కరెంట్ అఫైర్స్ (అక్టోబర్ 9 -16) బిట్ బ్యాంక్
1. ఇటీవల ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభా అత్యధికంగా ఉన్న దేశం దేశం ఏది?
1) నైజీరియా
2) ఇండియా
3) ఇండోనేషియా
4) సూడాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత్‌లో 30 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. రెండవ స్థానంలో నైజీరియా (86 మిలియన్లు) ఉంది. ప్రతి రోజు 1.90 డాలర్లు కూడా సంపాదించలేని వారిని దారిద్య్రరేఖ దిగువన ఉన్నట్లు పపంచ బ్యాంక్ప్రకటించింది.
- సమాధానం: 1
2. ఇటీవల ఐఎమ్ఎఫ్ ఏ దేశ కరెన్సీని తన ఫండ్ రిజర్వ్‌లో చేర్చింది?
1) ఇండియా రుపీ
2) జపాన్ యెన్
3) చైనీస్ యువాన్
4) ఫ్రాన్స్ ఫ్రాంక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) చైనీస్ యువాన్‌ను తన రిజర్వ్ ఫండ్‌లో చేర్చింది. ప్రస్తుతం ఐఎమ్ఎఫ్ రిజర్వ్ ఫండ్‌లో ఉన్న కరెన్సీలు అమెరికన్ డాలర్, బ్రిటన్ పౌండ్, యురో, జపాన్ యెన్.
- సమాధానం: 3
3. 2016 కు గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1) జె. మైఖెల్ కోస్టర్ల్టిజ్
2) ఎఫ్. డంకన్ ఎమ్ హాల్డెన్
3) డేవిడ్ జె. థౌలెస్స్
4) పై అందరూ
- View Answer
- సమాధానం: 4
వివరణ: పదార్థం మీద చేసిన పరిశోధనలకుగాను డేవిడ్ జె. థౌలెస్స్, ఎఫ్. డంకన్ ఎమ్ హాల్డెన్, జె. మైఖెల్ కోస్టర్ల్టిజ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 4
4. ప్రతిష్టాత్మక గూగుల్ సైన్స్ ఫెయిర్ పురస్కారం 2016 నకు ఎంపికైంది ఎవరు?
1) కైరా నిర్గన్
2) సుభోద శర్మ
3) రాణి పాటిల్
4) మిత్రా సింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా పౌరురాలు కైరా నిర్గీన్ (Kiare Nirghin) గూగుల్ సైన్స్ ఫెయిర్ 2016 నకు ఎంపికైంది. ఆమె చేసిన ‘నో మోర్ త్రస్టీ క్రాప్స్’ రీసెర్చ్ ప్రాజెక్టుకు ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం కింద 50,000 డాలర్లు స్కాలర్ షిప్ లభిస్తుంది.
- సమాధానం: 1
5. ‘‘జాతీయ వైమానిక దళం ‘‘ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 1
2) అక్టోబర్ 3
3) అక్టోబర్ 6
4) అక్టోబర్ 8
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1932 అక్టోబర్ 8న మొదటిసారిగా అధికారికంగా జాతీయ వైమానిక దళ దినోత్సవాన్ని నిర్వహించారు.
- సమాధానం: 4
6. ‘‘హరిత కేరళమ్’’ ప్రాజెక్టు సౌహర్థ రాయబారి (Brand Ambassador) గా నియమితులైంది ఎవరు?
1) లతా మంగేష్కర్
2) అశా భోంస్లే
3) యెసుదాస్
4) మణి శర్మ
- View Answer
- సమాధానం: 3
7. దేశంలో పూర్తి డిజిటలైజేషన్ చేయబడిన మొదటి జిల్లా ఏది?
1) నాడియా
2) నాగ్‌పూర్
3) నల్గొండ
4) నరోర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మహరాష్ట్రలోని నాగ్‌పూర్ దేశంలో పూర్తిగా డిజిటలైజేషన్ చేయబడిన మొదటి జిల్లాగా రికార్డులకెక్కింది. ఈ జిల్లాలో ఉన్న 776 గ్రామ పంచాయితీలను డిజిటలైజేషన్ చేశారు.
- సమాధానం: 2
8. యువత ఓటు హక్కు నమోదు కోసం ఏ సంస్థతో భారత ఎన్నికల సంఘం ఒప్పందం చేసుకుంది?
1) ఫేస్బుక్
2) ట్విట్టర్
3) వాట్సప్
4) లింక్ట్ ఇన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫేస్బుక్లో 155 మిలియన్ల భారతీయులకు అకౌంట్ ఉంది. ఓటు హక్కు లేని 18 సంవత్సరాలు నిండిన యువకుల ఓటు నమోదు కోసం ఒక ఆష్షన్ను ఫేస్బుక్ ఏర్పాటు చేసే విధంగా ఎన్నికల సంఘం ఒప్పందం చేసుకుంది.
- సమాధానం: 1
9. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ‘‘హల్ ఆఫ్ ఫేమ్’’లో చోటు సంపాదించుకున్న శాస్త్రవేత్త ఎవరు?
1) సి.వి. రావ్
2) కాను గాంధీ
3) యు.ఆర్. రావ్
4) చంద్ర శేఖరన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1951లో అంతర్జాతీయఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్నుఅంతరిక్ష రంగ పరిశోధనలలో సహకారం కోసం పారిస్‌లో ప్రారంభించారు. ఈ సంస్థలో 66 దేశాల నుంచి 300 మంది సభ్యులు ఉన్నారు. IAF హల్ ఆఫ్ ఫేమ్‌లో ఇస్రో మాజీ చైర్మన్ యు.ఆర్. రావ్స్థానం సంపాదించుకున్నాడు. ఈయన 2013లో శాటిలైట్ హల్ ఆఫ్ ఫేమ్ వాషింగ్ట్‌న్‌లో కూడాచోటు సంపాదించుకున్నాడు.
- సమాధానం: 3
10. ప్రతిష్టాత్మక ‘జాన్ ఎఫ్ రిచర్డ్స్’ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) దినేష్ చక్రబర్తి
2) జార్జ్ మెనకెర్య
3) ఎస్.టి. జోషి
4) నయన్ జ్యోత్ లాహిరి
- View Answer
- సమాధానం: 4
వివరణ: ‘‘ప్రాచీన భారతదేశంలో అశోకా’’ అనే పేరుతో చారిత్రక పుస్తకాన్ని రచించినందుకుగాను నయన్ జ్యోత్ లాహిరిజాన్ ఎఫ్. రిచర్డ్స్ 2016 పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ పురస్కారాన్ని అమెరికన్ హిస్టరికల్ అసోసియేషన్ ప్రదానం చేస్తుంది. జాన్ ఎఫ్. రిచర్డ్స్ అనే చరిత్రకారుడు దక్షిణాసియా మీద, ముఖ్యంగా మొగల్స్ మీద పరిశోధన చేశారు.
- సమాధానం: 4
11. ప్రతిష్టాత్మక వాయిలార్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) కొలుక లూరి ఇనాక్
2) యు.కె. కుమారన్
3) మహశ్వేతాదేవి
4) పరవస్తు లోకేష్
- View Answer
- సమాధానం: 2
వివరణ: యు.కె. కూమారన్ రాసిన ’’ Thakshankunnu Swaroopam ’’ నకు ఈ పురస్కారం లభించింది. మళయాళం సాహిత్యంలో అత్యుత్తమ రచనలు చేసిన వారిని గౌవవించేందుకు వాయిలార్ రామవర్మ వాయిలార్ పురస్కారంను ప్రారంభించారు. ఈ పురస్కారం కింద రూ. 1 లక్ష నగదు, వెండి పతకాన్ని ఇస్తారు.
- సమాధానం: 2
12. ఇటీవల చెట్ల మీద ఉండే నూతన కప్ప జాతిని ఎక్కడ కనుగొన్నారు?
1) బ్రెజిల్
2) ఆస్ట్రేలియా
3) న్యూజిలాండ్
4) ఇండియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలోనే 239 కప్ప జాతులను కనుగొన్నారు.
- సమాధానం: 2
13. ఇటీవల ప్రపంచంలో ఆరో అతిపెద్ద పర్వతం ‘చోఒయు’ (Cho oyu) ను అధిరోహించిన భారతీయుడు/భారతీయురాలు ఎవరు?
1) అర్జున్ వాజ్‌పేయి
2) ప్రేమలత అగర్వాల్
3) నరేంద్రధర్ జైయాల్
4) హరిష్ కపాడియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: చైనా-నేపాల్ సరిహద్దులోని చోఒయు అనే పర్వతాన్ని అర్జున్ వాజ్‌పేయి అధిరోహించాడు. ఈ పర్వతం ఎత్తు 8188 మీటర్లు.
- సమాధానం: 1
14. ప్రపంచంలో ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఏది?
1) నార్వే
2) స్వీడన్
3) ఐస్లాండ్
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇటీవల ఫ్రాన్స్‌లో ప్లాస్టిక్ వాడక నిషేద చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ప్లాస్టిక్ వస్తువులు, డిస్పోజబుల్ గ్లాసులు, ప్లేట్లు తయారు చేయడం, వాడటం నిషేధం. గతంలో ఫ్రాన్స్ ప్రతి సంవత్సరం 4.7 బిలియన్ ప్లాస్టిక్స్ వ్యర్థాలను విడుదల చేసేది. అందులో 1 శాతం మాత్రమే రిసైకిల్ చేయగలిగారు.
- సమాధానం: 4
15. ఐక్యరాజ్య సమితి వాతావరణ పురస్కారం 2016 నకు ఎంపికైన సంస్థ ఏది?
1) భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ
2) సేవ్ ఎర్త్ పౌండేషన్
3) స్వయం శిక్షాన్ ప్రయోగ్
4) ట్రీ ఫర్ లైఫ్ పౌండేషన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్వయం శిక్షాన్ ప్రయోగ్ (Swayam shikshyan prayog) ఐక్యరాజ్య సమితి వాతావరణ పురస్కారం 2016నకు ఎంపికైంది. ఈ సంస్థను 1989లో ముంబయిలో ప్రారంభించారు. ఇది మహారాష్ట్ర, బీహార్లలో మహిళలకు పర్యావరణం, శక్తి గురించి అవగాహన కల్పించింది.
- సమాధానం: 3
16. ఇటీవల ఇస్రో GSAT-18 ఉపగ్రహంను ఏ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు?
1) శ్రీహరికోట
2) తుంబా
3) కెప్ కెనారవాల్
4) కౌరూ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫ్రెంచ్ గయానాలోని కౌరూ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి GSAT-18కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఎరియన్-5 ECAరాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం బరువు 3404 కేజీలు, జీవిత కాలం 15 సంవత్సరాలు.
- సమాధానం: 4
17. ప్రపంచ పోస్ట్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 9
2) అక్టోబర్ 10
3) అక్టోబర్ 13
4) అక్టోబర్ 16
- View Answer
- సమాధానం: 1
18. ఇటీవల స్కోమ్బర్ ఇండికస్ అనే నూతన చేప జాతిని ఏ ప్రాంతంలోకనుగొన్నారు?
1) తెలంగాణ
2) కేరళ
3) పశ్చిమ బెంగాల్
4) అస్సోం
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర సముద్ర చేపల పరిశోధన సంస్థ కేరళలో Scomber indicus అనే నూతన చేప జాతిని కనుగొన్నది. ఈ చేప మీద పులి లాగా చారలు ఉండటంతో స్థానికులు పులి అయల అని పిలుస్తున్నారు.
- సమాధానం: 2
19. ప్రతిష్టాత్మక ఏసియన్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 2016లో బంగారు పతాకాన్ని సాధించినది ఎవరు?
1) అంగ్హతే
2) కమర్ చావ్లా
3) సిద్ధార్థ్ పారిఖ్
4) అవానైకా శాన్ చిస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బిలియర్డ్స్‌లో ప్రపంచ మూడో ర్యాంక్‌లో ఉన్న సిద్ధార్థ్ పారిఖ్, మయన్మార్‌కు చెందిన అంగ్ హతేను ఓడించి బంగారు పతాకాన్ని సాధించాడు. ఏసియా బిలియర్డ్స్ క్రీడలు యూఏఈ లోని ఆల్- ఫు జైరహ్ లో నిర్వహించారు.
- సమాధానం: 3
20. నోబెల్ శాంతి పురస్కారం 2016నకు ఎంపికైంది ఎవరు?
1) రౌల్ క్యాస్ట్రో
2) థాబో ఎబెంకి
3) బాబ్ డైలాన్
4) జాన్ మాన్యుల్ సాంటోస్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కొలంబియాలో 50 సంవత్సరాల నుంచి అంతర్యుద్ధం కొనసాగుతుంది. దీనిని ఆపటానికి కొలంబియా అధ్యక్షుడు జాన్ మాన్యుల్ సాంటోస్తీవ్రవాద సంస్థ అయినా FARC తో ఒప్పందం కుదుర్చుకుని అంతర్యుద్దానికి ముగింపు పలికాడు. ఈ అంతర్యుద్ధంలో 2,20,000 మంది ప్రాణాలు కొల్పోయారు. 6 మిలియన్ల మంది వారి నివాసాలను కోల్పోయారు. కొలంబియాలో శాంతిని నెలకొల్పినందుకు గాను సాంటోస్‌కు శాంతి బహుమతి లభించింది.
- సమాధానం: 4
21. ప్రతిష్టాత్మక పాల్ హారిస్ పురస్కారానికి ఎంపికై ంది ఎవరు?
1) రతన్ వర్మ
2) ఎ.బి. మూసా
3) స్టీఫెన్ సన్
4) జాన్ సాల్క్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా వ్యాపారవేత్త ఎ.బి. మూసా (AB Moosa) చేసిన చారిటీ సేవలకు గాను పాల్ హారిస్ పురస్కారాన్ని అందుకున్నాడు. గతంలో ఈ పురస్కారాన్ని నెల్సన్ మండేలా, డెస్మండ్ టుటు, మదర్ థెరిస్సా అందుకున్నారు.
- సమాధానం: 2
22. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ నూతన చైర్మన్‌గా ఎంపికైంది ఎవరు?
1) అరుణ్ తివారి
2) చందాకొచ్చర్
3) రాజీవ్ రిషి
4) అరుంధతి భట్టాచార్య
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు నూతన చైర్మన్‌గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎమ్‌డీ రాజేష్ రిషి ఎంపికయ్యాడు.1946 సెప్టెంబర్ 26న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.
- సమాధానం: 3
23. ఆసియా దేశాల మంత్రుల సమావేశాన్ని నిర్వహించనున్న దేశం ఏది?
1) ఇండియా
2) మలేషియా
3) సింగపూర్
4) తైవాన్
- View Answer
- సమాధానం: 1
24. ఇటీవల అమెరికా ఏ దేశం మీద ఉన్న ఆర్థిక ఆంక్షలను తొలగించింది?
1) సిరియా
2) ఉత్తర కొరియా
3) మయన్మార్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మయన్మార్ గత రెండు దశాబ్దాల నుంచి మిలిటరీ పాలనలో ఉంది. దీని వల్ల ఆ దేశంలో మానవ హక్కులు ఉల్లంఘించారు. ఈ నేపథ్యంలో అమెరికా మయన్మార్ మీద ఆర్థిక ఆంక్షలు విధించినది. ఇటీవల మిలిటరీ పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయడంతో మయన్మార్ మీద ఉన్న ఆర్థిక ఆంక్షలను ఒబామా ప్రభుత్వం ఎత్తివేసింది.
- సమాధానం: 3
25. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ‘ప్లాటినమ్’ రేటింగ్ పొందిన విమానశ్రయం ఏది?
1) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2) రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
3) అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం
4) కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: 1
వివరణ: న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడవ టెర్మినల్‌ను అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించి, నిర్వహిస్తున్నందుకుగాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్నుంచి ప్లాటినమ్ రేటింగ్‌ను పొందినది. ఈ టెర్మినల్ దేశంలో అత్యంత రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్, ప్రపంచంలో 25వ అత్యంత రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్.
- సమాధానం: 1
26. ప్రపంచ ‘ఉరిశిక్ష ’ల వ్యతిరేక దినం ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 6
2) అక్టోబర్ 7
3) అక్టోబర్ 9
4) అక్టోబర్ 10
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచంలో 104 దేశాలు ఉరిశిక్షను రద్దు చేశాయి. 2002మే 13న రోమ్‌లో 158 స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సమావేశంలో ఉరిశిక్ష వ్యతిరేక దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 నజరుపుకోవాలని నిర్ణయించాయి.
- సమాధానం: 4
27. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 8
2) అక్టోబర్ 10
3) అక్టోబర్ 12
4) అక్టోబర్ 14
- View Answer
- సమాధానం: 2
28. 24వ ఏకలవ్య పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) మణిదిప్ సింగ్
2) వికాస్ దాహియా
3) శ్రాబణినాందా
4) గురుమలైసింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఒడిశా రాష్ట్రానికి చెందిన అత్యున్నత ప్రతిభ గల క్రీడాకారులను గౌరవించడానికిఇండియన్ మెటల్స్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఏకలవ్య పురస్కారాన్ని ప్రారంభించింది. ఈ పురస్కారం కింద రూ. 5 లక్షల నగదు, ఒక ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేస్తారు.
- సమాధానం: 3
29. ప్రపంచంలో మొదటిసారి ‘‘ బయోనిక్ ఓలింపిక్స్’’ (Bionic Olympics) ను ఎక్కడ నిర్వహించారు?
1) రియో
2)జ్యూరిచ్
3)ఓట్టావా
4) సిడ్నీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: బయోనిక్ ఓలింపిక్స్ లేదా సై బాథ్లాన్ (Cybathlon) క్రీడలు మొదటిసారిగా జ్యూరిచ్‌లో నిర్వహించారు. ఈ పోటీల్లో వికలాంగులు రోబోటిక్ టెక్నాలజీ సహయంతో పాల్గొంటారు.
- సమాధానం: 2
30. ప్రపంచంలో అతి ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?
1) చైనా
2) జపాన్
3) యూఎస్ఏ
4) ఇండియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలో అతి ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేస్తున్న మొదటి నాలుగు దేశాలు చైనా, జపాన్, యూఎస్ఏ, ఇండియా. ఇండియా జీడీపీ లో స్టీల్ పరిశ్ర మల భాగస్వామ్యం 2%.
- సమాధానం: 1
31. ఇటీవల గిన్నిస్‌బుక్‌లో ఎక్కిన ఉత్సవం/పండుగ ఏది?
1) ఓనమ్
2) గుడి పడ్వా
3) బతుకమ్మ
4) దుర్గపూజ
- View Answer
- సమాధానం: 3
వివరణ: హిందూ తెలుగు క్యాలెండర్ ప్రకారం మహలయ అమావాస్య రోజున బతుకమ్మ పండుగలో భాగంగా సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మను నిర్వహిస్తారు. సద్దుల బతుకమ్మ రోజున హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో 9,292 మంది మహిళలు సామూహికంగా బతుకమ్మలను పేర్చి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు.
- సమాధానం: 3
32. జపనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ విజేత ఎవరు?
1) సెబాస్టియన్ వెటల్
2) నికో రోస్‌బర్గ్
3) లేవిస్ హమిల్టన్
4) మాక్స్ వెర్సటప్పెన్
- View Answer
- సమాధానం: 1
33. టెస్ట్ క్రికెట్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన మొదటి ఇండియన్ కెప్టెన్ ఎవరు?
1) ఎమ్.ఎస్. ధోని
2) వీరేంద్ర సెవ్వాగ్
3) సచిన్ టెండుల్కర్
4) విరాట్ కోహ్లీ
- View Answer
- సమాధానం: 4
34. ప్రపంచ ఆడపిల్లల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 11
2) అక్టోబర్ 12
3) అక్టోబర్ 14
4) అక్టోబర్ 18
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆడపిల్లల దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించింది. మొదటిసారిగా 11 అక్టోబర్ 2012న కెనడా దేశంలో దీనిని నిర్వహించారు.
- సమాధానం: 1
35. సురక్షిత మాతృత్వ వారోత్సవాలను నిర్వహిస్తున్న రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) తమిళనాడు
3) పశ్చిమ బెంగాల్
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్యర్యంలో ఉత్తరప్రదేశ్‌లో అక్టోబర్ 15-21 వరకు సురక్షిత మాతృత్వ వారోత్సవాలు నిర్వహించారు. ఈ వారోత్సవాలలో గర్భిణులకు అవసరమైన సురక్షిత ఆహారం, వైద్య సహాయం, మందుల పంపిణి గురించి ప్రచారం చేశారు.
- సమాధానం: 4
36. ఐక్యరాజ్య సమితి ఎవరి పుట్టిన రోజును ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది?
1) డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం
2) అల్బర్ట్ ఐన్‌స్టీన్
3) ఐజాక్ న్యూటన్
4) ఫ్రెడరిక్ ప్రోబెల్
- View Answer
- సమాధానం: 1
37. ఇండియా- ఇండోనేషియా ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు?
1) జకర్తా తీరంలో
2)విశాఖ తీరంలో
3) బాలీ తీరంలో
4) అండమాన్ తీరంలో
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇండియా, ఇండోనేషియా ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు అండమాన్ తీరంలో నిర్వహించారు.
- సమాధానం: 4
38. ఔట్లుక్ బిజినెస్ మ్యాగజైన్ ఇచ్చే ‘‘అత్యుత్తమ ప్రముఖ మహిళ’’ (Outstanding Celebrity Woman) పురస్కారం 2016నకు ఎంపికైంది ఎవరు?
1) ఆమి జాక్సన్
2) ఐశ్వర్యరాయ్ బచ్చన్
3) కెథెరిన్ హెప్ బర్న్
4) ప్రియాంక చోప్రా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఔట్లుక్ బిజినెస్ మ్యాగజైన్అత్యుత్తమ 19 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఐశ్వర్యారాయ్ బచ్చన్ మొదటిస్థానంలో ఉంది. ఐశ్వర్యారాయ్ బచ్చన్ఐక్యరాజ్య సమితి ఎయిడ్స్ పథకం ప్రచారకర్తగా పనిచేస్తున్నారు.
- సమాధానం: 2
39. ఇండియన్ బిల్డింగ్స్ కాంగ్రెస్ పర్యావరణ పురస్కారానికి ఎంపికైన అంతర్జాతీయ విమానశ్రయం ఏది?
1) ఛండీఘర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్
2) గోవా అంతర్జాతీయ విమానశ్రయం
3) కొచ్చిన్ అంతర్జాతీయ విమానశ్రయం
4) పూణె అంతర్జాతీయ విమానశ్రయం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఛండీఘర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్‌లో నూతన టెర్మినల్ అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలకు తగినట్లుగా నిర్మించి, నిర్వహిస్తున్నందుకు IBC పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 1
40. అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 8
2) అక్టోబర్ 10
3) అక్టోబర్ 13
4) అక్టోబర్ 16
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1989లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని తీర్మానించింది.
2016 ఇతివృత్తం: Live to Tell, Raising Awareness, Reducing Mortality
- సమాధానం: 3
41. ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 8
2) అక్టోబర్ 14
3) అక్టోబర్ 16
4) అక్టోబర్ 20
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2016 ఇతివృత్తం: ప్రమాణాలు నమ్మకాన్ని నిర్మిస్తాయి( Standards Build Trust).
- సమాధానం: 2
42. ప్రపంచ ఆహార దినోత్సవం 2016 ఏ రోజున నిర్వహించారు?
1) అక్టోబర్ 30
2) అక్టోబర్ 25
3) అక్టోబర్ 20
4) అక్టోబర్ 16
- View Answer
- సమాధానం: 4
వివరణ: వాతావరణ మార్పులు పంటల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించకపోతే ప్రపంచంలో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది.
2016 ఇతివృత్తం:Climate is changing: Food and Agriculture must too
- సమాధానం: 4
43. ఇటీవల తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలు ఎన్ని?
1) 14
2) 17
3) 21
4) 25
- View Answer
- సమాధానం: 3
వివరణ: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 21 జిల్లాలు, 125 మండలాలు ఏర్పాటు చేశారు. 21 నూతన జిల్లాలతో తెలంగాణలో ప్రస్తుతం 31 జిల్లాలు ఉన్నాయి.
- సమాధానం: 3
44. ప్రపంచ ఆకలి సూచీ 2016లో ఇండియా ర్యాంక్ ఎంత?
1) 97
2) 90
3) 84
4) 29
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (IFPRI) పపంచ ఆకలి సూచీని తయారు చేసింది. ఈ సంస్థ 118 దేశాల గణాంకాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను విడుదల చేసింది. సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశం అర్జెంటీనా (పేదరికం తక్కువ). బ్రెజిల్ 16, రష్యా 24, చైనా 29, నైజీరియా 84, బంగ్లాదేశ్ 90, ఇండియా 97, పాకిస్థాన్ 107, ఆప్ఘనిస్థాన్ 111 వ స్థానాల్లో ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం ఇండియాలో 28.7 మిలియన్ల మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు.
- సమాధానం: 1
45. గుజరాత్ తీరం నుంచి గోరఖ్‌పూర్ వరకు అతి పెద్ద ఎల్పీజీ పైప్‌లైన్ నిర్మించనున్న సంస్థ ఏది?
1) ఓఎన్జీసీ
2) బీపీసీఎల్
3) ఐఓసీ
4) జీఏఐఎల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: గుజరాత్ తీరంలోని కాండ్లా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వరకు దేశంలోనే అతిపెద్ద ఎల్పీజీ పైప్ లైన్ మార్గం(1,987 కి,మీ.)ను ఐఓసీ నిర్మించనుంది. ఈ పైప్‌లైన్ ద్వారా ప్రతి సంవత్సరం 3.75 మిలియన్ టన్నులు ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేస్తారు. ప్రస్తుతం దేశంలో అతి పెద్ద గ్యాస్ పైప్‌లైన్ గుజరాత్‌లోని జామ్ నగర్ నుంచి ఢిల్లీ దగ్గర ఉన్న ‘లోని’ వరకు( 1, 415 కి.మీ) ఉంది. ఈ గ్యాస్ పైప్‌లైన్‌ను నిర్మించి నిర్వహిస్తున్న సంస్థ GAIL.
- సమాధానం: 3
46. నోబెల్ సాహిత్య పురస్కారం 2016నకు ఎంపికైంది ఎవరు?
1) జానీ క్యాస్
2) బాబ్ డిలాన్
3) జానీ మండేల్
4) నీల్ యంగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికాకు చెందిన ప్రముఖ గీత రచయిత, గాయకుడు, నటుడు బాబ్ డిలాన్ (Bob Dylan) నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికయ్యాడు. ఇతను రాసిన "Blow in the wind '' '' The times, they are a changing '' అమెరికాలో పౌర హక్కుల ఉద్యమంనకు తోడ్పాటునందించాయి.
- సమాధానం: 2
47. ఐక్యరాజ్య సమితికి నూతన సెక్రెటరీ జనరల్‌గా ఎంపికైంది ఎవరు?
1) నీల్ కిన్నోక్
2) నిగెల్ ఫరాజ్
3) ఎలియోడి రూపో
4) ఆంటానియో గుటేర్రస్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐక్యరాజ్య సమితిప్రస్తుత సెక్రెటరీ బాన్ కీ మూన్ స్థానంలో పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గటేర్రస్ (1995-2002) ఎంపికయ్యాడు. ఆంటోనియో గుటేర్రస్ 1999-2005 వరకు సోషలిస్ట్ ఇంటర్నేషనల్‌కు అధ్యక్షుడుగా పనిచేశాడు. సెక్రెటరీ జనరల్ పదవీకాలం 5 సంవత్సరాలు. గరిష్ఠంగా రెండుసార్లు ఎన్నికయ్యే అవకాశం ఉంది.
- సమాధానం: 4
48. ‘‘ ఉమెన్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్ 2016’’ ను ఎక్కడ నిర్వహించారు?
1) టొరంటో
2) మాస్కో
3) న్యూఢిల్లీ
4) బీజింగ్
- View Answer
- సమాధానం: 3
49. ప్రతిష్టాత్మక వి. కృష్ణమూర్తి ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) రఘునాధ్ అనంత్ మషేల్కర్
2) గిరిష్ సహాన్ని
3) సమీర్ కె. బ్రహ్మచారి
4) ప్రొ. ఎస్.కె. జోషి
- View Answer
- సమాధానం: 1
వివరణ: డా. వి. కృష్ణమూర్తి భారత ప్రభుత్వ విభాగంలో సెక్రటరీగా, BHEL, SAIL, మారుతీ ఆటోమెబైల్ కంపెనీకి చైర్మన్‌గా పనిచేశారు. వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వ్యక్తులను గౌరవించేందుకు సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ వి. కృష్ణమూర్తి ప్రతిభ పురస్కారంను ఏర్పాటు చేసింది. ఈ పురస్కారానికి CSIR మాజీ డైరక్టర్ జనరల్ ఆర్. ఎ. ముషేల్కర్ ఎంపికయ్యాడు.
- సమాధానం: 1
50. 28వ జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ (Jimmy George Foundation) పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) జోర్డాన్ స్మిత్
2) పి.ఆర్. శ్రీజేష్
3) విజయ సింగ్
4) డస్టిన్ జాన్సన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇండియా నుంచి అంతర్జాతీయ వాలీబాల్ క్రీడలకు ప్రాతినిధ్యం వహించిన మొదటి క్రీడాకారుడు జిమ్మీ జార్జ్. ఇతని పేరు మీద వివిధ క్రీడలలో ప్రతిభ చూపిన వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. పురస్కారం కింద రూ. 25,000 నగదు బహుమతి లభిస్తుంది. భారత హాకీ టీమ్ కెప్టెన్ పి.ఆర్. శ్రీజేష్ 28వ జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డునకు ఎంపికయ్యాడు.
- సమాధానం: 2