కరెంట్ అఫైర్స్ (అక్టోబర్ 1 - 8, 2017) బిట్ బ్యాంక్
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డెరైక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామింగ్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) సౌమ్యా స్వామినాథన్
2) అక్కినేని అమల
3) డాక్టర్ అధానామ్ గెబ్రేసియస్
4) మేధా పాట్కర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ కూతురు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డెరైక్టర్‌గా ఉన్న ఆమె ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ డెరైక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామింగ్‌గా నియమితులయ్యారు. డబ్ల్యూహెచ్‌వోలో ఈ పదవి రెండో అత్యున్నత స్థానం. డాక్టర్ అధానామ్ గెబ్రేసియస్ డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా 2017 మేలో నియమితులయ్యారు.
- సమాధానం: 1
2. ఎవరి జయంతిని పురస్కరించుకొని ఏటా అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహిస్తారు ?
1) మహాత్మా గాంధీ
2) నెల్సన్ మండేలా
3) మదర్ థెరెసా
4) జవహార్ లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: 1
వివరణ: అక్టోబర్ 2న భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఏటా ఈ రోజుని అహింసా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 2007లో జూన్‌లో తీర్మానించింది. విద్య, ప్రజా అవగాహన కార్యక్రమాల ద్వారా అహింసా సూత్రాలను ప్రమోట్ చేయటం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 1
3. భారత్ ఇటీవల ఏ దేశం నుంచి తొలిసారి ముడి చమురుని దిగుమతి చేసుకుంది ?
1) సౌదీ అరేబియా
2) ఇరాక్
3) ఇరాన్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1975లో చమురు ఎగుమతులను నిలిపివేసిన అమెరికా ఈ ఏడాది మళ్లీ వివిధ దేశాలకు మళ్లీ ఎగుమతులను ప్రారంభించింది. ఈ ఏడాది జూన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో భారత్‌కు ముడి చమురు సరఫరా చేసేందుకు అమెరికా అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా అమెరికా నుంచి చమురు ఓడ VLCC MT New Prosperity ద్వారా 1.6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుని ఇండియన్ ఆరుుల్ కార్పొరేషన్ దిగుమతి చేసుకుంది.
ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతి దేశంగా ఉంది. జపాన్ నాలుగో స్థానంలో ఉంది. భారత్‌కు అత్యధికంగా సౌదీ అరేబియా నుంచి 12.1 బిలియన్ బారెళ్ల ముడి చమురు దిగుమతి అవుతోంది. ఆ తర్వాత ఇరాక్, ఇరాన్, నైజీరీయా నుంచి దిగుమతి అవుతోంది.
- సమాధానం: 4
4. ఇటీవల ఏ రాష్ట్రంలో.. ప్రభుత్వ పథకాల కింద నిర్మించిన లక్ష ఇళ్లలో ఒకేసారి గృహ ప్రవేశం నిర్వహించి రికార్డు సృష్టించారు ?
1) గుజరాత్
2) మధ్యప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 2న ఒకేసారి లక్ష ఇళ్లలో గృహ ప్రవేశం నిర్వహించి రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన 1,01,396 ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించారు. ఇదే రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛాంద్ర మిషన్‌ను ప్రారంభించారు. PMJJBY చంద్రన్న బీమా పథకాన్ని కూడా ప్రారంభించారు.
- సమాధానం: 3
5. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎవరి అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కూడిన ఓబీసీ వర్గీకరణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు ?
1) జస్టిస్ ఎన్వీ రమణ
2) డాక్టర్ జే కే బాలాజీ
3) జస్టిస్ రోహిణి
4) బండారు దత్తాత్రేయ
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ఈ కమిటీ ఓబీసీ వర్గీకరణను పరిశీలిస్తుంది. జస్టిస్ రోహిణితో పాటు ఆంథ్రోపాలజీ సర్వే ఆఫ్ ఇండియా డెరైక్టర్ డాక్టర్ జేకే బాలాజీ, రిజి్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, కేంద్ర సామాజిక న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
- సమాధానం: 3
6. గ్లోబల్ వైల్డ్ లైఫ్ ప్రోగ్రామ్ కాన్ఫరెన్సను ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
1) బీజింగ్
2) ఢాకా
3) లండన్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ, ప్రపంచ బ్యాంకు, యునెటైడ్ నేషన్స డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ - UNDP సంయుక్త ఆధ్వర్యంలో ఢిల్లీలో గ్లోబల్ వైల్డ్ లైఫ్ ప్రోగ్రామ్ కాన్ఫరెన్సను నిర్వహించారు.Theme : Peoples Participation in wildlife conservation. ఈ కాన్ఫరెన్సలో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్దన్, 2017 - 2031 కోసం జాతీయ అటవీ జంతువుల యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేశారు. దేశంలోని అటవీ జంతువుల రక్షణ కోసం 1983 - 2001 వరకు మొదటి యాక్షన్ ప్లాన్, 2002 - 2016 వరకు రెండో యాక్షన్ ప్లాన్ అమల్లో ఉంది.
- సమాధానం: 4
7. కింది వాటిలో వేటిని గుర్తించినందుకుగాను అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్తలు రైనర్ వీస్, కీప్ థోర్న్, బారీ బారిష్‌లకు 2017 నోబెల్ అవార్డు లభించింది ?
1) గురుత్వాకర్షణ తరంగాలు
2) క్వాంటమ్ టెలీపోర్టేషన్
3) హేడ్రాన్ థెరపీ
4) సూపర్ లెన్స
- View Answer
- సమాధానం: 1
వివరణ: భౌతిక శాస్త్రంలో నోబెల్ - 2017 అవార్డుని అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్తలు రైనర్ వీస్, కీప్ థోర్న్, బారి బారిష్‌లకు ప్రకటించారు. గురత్వాకర్షణ తరంగాలను (Gravitational waves) గుర్తించినందుకు వీరికి ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించారు. కృష్ణ బిలాలు ఒకదానికి మరొకటి ఢీకొనడంలో వల్ల ఈ తరంగాలు ఏర్పడతాయని వీరు వివరించారు.
ఈ తరంగాలను గుర్తించేందుకు కీప్ థోర్న్, రైనర్ వీస్ అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటిరీ(లిగో)ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బారిష్ ఈ ప్రాజెక్టుకి తుది రూపునిచ్చారు. దీని ద్వారా ఈ తరంగాలను 2015లో తొలిసారి గుర్తించారు. 2017 ఫిబ్రవరిలో నాలుగోసారి గుర్తించారు. అవార్డు కింద పేర్కొన్న 1.1 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలకు సమానంగా అందజేస్తారు.
- సమాధానం: 1
8. రసాయన శాస్త్రంలో నోబెల్ - 2017 అవార్డు ఎవరికి దక్కింది ?
1) జాక్వేష్ డుబోష్
2) జోయాకిమ్ ఫ్రాంక్
3) రిచర్డ్ హెండర్సన్
4) పై ముగ్గురికి
- View Answer
- సమాధానం: 4
వివరణ: అతి సూక్ష్మమైన అణువులను ఫోటోలు తీసేందుకు ‘‘క్రయో ఎలక్టాన్ర్ మైక్రోస్కోపి’’ అనే కొత్త పద్ధతిని కనుగొన్నందుకుగాను స్విట్జర్లాండ్‌కు చెందిన జాక్వెస్ డుబోష్, జర్మనీకి చెందిన జోయాకిమ్ ఫ్రాంక్, స్కాట్లాండ్కు చెందిన రిచర్డ్ హాండర్స్న్లకు రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు లభించింది. బ్రెజిల్ ను వణికించిన జికా వైరస్, అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉన్న ఎంజైమ్ లను గుర్తించేందుకు క్రయో ఎలక్టరాన్ మైక్రోస్కోపీ విధానాన్నే ఉపయోగించారు. అవార్డు కింద పేర్కొన్న 1.1 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలకు సమానంగా అందజేస్తారు.
- సమాధానం: 4
9. జీవగడియారం రహస్యాన్ని ఛేదించినందుకుగాను వైద్యశాస్త్రంలో 2017 నోబెల్ అవార్డుకు ఎంపికై న శాస్త్రవేత్తలు జెఫ్రీ సి. హాల్, మైకేల్ రోస్ బాష్, మైకేల్ డబ్ల్యూ యంగ్లు ఏ దేశానికి చెందినవారు ?
1) అమెరికా
2) యూకే
3) రష్యా
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: శాస్త్రవేత్తలు జెఫ్రీ సి. హాల్, మైకేల్ రోస్ బాష్, మైకేల్ డబ్ల్యూ యంగ్ లు అమెరికాకు చెందిన వారు. సిర్కాడియమ్ రిథమ్ (జీవగడియారం)ను వివరించినందుకుగాను వీరు నోబెల్ - 2017 అవార్డుకు ఎంపికయ్యారు. భూమిపై నివసించే ప్రతి జీవి భూ పరిభ్రమణకు అనుగుణంగా జీవిస్తుందని.. అవి జీవ గడియారానికి వ్యతిరేకంగా వెళితే ప్రమాదకర వ్యాధుల బారిన పడక తప్పదని వీరు వివరించారు. అవార్డు కింద పేర్కొన్న 1.1 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలకు సమానంగా అందజేస్తారు.
- సమాధానం: 1
10. సాహిత్య నోబెల్ - 2017 అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు ?
1) పీటర్ కేరీ
2) కజువో ఇషిగురో
3) జాన్ మెక్ గాహెర్న్
4) జే కే రౌలింగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: The Remains of the day నవల ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బ్రిటన్ నవలా రచయిత కజువో ఇషిగురో 2017 నోబెల్ సాహిత్య అవార్డుకి ఎంపికయ్యారు. సాహిత్య రంగానికి అందించిన సేవలకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. పురస్కారంతో పాటు 1.1 మిలియన్ డాలర్లను ఆయన బహుమతిగా అందుకుంటారు. The Remains of the day నవల 1989లో మాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది.
- సమాధానం: 2
11. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ - 2017 అవార్డుకి ఎవరికి ప్రకటించారు ?
1) రఘురామ్ రాజన్
2) రిచర్డ్ థేలర్
3) మన్మోహన్ సింగ్
4) లారెన్స సమ్మర్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆర్థిక, మనస్తత్వ శాస్త్రాల సమన్వయంపై విశేష కృషిచేసిన అమెరికాకు చెందిన ప్రముఖ ఎకనమిస్ట్ రిచర్డ్ థేలర్ 2017 ఆర్థికశాస్త్ర నోబెల్ అవార్డుకు ఎంపికయ్యారు. బిహేవియర్ ఎకనమిక్స్‌లో చేసిన విస్తృత పరిశోధనలకుగాను ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. రిచర్డ్ థేలర్ ప్రతిపాదించిన సిద్ధాంతం నడ్‌జ థియరీగా ప్రసిద్ధికెక్కింది. బహుమతి కింద థేలర్ కి 1.1 మిలియన్ల నగదు అందజేస్తారు.
- సమాధానం: 2
12. అణ్వాయుధాల నిర్మూలన కోసం పాటుపడుతున్నందుకు గాను 2017 నోబెల్ పీస్ అవార్డుకు ఏ సంస్థ ఎంపికైంది ?
1) ICAN
2) CND
3) SGI
4) CTBTO
- View Answer
- సమాధానం: 1
వివరణ: అణ్వాయుధాల నిర్మూలన కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ ఐ కెన్( ICAN & International Campaign to Abolish Nuclear Weapons)కు నోబెల్ - 2017 శాంతి బహుమతి ప్రకటించారు. ఈ సంస్థ అంతర్జాతీయంగా అణ్వస్త్ర నిరాయుధీకరణను కోరుకుంటున్న వివిధ దేశాల్లోని వందలాది సంస్థల సమాహారం. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది.బహుమతి కింద సంస్థకు 1.1 మిలియన్ల నగదు అందజేస్తారు.
- సమాధానం: 1
13. ప్రపంచంలోనే అణ్యాయుధాలతో కూడిన అతిపెద్ద ఐస్ బ్రేకర్ షిప్ - సిబిర్ను ఏ దేశం రూపొందించింది ?
1) జపాన్
2) రష్యా
3) అమెరికా
4) చైనా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రాజెక్టు 22220లో భాగంగా రష్యా అణ్యాయుధాలతో కూడిన మూడు ఐస్ బ్రేకర్ షిప్‌లను రూపొందిస్తుంది. ఇందులో భాగంగా ఆర్కిటికా పేరుతో ఓ షిప్‌ని 2016లో ప్రారంభించింది. సిబిర్ (సైబీరియా) పేరుతో ఉన్న రెండో షిప్‌ను ఇటీవల జల ప్రవేశం చేయించింది. ఇది 13 ఫీట్ల మందంతో ఉన్న ఐష్షీట్స్ను ధ్వంసం చేయగలదు. దీని ద్వారా ఆర్కిటిక్ సముద్ర జలాల్లో రష్యా సరకు రవాణా పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మూడో నౌక ఉరల్ను 2019 నాటికి ప్రవేశపెడతారు.
- సమాధానం: 2
14. జాతీయ జలమార్గం - 4 పథకంలో భాగంగా ఇటీవల ఏ రాష్ట్రంలో జలరవాణా మార్గం అభివృద్ధికి శంకుస్థాపన చేశారు ?
1) కర్ణాటక
2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
వివరణ: జాతీయ జలమార్గం - 4 పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల నుంచి విజయవాడ మధ్య కృష్ణా నదిలో 82 కిలోమీటర్ల జలమార్గం అభివృద్ధికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర రవాణ, నౌకాయన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలో కృష్ణ్ణా, గోదావరి నదుల్లో జల రవాణ మార్గాల అభివృద్ధికి జాతీయ జలమార్గాలు - 4ను రూపొందించారు. Central Inland Water Transport Corporation (CIWTC) దీనికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
- సమాధానం: 3
15. కేంద్ర జలవనరుల శాఖ దేశంలోని ఏ ప్రాంతంలో తాబేలు సాంచ్యురీ (Turtle Sanctuary)ని ఏర్పాటు చేయనుంది ?
1) వారణాసి
2) హరిద్వార్
3) కోల్కత్తా
4) అలహాబాద్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అలహాబాద్‌లో తాబేలు సాంచ్యురీ, నది జీవ వైవిధ్య పార్కు ఏర్పాటుకు కేంద్ర జలవనరుల శాఖ ఆమోదం తెలిపింది. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా గంగా నది వెంట జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలహాబాద్ మీదుగా ప్రవహించే గంగా, యమున నదుల్లో అరుదైన తాబేలు జాతులు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదంలో ఉండటంతో వీటి సంరక్షణ కోసం ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
- సమాధానం: 4
16. భారత్ లో విద్యుత్ సరఫరా వ్యవస్థల అభివృద్ధి, సౌర విద్యుత్, పవన విద్యుత్ ప్రోత్సాహకానికి AIIB, ADB సంయుక్తంగా ఎన్ని మిలియన్ డాలర్ల రుణం ఇవ్వనున్నాయి ?
1) 100 మిలియన్ డాలర్లు
2) 200 మిలియన్ డాలర్లు
3) 300 మిలియన్ డాలర్లు
4) 400 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఏషియన్ ఇన్ఫ్రాస్టక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ - ఏఐఐబీ బీజింగ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ - ఏడీబీ మనీలా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ రెండు బ్యాంకులు భారత్‌లో విద్యుత్ సరఫరా వ్యవస్థల మెరుగుదల, పవన, సౌర విద్యుత్ వినియోగ ప్రోత్సాహం కోసం 100 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఇటీవల అంగీకరించాయి. ఏఐఐబీ, ఏడీబీ సంయుక్తంగా రుణం ఇవ్వడం ఇది నాలుగోసారి.
- సమాధానం: 1
17. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది ?
1) 5 శాతం
2) 6 శాతం
3) 3 శాతం
4) 10 శాతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: అక్టోబర్ 4న జరిగిన పరపతి విధాన కమిటీ( monetary policy committee)సమావేశంలో రెపో రేటుని యథాతథంగా(6 శాతంగా) ఉంచాలని నిర్ణయించారు. రివర్స్ రెపో రేటులో కూడా మార్పు లేకుండా 5.75 శాతంగా ఉంది.
బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అని.. బ్యాంకులు ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసే నగదుకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీని రివర్స్ రెపో రేటు అని అంటారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్.
- సమాధానం: 2
18. దేశంలోని పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం ఏది ?
1) ఇన్‌క్రిడిబుల్ ఇండియా
2) భారత్ పర్యటన్
3) పర్యాటక పర్వ్
4) భారత్ దర్శన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పించి దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర పర్యాటక శాఖ అక్టోబర్ 5న పర్యాటక్ పర్వ్ అనే కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించింది. దేఖో అప్నే దేశ్, టూరిజం ఫర్ ఆల్, టూరిజం అండ్ గవర్నెన్స అనే నినాదాలతో అక్టోబర్ 25 వరకు కార్యక్రమం జరుగుతుంది.
- సమాధానం: 3
19. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ సంస్థ గోల్డెన్ జూబ్లీ ఇయర్ వేడుకలను ( 50 ఏళ్ల ) ప్రారంభించారు ?
1) ICSI
2) NTPC
3) SEBI
4) FICCI
- View Answer
- సమాధానం: 1
వివరణ: Institute of company secretaries of india (ICSI)ని 1968లో ఏర్పాటు చేశారు. కానీ 1980లో ద కంపెనీస్ సెక్రటరీస్ యాక్ట్ ద్వారా ఈ సంస్థకు ప్రత్యేక హోదా కల్పించారు. కంపెనీల సెక్రెటరీ ప్రొఫెషన్ అభివృద్ధి, ప్రమోషన్, నియంత్రణ కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఇటీవల ఐసీఎస్ఐ 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో.. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు.
- సమాధానం: 1
20. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25వ చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అరుంధతి భట్టాచార్య
2) శిఖా శర్మ
3) చందా కొచ్చర్
4) రజనీష్ కుమార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ అరుంధతి భట్టాచార్య పదవీకాలం ముగియటంతో ఆమె స్థానంలో రజనీష్ కుమార్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఎస్బీఐలో 1980లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. భారత్‌లో అతిపెద్ద బ్యాంకుగా ఉన్న ఎస్బీఐలో ఈ ఏడాది ఐదు అనుబంధ బ్యాంకులు వీలనమయ్యాయి.
- సమాధానం: 4
21. రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్ కోవింద్ ఏ దేశంలో తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు ?
1) శ్రీలంక
2) జిబూతి
3) బంగ్లాదేశ్
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ 2017 జూలై 25న బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆయన తూర్పు ఆఫ్రికా దేశం జిబూతిలో పర్యటించారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యాలయ స్థాయి ద్వైపాక్షిక సంప్రదింపులు నెలకొల్పుకునే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేశాయి.
- సమాధానం: 2
22. బెంగళూరు మెట్రో ఫేస్ - 2 కోసం భారత ప్రభుత్వం ఏ విదేశీ బ్యాంకుతో 300 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ప్రపంచ బ్యాంక్
2) స్విస్ బ్యాంక్
3) యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
4) బ్యాంక్ ఆఫ్ అమెరికా
- View Answer
- సమాధానం: 3
వివరణ: బెంగళూరు మెట్రో ఫేస్ - 2 పనుల కోసం యూరోపియన్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు (EIB) 300 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందుకోసం భారత ప్రభుత్వం ఆ బ్యాంకుతో ఫైనాన్స కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.
- సమాధానం: 3
23. మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధి కోసం భారత్ ఇటీవల ఏ దేశానికి 4.5 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది ?
1) ఆఫ్గనిస్తాన్
2) మయన్మార్
3) శ్రీలంక
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: బంగ్లాదేశ్‌లో మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధి కోసం 4.5 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు సంబంధించిన ఒప్పందంపై భారత్, బంగ్లాదేశ్ దేశాలు ఇటీవల సంతకాలు చేశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది.
- సమాధానం: 4
24. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2017 జూన్ నాటికి భారత విదేశీ రుణ భారం ఎన్ని బిలియన్ డాలర్లకు చేరింది ?
1) 485.5 బిలియన్ డాలర్లు
2) 300 బిలియన్ డాలర్లు
3) 200 బిలియన్ డాలర్లు
4) 100 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత విదేశీ రుణ భారం 2017 జూన్ ముగిసే నాటికి 485.5 బిలియన్ డాలర్లకు చేరిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2017 మార్చి త్రైమాసికం ముగింపు నాటికి 472 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మొత్తం 3 శాతం మేర పెరిగి 485.5 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో జీడీపీ నిష్పత్తిలో విదేశీ రుణం 20.3 శాతంగా నమోదైంది.
- సమాధానం: 1
25. చంద్రమండల కక్ష్యలో తొలి అంతరిక్ష కేంద్రాన్ని (Lunar Space Station) ఏ రెండు దేశాలు కలిసి ఏర్పాటు చేయనున్నాయి ?
1) జపాన్ - చైనా
2) అమెరికా - రష్యా
3) భారత్ - సింగపూర్
4) ఉత్తర కొరియా - ఇరాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: చంద్రమండల కక్ష్యలో తొలి అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో సహకారానికి అమెరికా, రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. మార్స్ (అంగారకుడు) పైకి మానవులను పంపడం, అంతరిక్ష పరిశోధనలను మరింత విస్తృతంగానిర్వహించడానికి ఈ ఒప్పందం జరిగింది. నాసా నేతృత్వంలో ఈ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. 2030 నాటికి మార్స్‌పైకి మానవులను పంపాలనే లక్ష్యంగా నాసా పనిచేస్తుంది.
- సమాధానం: 2
26. మలేసియా గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత ఎవరు ?
1) వెర్ స్టాపన్
2) లూయిస్ హామిల్టన్
3) డీ రిక్కీయార్డో
4) సెబాస్టియన్ వెటల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మలేసియా గ్రాండ్ ప్రీ రేసులో రెడుబుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్ స్టాన్ తొలి స్థానంలో నిలిచి విజేతగా నిలిచాడు. లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో, డీ రిక్కీయార్డో మూడో స్థానంలో, సెబాస్టియన్ వెటల్ నాలుగో స్థానంలో నిలిచారు.
- సమాధానం: 1
27. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ పఖ్వాడా (Cleanliness drive)లో ఏ ప్రభుత్వ శాఖ ఉత్తమ పురస్కారం పొందింది ?
1) కేంద్ర పర్యావరణ శాఖ
2) కేంద్ర హోంశాఖ
3) కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
4) కేంద్ర ఆరోగ్య శాఖ
- View Answer
- సమాధానం: 4
వివరణ: స్వచ్ఛ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, ఆస్పత్రుల్లో పరిశుభ్రత కోసం స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమ అమలు విధానాన్ని పరిశీలించిన కేంద్రం.. కేంద్ర ఆరోగ్య శాఖకు ఉత్తమ పురస్కారాన్ని ప్రకటించింది.
- సమాధానం: 4
28. ఏ దేశానికి థాడ్ క్షిపణులను సరఫరా చేసేందుకు అమెరికా భారీ ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ?
1) సౌదీ అరేబియా
2) భారత్
3) పాకిస్తాన్
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సౌదీ అరేబియాకు అత్యాధునిక Terminal high altitude area defence -THAAD క్షిపణి రక్షణ వ్యవస్థ అమ్మకానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని విలువ 15 బిలియన్ డాలర్లు. ఈ క్షిపణులు శత్రు దేశాల క్షిపణులను మధ్యలోనే అడ్డుకొని పేల్చేస్తాయి. థాడ్ క్షిపణి వ్యవస్థను అమెరికా ఇంతక ముందే ఖతార్, యూఏఈలకు సరఫరా చేసింది. ఈ రెండు సౌదీ అరేబియా పొరుగు దేశాలు.
- సమాధానం: 1
29. స్వీపింగ్ యాంటీ కరెప్షన్ అనే కార్యక్రమం ద్వారా 13 లక్షల మంది అవినీతి అధికారులను శిక్షించినట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది ?
1) భారత్
2) చైనా
3) అమెరికా
4) ఫ్రాన్స
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రభుత్వ పాలనలో అవినీతిని అంతమొందించేందుకు 2012లో స్వీపింగ్ యాంటీ కరెప్షన్ కార్యక్రమాన్ని చైనా ప్రారంభించింది. దీని ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు 13.4 లక్షల మంది అవినీతి అధికారులను శిక్షించినట్లు ప్రకటించింది. వీరిలో 13 వేల మంది మిలిటరీ అధికారులు ఉన్నారు.
- సమాధానం: 2
30. సెంట్రల్ ఎలక్టస్రిటీ అథారిటీ - CEA ఇటీవల విడుదల చేసిన దేశంలోని అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల ర్యాంకింగ్‌సలో ఏ విద్యుత్ కేంద్రం తొలి స్థానంలో ఉంది ?
1) బుడ్గె బుడ్గె విద్యుత్ కేంద్రం
2) సిపత్ విద్యుత్ కేంద్రం
3) తాల్చేర్ విద్యుత్ కేంద్రం
4) సింగరేణి విద్యుత్ కేంద్రం
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ ఎలక్టిస్రిటీ అథారిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన ఆరు నెలల కాలంలో దేశంలో అత్యధిక ప్లాంట్‌లోడ్ ఫ్యాక్టర్ సాధించిన 25 విద్యుత్ కేంద్రాలకు ర్యాంకులు ప్రకటించింది. ఇందులో జైపూర్ లోని బుడ్గె బుడ్గె విద్యుత్ కేంద్రం తొలి స్థానంలో నిలిచింది. తెలంగాణలోని సింగరేణి విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో 8వ స్థానంలో నిలిచింది.
- సమాధానం: 1
31. ప్రపంచ స్పేస్ వీక్ (WSW) - 2017 వారోత్సవాలను ఎప్పుడు నిర్వహించారు ?
1) అక్టోబర్ 4 - 10
2) సెప్టెంబర్ 4 - 10
3) ఆగస్టు 4 - 10
4) నవంబర్ 4 - 10
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంతరిక్ష శాస్త్ర, సాంకేతికతలో నిర్వహించే వార్షిక వేడుకలే వరల్డ్ స్పేస్ వీక్ వారోత్సవాలు. 1957 అక్టోబర్ 4 తొలి మానవ తయారీ ఉపగ్రహం స్పుట్నిక్ని ప్రయోగించారు.అలాగే 1967 అక్టోబర్ 10న అంతరిక్ష ప్రయోగాలపై వివిధ దేశాలు గవర్నింగ్ ప్రిన్సిపల్స్పె సంతకం చేశాయి. ఈ రెండు సందర్భాల గుర్తుగా ఏటా అక్టోబర్ 4 - 10వ తేదీ వరకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తారు. WSW - 2017 వారోత్సవాలు ఇస్రో ఆధ్వర్యంలో విక్రమ్ సారాబాయి స్పేస్ స్టేషన్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, ఇస్రో ఇంటీరియల్ సిస్టమ్స్ యూనిట్, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్, సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లలో నిర్వహించారు.
- సమాధానం: 1
32. కుమరం భీం జాతీయ పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) ఆర్. నారాయణమూర్తి
2) జగపతి బాబు
3) దర్శకుడు శంకర్
4) మాలిక్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ టెలివిజన్ ఫోరం, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్, గోండ్వానా కల్చరల్ ప్రొటెక్షన్ ఫోర్స్, భారత కల్చరల్ అకాడమీ సంయుక్తంగా కుమురం భీం పురస్కారాన్ని అందజేస్తాయి. 2017 సంవత్సరానికి ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. అవార్డు కింద 51 వేల రూపాయలతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారు. గతంలో ఈ అవార్డుని కుమురం భీం చిత్రం నిర్మాత, దర్శకుడు అల్లాణి శ్రీధర్, గేయ రచరుుత సుద్దాల అశోక్ తేజ అందుకున్నారు.
- సమాధానం: 1
33. రైతులు సులువుగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) రూపే కార్డ్
2) మాస్టర్ కార్డ్
3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) ఐసీఐసీఐ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
వివరణ: నగదు రహిత లావాదేవీలను సురక్షితంగా జరపడం, రైతులు సులువుగా నగదు రహిత లావాదేవీలు జరిపేలా అవగాహన చేపట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్ కార్డ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
- సమాధానం: 2
34. ప్రముఖ వీడియోస్ నిర్వహణ సంస్థ యూట్యూబ్ తొలిసారి పాప్ - అప్ స్పేస్ కార్యక్రమాన్ని దేశంలోని ఏ నగరంలో నిర్వహించింది ?
1) విశాఖపట్నం
2) బెంగళూరు
3) చెన్నై
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆన్లైన్ వీడియో కమ్యూనిటీ వేదిక యూట్యూబ్ భారత్‌లో తొలిసారి పాప్-అప్ స్పేస్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించింది. కార్యక్రమంలో వీడియో చిత్రీకరణలో శిక్షణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కంటెంట్ రూపుదిద్దుకుంటుందో వివరించారు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ శాశ్వత ప్రాతిపదికన 9 స్పేస్‌లు ఉండగా.. భారత్‌లో ఏకైక కేంద్రం ముంబైలో ఉంది.
- సమాధానం: 4
35. సుద్దాల హనుమంతు - జానకమ్మ 2017 జాతీయ పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు ?
1) గోరటి వెంకన్న
2) దేశపతి శ్రీనివాస్
3) సంపత్ నంది
4) నందిని సిద్ధారెడ్డి
- View Answer
- సమాధానం: 1
వివరణ: సుద్దాల హనుమంతు - జానకమ్మ 2017 జాతీయ పురస్కారాన్ని ప్రజా కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు బహుకరించారు. 2010 నుంచి సుద్దాల ఫౌండేషన్ ఈ అవార్డులు అందజేస్తుంది.
- సమాధానం: 1
36. షూటింగ్‌ల కోసం సింగల్ విండో విధానాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: షూటింగ్‌లకు అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా సింగిల్ విండో విధానాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ - TSFDC.. నిర్మాతలు షూటింగ్‌ల కోసం చేసుకున్న దరఖాస్తులకు ఏడు రోజుల్లో అనుమతులు ఇస్తుంది. ఏడు రోజుల్లో అనుమతి రాకపోతే వచ్చినట్లుగానే పరిగణించి షూటింగ్ ప్రారంభించుకోవచ్చు.
- సమాధానం: 1
37. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించనున్న ఉపగ్రం పేరేమిటి ?
1) సన్ సాటిలైట్
2) సన్ ఎక్సెల్
3) ఆదిత్య ఎల్ - 1
4) మామ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత ప్రభుత్వం అనుమతించింది. పీఎస్ఎల్వీ-ఎక్సెల్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహిస్తారు. 2018 - 19లో ఈ ప్రయోగం నిర్వహించే అవకాశం ఉంది.
- సమాధానం: 3
38. అండర్ - 19 క్రికెట్ ప్రపంచ కప్ ప్రచాకర్తగా ఎవరిని నియమించారు ?
1) కోరి ఆండర్సన్
2) విరాట్ కోహ్లీ
3) కుమార సంగక్కర
4) బ్రెట్ లీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018లో జరిగే అండర్-19 ప్రపంచకప్ అంబాసిడర్‌గా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరి ఆండర్సన్ని ఐసీసీ నియమించింది. 2018 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు న్యూజిలాండ్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. 17 దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటారుు. అండర్ -19 ప్రపంచకప్‌ను భారత్, ఆస్ట్రేలియా మూడు సార్లు గెలుచుకున్నారుు.
- సమాధానం: 1
39. బల్గేరియన్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సీరీస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) ముహమ్మద్ అలీ కుర్ట్
2) గురుసాయి దత్
3) కిడాంబి శ్రీకాంత్
4) లక్ష్య సేన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: బల్గేరియన్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సీరీస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గురుసాయి దత్.. ముహమ్మద్ అలీ కుర్ట్ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు.
- సమాధానం: 2
40. చైనా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) రాఫెల్ నాదల్
2) నికి కిర్గియోస్
3) రోజర్ ఫెదరర్
4) నొవాక్ జకోవిచ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: చైనా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నికి కిర్గియోస్‌ను ఓడించి రాఫెల్ నాదల్ టైటిల్ గెలుచుకున్నాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో ఇది 75వ టైటిల్.
- సమాధానం: 1
41. జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత ఎవరు ?
1) లూయిస్ హామిల్టన్
2) వెర్ స్టప్పన్
3) డి రిక్కీయార్డో
4) వాల్తెరి బొటాస్
- View Answer
- సమాధానం:
వివరణ: జపాన్ గ్రాండ్ ప్రీ రేసులో బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తొలి స్థానంలో నిలిచి టైటిల్‌ను గెలుచుకున్నాడు. వెర్ స్టప్పన్ రెండో స్థానంలో, రిక్కీయార్డో మూడో స్థానంలో, బొటాస్ నాలుగోస్థానంలో నిలిచారు.
- సమాధానం:
42. ఇటీవల భారత్‌లోని ఏ రాష్ట్రంలో తొలిసారి శాస్త్రవేత్తలు మంచు చిరుత ఫోటోలను చిత్రీకరించారు ?
1) హిమాచల్ ప్రదేశ్
2) హర్యానా
3) జమ్ము అండ్ కశ్మీర్
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ కామెంగ్ జిల్లాలోని కమ్యూనిటీ కన్జర్వడ్ ఏరియా(CCA)లో శాస్త్రవేత్తలు తొలిసారి మంచుచిరుత పులిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా చిత్రీకరించారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (WWFI-India), అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. మంచు చిరుతల సంరక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 22 ప్రాంతాల్లో అరుణాచల్ ప్రదేశ్ ఒకటి.
- సమాధానం: 4
43. కార్పొరేట్ గవర్నెన్సపై ఇటీవల సెబీకి ప్రతిపాదనలు సమర్పించిన కమిటీకి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు ?
1) ఉదయ్ కొటక్
2) చందా కొచ్చర్
3) శిఖా శర్మ
4) అరవింద్ సుబ్రహ్మణ్యం
- View Answer
- సమాధానం: 1
వివరణ: కార్పొరేట్ గవర్నెన్సపై కొటక్ మహింద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ చైర్మన్ గా 21 మంది సభ్యులతో సెబీ(Securities and Exchange Board of India) 2017 జూన్‌లో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అనేక అంశాలను పరిశీలించిన తర్వాత ఇటీవల సెబీకి ప్రతిపాదనలు సమర్పించింది.
- సమాధానం: 1
44. తొలి ఆసియాన్ - ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్‌ను ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు ?
1) బెంగళూరు
2) బీజింగ్
3) న్యూఢిల్లీ
4) లాహోర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: న్యూఢిల్లీలోని పురానా క్విలాలో తొలి ఆసియాన్ - ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. విదేశాంగ శాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించారుు. ఆసియాన్ సభ్య దేశాలు, భారత్ మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతం కోసం ఈ వేడుకలను జరిపారు.
- సమాధానం: 3
45. ఉషు (WUSHU) వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరపున తొలి బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) పూజా కడియన్
2) రమేశ్ చంద్ర సింగ్
3) భాను ప్రతాప్ సింగ్
4) రాజిందర్ సింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉషు వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలు రష్యాలో జరిగారుు. ఫైనల్లో స్టెపనోవాను ఓడించి పూజా కడియన్ స్వర్ణాన్ని గెలుచుకుంది. భారత్‌కు చెందిన రమేశ్ చంద్రసింగ్ 48 కేజీల కేటగిరీలో, భాను ప్రతాప్‌సింగ్ 60 కేజీల కేటగిరీలో, 90 కేజీల కేటగిరీలో రాజిందర్ సింగ్ కాంస్యం గెలుపొందారు. చైనీస్ మార్షియల్ ఆర్ట్స నుంచి ఉషు క్రీడ పుట్టింది.
- సమాధానం: 1
46. రీచ్ ఆల్ విమెన్ ఇన్ వార్ (RAW IN WAR) అన్నా పొలిట్కోవస్కాయా అవార్డుని ఎవరికి ప్రకటించారు ?
1) బర్కా దత్
2) మేధా పాట్కర్
3) గౌరీ లంకేశ్
4) కిరణ్ బేడి
- View Answer
- సమాధానం: 3
వివరణ: రష్యా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అన్నా పొలిట్కోవస్కాయాను దుండగులు 2006 అక్టోబర్ 7న హతమార్చారు. ఆమె పేరిట ఏర్పాటు చేసిన ఈ అవార్డుని లండన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ రా ఇన్ వార్ ఆర్గనైజేషన్ మహిళా హక్కుల కోసం పోరాడిన మహిళలకు అందిస్తుంది. 2017 సంవత్సరానికిగాను భారత్‌కు చెందిన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్, పాకిస్తాన్‌కు చెందిన పీస్ యాక్టివిస్ట్ గులాలాయ్లకి ఈ అవార్డు ప్రకటించారు. గౌరీ లంకేశ్‌ని 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులో దుండగుల హత్య చేశారు.
- సమాధానం: 3
47. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇటీవల విడుదల చేసిన అధ్యయన నివేదిక ప్రకారం భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ఎప్పటిలోగా రెట్టింపు కానుంది ?
1) 2020
2) 2022
3) 2024
4) 2030
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థల సామర్థ్యం 58.30 గిగా వాట్లు. 2022 నాటికి దీన్ని 175 గిగావాట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
- సమాధానం: 2
48. నార్టన్ బై సెమాంటిక్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆన్లైన్ లో వేధింపులకు గురవుతున్న బాధితుల సంఖ్యలో తొలి స్థానంలో ఉన్న నగరం ఏది ?
1) ముంబై
2) ఢిల్లీ
3) హైదరాబాద్
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 1
వివరణ: నార్టన్ బై సెమాంటిక్ నివేదిక ప్రకారం ముంబైలో 51 శాతం మంది ఆన్లైన్ వేధింపులకు గురవుతున్నారు. 47 శాతంతో ఢిల్లీ రెండో స్థానంలో, 46 శాతంతో ముంబై మూడో స్థానంలో ఉన్నాయి.
- సమాధానం: 1
49. కాళేశ్వరం ప్రాజెక్టుని ఏ నదిపై నిర్మిస్తున్నారు ?
1) ప్రాణహిత
2) కృష్ణా
3) మంజీరా
4) గోదావరి
- View Answer
- సమాధానం: 4
వివరణ: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల స్టే విధించింది. ఈ ప్రాజెక్టుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయటం దీని లక్ష్యం.
- సమాధానం: 4
50. దేశంలో కొత్తగా ఎన్ని పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది ?
1) 300
2) 500
3) 650
4) 800
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలో సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 650 పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. దేశంలో ఉన్న 1.55 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్ర కసరత్తు చేస్తుందని చెప్పారు.
- సమాధానం: 3