నగరం ఏది ?
1) భువనేశ్వర్
2) రాంచి
3) సేలం
4) కాన్పూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 22వ ఆసియాన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జూలైలో భువనేశ్వర్‌లో జరగనున్నాయి. వాస్తవానికి ఈ క్రీడలను నిర్వహించాల్సిన రాంచీ ఆర్థిక పరిస్థితుల వల్ల నిర్వహణ నుంచి తప్పుకోవటంతో వేదికను భువనేశ్వర్‌కు మార్చారు.
- సమాధానం: 1
21. రాష్ట్రీయ వయోశ్రీ యోజనను ఎక్కడ ప్రారంభించారు ?
1) రాంచీ
2) పూణె
3) బళ్లారి
4) నెల్లూరు
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేంద్ర సాంఘిక న్యాయ మరియు సాధికారత మంత్రి థవార్ చంద్ గెహ్లాట్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వయో వృద్ధులకు సహాయక పరికరాలను అందిస్తారు.
- సమాధానం: 4
22. దక్షిణాసియా సబ్ రీజనల్ ఎకనామిక్స్ కొపరేషన్ (SASEC) పథకంలో ఇటీవల కొత్తగా చేరిన దేశం ఏది ?
1) భారత్
2) మయన్మార్
3) శ్రీలంక
4) వియత్నాం
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాల కోరిక మేరకు ఆసియా అభివృద్ధి బ్యాంకు 2001లో ఎస్ఏఎస్ఈసీ పథకాన్ని ఏర్పాటు చేసింది. 2014లో శ్రీలంక, మాల్దీవులు ఇందులో చేరగా మయన్మార్ 7వ సభ్య దేశంగా ఇటీవల చేరింది.
- సమాధానం: 2
23. ఆర్బీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 1
2) ఏప్రిల్ 3
3) ఏప్రిల్ 5
4) ఏప్రిల్ 7
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1935 ఏప్రిల్ 1న కలకత్తా కేంద్రంగా ఆర్బీఐ ఏర్పాటైంది. 1937లో దీని కేంద్ర కార్యాలయం ముంబయికి మారింది.
- సమాధానం: 1
24. ఇటీవల యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ పురస్కారానికి ఎంపికైన వ్యక్తి ఎవరు ?
1) కె. చంద్రశేఖర్‌రావు
2) దేవేంద్ర ఫడ్నవీస్
3) ఎన్. చంద్రబాబు నాయుడు
4) నవీన్ పట్నాయక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కాలిఫోర్నియాలో జరిగిన రెండవ వార్షిక వెస్ట్ కోస్ట్ సమ్మిట్‌లో యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ నుంచి ట్రాన్సఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డును నారా చంద్రబాబు నాయుడు అందుకున్నారు.
- సమాధానం: 3
25. పవర్ టెక్స్ ఇండియా పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
1) మంగళంపల్లి
2) భివాండి
3) సూళ్లూరుపేట
4) తడ
- View Answer
- సమాధానం: 2
వివరణ: మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పవర్ టెక్స్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. దేశంలో పవర్ లూమ్స్ అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు.
- సమాధానం: 2
26. దేశంలో తొలి అంతర్జాతీయ సెంటర్ ఫర్ ఫుట్ అండ్ మౌత్ డిసీసెస్ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) భివాండి
2) అకోలా
3) సిలిగురి
4) ఆరగుల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: జంతువులను ఫుట్ అండ్ మౌత్ డిసీసెస్ నుంచి కాపాడేందుకు ఒడిశాలోని భువనేశ్వర్ వద్ద గల ఆరగుల్ ప్రాంతంలో దేశంలోని తొలి అంతర్జాతీయ ఫుట్ అండ్ మౌత్ డిసీసెస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 4
27. ఎస్బీఐలో అనుబంధ శాఖల విలీనం ఎప్పుడు జరిగింది ?
1) ఏప్రిల్ 7
2) ఏప్రిల్ 5
3) ఏప్రిల్ 3
4) ఏప్రిల్ 1
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఏప్రిల్ 1న ఆరు అనుబంధ బ్యాంకులు ఎస్బీఐలో విలీనమయ్యాయి. అవి.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, భారతీయ మహిళా బ్యాంకు.
- సమాధానం: 4
28. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు ?
1) రాజివ్ కుమార్ చందర్
2) మిశ్రాజీవర్మ
3) భగత్‌సింగ్ రాణా
4) సుస్మితా కుమారి వర్మ
- View Answer
- సమాధానం: 1
29. ప్రేగ్ మహిళల హాఫ్ మారథాన్‌లో మూడు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది ఎవరు ?
1) వయోలా జెప్చంబ
2) ఫాన్సీ కిమాట
3) జోయ్చిలిన్ జెక్కోస్జే
4) రొమానీ టిమైటా
- View Answer
- సమాధానం: 3
వివరణ: చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రేగ్ హాఫ్ మారథాన్‌లో జొయ్చిలిన్ జెక్కోస్జే 10 కి.మీ.లను 30:05 నిమిషాలలో, 15 కి.మీ.లను 45:37 నిమిషాలలో, మరియు పూర్తి పరుగును 1:04:52 సెక న్లలో పూర్తి చేసి 3 ప్రపంచ రికార్డులను నెలకొల్పింది.
- సమాధానం: 3
30. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 1
2) ఏప్రిల్ 2
3) ఏప్రిల్ 3
4) ఏప్రిల్ 4
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2007లో ఐరాసతీర్మానం ద్వారా ఏప్రిల్ 2ను ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు.
2017 థీమ్ : స్వయం ప్రతిపత్తి మరియు స్వీయ నిర్ణయం వైపు.
- సమాధానం: 2
31. జాతీయ సముద్ర దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 8
2) ఏప్రిల్ 5
3) ఏప్రిల్ 3
4) ఏప్రిల్ 1
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1919 ఏప్రిల్ 5న ది సిండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన మొదటి పడవ ఎస్ ఎస్ లాయల్టీ భారత్ నుంచి యూకేకు బయలుదేరింది. దీని గుర్తుగా ఏటా ఏప్రిల్ 5న జాతీయ సముద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 2
32. అభివృద్ధి మరియు శాంతికోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 6
2) ఏప్రిల్ 5
3) ఏప్రిల్ 4
4) ఏప్రిల్ 3
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆధునిక క్రీడా ఒలింపిక్స్ 1896 ఏప్రిల్ 6న మొదలయ్యాయి. దీనికి గుర్తుగా 2013 నుంచి ఐక్యారాజ్య సమితి ఏప్రిల్ 6న అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ప్రకటించింది.
- సమాధానం: 1
33. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 2
2) ఏప్రిల్ 3
3) ఏప్రిల్ 5
4) ఏప్రిల్ 7
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1950 నుంచి ఏటా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 4
34. దేశంలో తొలి బయోగ్యాస్ బస్సును ఎక్కడ ప్రారంభించారు ?
1) హైదరాబాద్
2) కోల్కత్తా
3) బెంగళూరు
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫోనిక్స్ ఇండియా రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రూప్, అశోక్ లేలాండ్ సంయుక్తంగా తొలి బయోగ్యాస్ బస్సును కోల్‌కత్తాలో తయారు చేశాయి. పశువుల పేడతో తయారు చేసిన బయోగ్యాస్‌ను ఇందులో ఇంధనంగా ఉపయోగిస్తారు.
- సమాధానం: 2
35. 19వ కామన్వెల్త్ అడవుల కాన్ఫరెన్స్‌ను ఎక్కడ నిర్వహించారు ?
1) ఊటి
2) డెహ్రాడూన్
3) నాథులా
4) పూణె
- View Answer
- సమాధానం: 2
వివరణ: డెహ్రాడూన్‌లోని అటవీ పరిశోధన కేంద్రంలో ఏప్రిల్ 3న 19వ కామన్వెల్త్ అడవుల కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సమావేశానికి 49 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వాతావరణ మార్పులు మరియు పచ్చదనం అనే అంశంపై ఈ సమావేశం జరిగింది.
- సమాధానం: 2
36. ప్రపంచ పార్లమెంటెరియన్ల మెగా కాన్ఫరెన్స్‌ను నిర్వహించిన దేశం ఏది ?
1) భారత్
2) శ్రీలంక
3) బంగ్లాదేశ్
4) వియత్నాం
- View Answer
- సమాధానం: 3
వివరణ: 136వ ప్రపంచ పార్లమెంటెరియన్ల మెగా కాన్ఫరెన్స్‌ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్వహించారు. రాజకీయ మరియు ఆర్థిక అసమానతల తొలగింపు, ప్రజాస్వామిక మరియు మానవ హక్కుల రక్షణపై సమావేశంలో చర్చించారు.
- సమాధానం: 3
37. నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్‌లో ఉత్తమ విద్యాసంస్థగా ఎంపికైన విశ్వవిద్యాలయం ఏది ?
1) ఐఐఎస్సీ బెంగళూరు
2)ఐఐటీ మద్రాస్
3) ఐఐఎం అహ్మదాబాద్
4) ఐఐటీ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వెలువరించింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఉత్తమ ఇంజినీరింగ్ విద్యా సంస్థగా ఐఐటీ మద్రాస్, ఉత్తమ మేనేజ్మెంట్ సంస్థగా ఐఐఎం అహ్మదాబాద్, ఉత్తమ ఫార్మసీ కాలేజీగా జామియా హమదార్థ్ (ఢిల్లీ) ఎంపికయ్యాయి.
- సమాధానం: 1
38. గులెర్మో కానో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) డిబాంగ్
2) డేవిడ్ గ్రెగో
3) దావిత్ ఇసాక్
4) హేలేని కూపర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పత్రికా స్వేచ్ఛకోసం కృషి చేసినందుకు గాను ఎరిత్రియన్ - స్వీడిష్ పాత్రికేయుడు దావిత్ ఇసాక్ యునెస్కో / గులెర్మో కానో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇసాక్‌ను దేశద్రోహం కేసు కింద ఎరిత్రియన్ ప్రభుత్వం 2001లో అరెస్టు చేసి జైలులో ఉంచింది.
- సమాధానం: 3
39. మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ - 2017 విజేత ఎవరు ?
1) జకోవిచ్
2) ఆండిముర్రే
3) రాఫెల్ నాదల్
4) రోజర్ ఫెదరర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మియామి ఓపెన్ ఫైనల్లో రాఫెల్ నాదల్‌ను ఓడించి రోజర్ ఫెదరర్ టైటిల్ విజేతగా నిలిచాడు. మహిళల టైటిల్‌ను జోహన్నకొంట గెలుచుకుంది.
- సమాధానం: 4
40. ఇటీవల జరిగిన ఇండియన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ?
1) సానియా మిర్జా
2) పీవీ సింధు
3) సైనా నెహ్వాల్
4) కరోలినా మారిన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇండియన్ సూపర్ సీరీస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒలింపిక్స్ బంగారు పతక విజేత కరోలినా మారిన్‌ను ఓడించి పీవీ సింధు టైటిల్ కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను విక్టర్ అక్షెల్సెన్ గెలుచుకున్నాడు.
- సమాధానం: 2
41. దక్షిణాసియా సబ్ రీజియన్ ఎకనామిక్ కొపరేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) ఢాకా
3) రంగూన్
4) కొలంబో
- View Answer
- సమాధానం: 1
42. ఇటీవల భారత్‌ను సందర్శించిన మలేషియా ప్రధానమంత్రి ఎవరు ?
1) అబ్దుల్ రహమాన్
2) హాన్సెని ఓన్
3) మహతీర్ మహమ్మద్
4) నజీబ్ రజాక్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 7 అంశాల్లో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.
- సమాధానం: 4
43. బెర్హంపూర్ థాకురాణి ఉత్సవాలు ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ?
1) ఆంధ్రప్రదేశ్
2) ఒడిశా
3) కేరళ
4) గోవా
- View Answer
- సమాధానం: 2
వివరణ: బెర్హంపూర్ థాకురాణి లేదా బుద్ధి థాకురాణి దేవత ఉత్సవాలను ఒడిశాలో నిర్వహిస్తారు. ఆ రాష్ట్రంలోని నేతపనివారు (దేవాంగ్రిస్) నెలరోజుల పాటు ఈ ఉత్సవాలను జరుపుతారు.
- సమాధానం: 2
44. ప్రపంచ యాంటి డోపింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నిషేధిత క్రీడాకారుల జాబితా - 2015లో భారత్ స్థానం ?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ యాంటి డోపింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ జాబితాలో రష్యా (176 మంది అథ్లెట్లు)తొలి స్థానంలో ఉంది. ఇటలీ (129 మంది అథ్లెట్లు) రెండో స్థానంలో ఉండగా.. భారత్ (117 మంది అథ్లెట్లు) మూడో స్థానంలో ఉంది.
- సమాధానం: 3
45. నేపాల్ ఆర్మీ గౌరవ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) జనరల్ బిపిన్ రావత్
2) జనరల్ వికే సింగ్
3) ఎయిర్ మార్షల్ మానెక్షా
4) ఫీల్డ్ మార్షల్ రాజేంద్రసింగ్
- View Answer
- సమాధానం: 1
46. ''ఆప్‌కి బేటి హమారి బేటి'' పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1) పంజాబ్
2) మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 4
వివరణ: రాష్ట్రంలో లింగ నిష్పత్తి మధ్య అంతరం పెరుగుతున్నందున ఆడపిల్లల సంరక్షణ కోసం హర్యానా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 2015 ఆగస్టు 24 తర్వాత మూడో బాలికకు జన్మనిచ్చిన దంపతులకు రూ.21 వేల ఆర్థిక సహాయం అందిస్తారు. ఎస్సీ దంపతులు మొదటి బాలికకు జన్మనిస్తే రూ. 21 వేలు ఇస్తారు.
- సమాధానం: 4
47. పర్యాటకం ద్వారా అతి ఎక్కువ ఆదాయం పొందుతున్న దేశాల్లో భారత్ స్థానం ?
1) రెండు
2) ఐదు
3) ఏడు
4) తొమ్మిది
- View Answer
- సమాధానం: 3
వివరణ: వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం భారత్ 2016లో పర్యాటకం ద్వారా 14.1 ట్రిలియన్ డాలర్ల ఆదాయం పొందింది. ఇది భారత్ జీడీపీలో 6 శాతం.
- సమాధానం: 3
48. స్త్రీ, పురుషులకు సమాన వేతనం ఇవ్వటం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన దేశం ?
1) ఐస్‌ల్యాండ్
2) స్వీడన్
3) నార్వే
4) ఫిన్లాండ్
- View Answer
- సమాధానం: 1
49. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారం - 2012కు ఎంపికైంది ఎవరు ?
1) హేమామాలిని
2) కోదండ రామిరెడ్డి
3) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
4) వాణిశ్రీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఎన్టీఆర్ జాతీయ పురస్కారం - 2012కు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, 2013 పురస్కారానికి హేమామాలిని ఎంపికయ్యారు. ఈ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేస్తుంది.
- సమాధానం: 3
50. దేశంలో పోలీసు అధికారిగా ఎంపికైన తొలి ట్రాన్స్‌జెండర్ ఎవరు ?
1) ప్రీతికా యాశిని
2) పుష్ప భోనగిరి
3) లోపాముద్ర యామిని
4) అదితి ముఖర్జీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: తమిళనాడుకు చెందిన ప్రీతికా యాశిని ఆ రాష్ట్ర పోలీసు శాఖలో సబ్ ఇన్స్‌స్పెక్టర్‌గా ఎంపికైంది.
- సమాధానం: 1