కరెంట్ అఫైర్స్ (ఆగస్టు 25 - 31) బిట్ బ్యాంక్
1. ఇటీవల సుప్రీం కోర్టు ఏ ‘‘అంశం’’ను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది?
1) విద్య
2) వైద్యం
3) వ్యక్తిగత సమాచార గోప్యత
4) ఆస్తి కలిగి ఉండటం
- View Answer
- సమాధానం: 3
వివరణ: 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం వ్యక్తి సమాచారంను గోప్యంగా ఉంచటం ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశంనకు ఆధార్‌ను అనుసంధానించకూడదని తెలిపింది.
- సమాధానం: 3
2. భారతదేశంలో తొలి ‘‘విదేశ్ భవన్’’ను ఎక్కడ ప్రారంభించారు?
1) ముంబాయి
2) హైదరాబాద్
3) గాంధీనగర్
4) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ దేశంలోనే తొలి విదేశీ భవన్‌ను ముంబాయిలో ప్రారంభించారు. స్థానిక పాస్పోర్ట కేంద్రాలన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావటం దీని లక్ష్యం.
- సమాధానం: 1
3. ఇటీవల కర్ణాటక, దేశంలోనే తొలి ‘‘వ్యవసాయ ధరల అంచనా నమునా’’ (farm price forecasting mode) తయారు కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) సామ్సంగ్
2) ఫోర్డ
3) ఇన్ఫోసిస్
4) మైక్రోసాఫ్ట్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మైక్రోసాఫ్ట్ వ్యవసాయ ధరల అంచనా నమునా ద్వారా మార్కెట్ సమాచారంముందుగా రైతులు మరియు అధికారులకు అందిస్తుంది.
- సమాధానం: 4
4. ఇటీవల రాజస్థాన్ ఏ కులస్థులను ఓబీసీ ల జాబితాలో చేర్చింది?
1) మీనాలు
2) జాట్లు
3) గుజ్జర్లు
4) సింధోలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: భరత్పూర్ మరియు దోలాపూర్ జిల్లాలకు చెందిన జాట్లను ఓబీసీ జాబితాలో చేరుస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- సమాధానం: 2
5. ఇండియా - ఉజ్బెకిస్థాన్ దేశాల ద్వైపాక్షిక సమావేశాలు ఎక్కడ నిర్విహించారు?
1) తాష్కెంట్
2) సన
3) ఇస్తాంబుల్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇండియా - ఉజ్బెకిస్థాన్ల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, విద్యా మరియు ఆరోగ్యం వంటి అంశాలపై ఒప్పందాలు జరిగాయి.
- సమాధానం: 4
6. ఇటీవల ‘‘మంచు చిరుత పులి’’ సంరక్షణ కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసిన దేశం ఏది?
1) ఇండియా
2) శ్రీలంక
3) నేపాల్
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
వివరణ: నేపాల్ మంచు చిరుత పులిని కాపాడుట కోసం Global Snow Leopard & Ecosystem Protection Program అనే ప్రణాళిక తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే తొలి ప్రణాళిక.
- సమాధానం: 3
7. అంతర్జాతీయ మిలిటరీ సంగీతోత్సవాలు ఎక్కడ నిర్వహించారు?
1) మాస్కో
2) పారిస్
3) లండన్
4) బీజింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంతర్జాతీయ మిలిటరీ సంగీతోత్సవాలు మాస్కోలోని "Spasskaya Tower'' వద్ద నిర్వహించారు. ఇండియాకు చెందిన నావికాదళ బ్యాండ్ ఈ ఉత్సవాలలో పాల్గొంది.
- సమాధానం: 1
8. దేశంలో తొలిసారిగా ‘‘భారత్ QR'’ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేసిన రాష్ర్టం ఏది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం వీసా కంపెనీతో కలిసి విశాఖపట్నంను దేశంలోనే తొలి తక్కువ నగదు వాడుతున్న నగరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాయి.
- సమాధానం: 2
9. ఇటీవల టాటా పవర్ కంపెనీ ఏ దేశంలో హైడ్రో ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది?
1) చైనా
2) జార్జియా
3) కెనడా
4) టర్కీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: టాటాపవర్ కంపెనీ Adjaristsqali georgia LLC తో కలిసి జార్జియాలో186 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
- సమాధానం: 2
10. ఎయిర్ ఇండియా కొత్త సీఎండీ ఎవరు?
1) రాజీవ్ శర్మ
2) మేఘనాథ్ రెడ్డి
3) అశ్వని లోహని
4) రాజీవ్ బన్సల్
- View Answer
- సమాధానం: 4
11. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘‘ఓబీసీ క్రీమిలేయర్’’ పరిధిని ఎంతగా నిర్ణయించింది?
1) 6 లక్షలు
2) 6.5 లక్షలు
3) 7 లక్షలు
4) 8 లక్షలు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ పరిమితితో సంవత్సర ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే నాన్ క్రీమిలేయర్ కింద రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంది. గతంలో ఇది 6 లక్షలుగా ఉండేది.
- సమాధానం: 4
12. ఇటీవల ఫోర్బ్స విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు?
1) నరేంద్రమోడి
2) జాక్‌మా
3) మాహూతెంగ్
4) లీకున్ హి
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫోర్బ్సచైనాకు చెందిన ఈ కామర్స సంస్థ ఆలిబాబాఅధిపతి జాక్‌మా (37.4 బిలియన్) ను ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ప్రకటించింది. రెండవ స్థానంలో టెన్సెంట్ అధినేత మాహూ తెంగ్ (36.7 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
- సమాధానం: 2
13. ఇటీవల రిజర్వ బ్యాంక్ ఎంత విలువగల కొత్త కాగితపు కరెన్సీని విడుదల చేసింది?
1) 100
2) 150
3) 200
4) 250
- View Answer
- సమాధానం: 3
వివరణ: నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర సమస్య ను తొలగించడానికి రూ.200 విలువ గల కొత్త కాగితపు కరెన్సీ ని రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది.
- సమాధానం: 3
14. 2018లో జరిగే టేబుల్ టెన్నీస్ ప్రపంచకప్‌కు అతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది?
1) ఇంగ్లండ్
2) కెనడా
3) చైనా
4) ఇండియా
- View Answer
- సమాధానం: 1
15. UEFA 2016-17 సీజన్ కు ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికైంది ఎవరు?
1) లైయోనల్ మెస్సీ
2) నైమర్
3) క్రిస్టియానో రోనాల్డో
4) విక్టర్ హేన్రీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: క్రిస్టియానో రొనాల్డో ఈ పురస్కారం అందుకోవడం ఇది మూడవసారి. లయోనల్ మెస్సీ రెండుసార్లు ఈ పురస్కారం అందుకున్నారు.
UEFA - Union of European Football Association
- సమాధానం: 3
16. "I Do what I Do" పుస్తక రచయిత ఎవరు?
1) సి.రంగరాజన్
2) రఘురామ్ రాజన్
3) వీరప్ప మొయిలీ
4) సుబ్రత రాయ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రిజర్వ బ్యాంక్ మాజీగవర్నర్ రఘురామ్ రాజన్ "I Do what I Do on Reform, Rhetoric and Resolve" అనే పుస్తకంను రచించారు.
- సమాధానం: 2
17. ‘‘నమస్కార్ ఆఫ్రికా’’ అనే వాణిజ్య ప్రదర్శనను ఎక్కడ ప్రారంభించారు?
1) ఘనా
2) ఈక్విటోరియల్ గినియా
3) కెన్యా
4) జింబాబ్వే
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఘనాలో FICCI ఆధ్వర్యంలోనిర్వహిస్తున్న ‘‘నమస్కార్ ఆఫ్రికా’’ అనే వాణిజ్య ప్రదర్శనను కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎమ్జె అక్బర్ప్రారంభించారు.
- సమాధానం: 1
18. ఇటీవల నావికాదళం నుంచి ఏ నౌక ఉపసంహరించబడింది?
1) శివాలిక్
2) రాజ్పుట్
3) గోదావరి
4) వరుణ
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత కోస్ట్‌గార్‌డ నౌక వరుణ 30 సంవత్సరాలుగా దేశానికి సేవలందించింది. దీనిని నావికులకు శిక్షణలో ఉపయోగించేవారు.
- సమాధానం: 4
19. ఈశాన్య రాష్ట్రాలలో 100% కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన గ్రామం ఏది?
1) జైరో వ్యాలీ
2) తవాంగ్
3) నంగ్థాంగ్ తమ్పాక్
4) జులుక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలో తొలి 100% కంప్యూటర్ అక్షరాస్యత పొందిన గ్రామము కేరళలోని ఛమ్రవత్తొమ్ (Chamravattom). ఇటీవల మణిపూర్‌కు చెందిన నంగ్థాంగ్ తమ్పాక్(Nungthang Tampak) గ్రామం ఈశాన్య రాష్ట్రాల్లో 100% కంప్యూటర్ అక్షరాస్యత పొందిన గ్రామంగా రికార్డుల్లోకి ఎక్కింది.
- సమాధానం: 3
20. చైనా ఎన్ని బొగ్గు యేతర గనులను 2020లోపు మూసివేయనున్నట్లు ఇటీవల ప్రకటించిది?
1) 6000
2) 5000
3) 4000
4) 3000
- View Answer
- సమాధానం: 1
వివరణ: గనులలో జరిగే ప్రమాదాల నివారణకోసం 6000 బొగ్గు యేతర గనులను 2020 లోపు మూసివేయనున్నట్లు చైనా ప్రకటించిది.
- సమాధానం: 1
21. ఇటీవల ఏ దేశం పాస్ట్పోర్ట లో జెండర్ స్థానంలో ‘X’ (Third Gender) అని సూచించింది?
1) బ్రిటన్
2) రష్యా
3) కెనడా
4) ఇండియా
- View Answer
- సమాధానం: 3
22. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ దేశం నుంచి బంగారం మరియు వెండి దిగుమతుల పై నిషేదం విధించింది?
1) పాకిస్థాన్
2) దక్షిణ కొరియా
3) ఇరాన్
4) బర్మా
- View Answer
- సమాధానం: 2
23. ప్రతిష్ఠాత్మక బిజుపట్నాయక్ పురస్కారంను పొందినది ఎవరు?
1) ప్రొ. అప్పారావు
2) ప్రొ. రామాంజనేయులు
3) ప్రొ. రామకృష్ణ
4) ప్రొ. దిగంబర్ బేహరా
- View Answer
- సమాధానం: 4
వివరణ: బిజు పట్నాయక్ శాస్త్రీయ నైపుణ్య పురస్కారంనకు ప్రముఖ ప్రొఫెసర్ దిగంబర్ బెహరా ఎంపికయ్యారు.
- సమాధానం: 4
24. ట్రాన్సజెండర్ల తొలిమిస్ ఇండియా పోటీలు ఎక్కడ నిర్వహించారు?
1) గురుగ్రామ్
2) నోయిడా
3) కోల్కత్తా
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కొల్‌కత్తాకు చెందిన నిటాషా బిశ్వాస్ తొలి ట్రాన్సక్విన్ ఇండియాగా ఎంపికైంది. చెన్నైకు చెందిన రాగస్య రన్నరప్‌గా నిలిచింది.
- సమాధానం: 1
25. ఇటీవల యూఎస్ఏ ఏ దేశం పై ఆర్థిక ఆంక్షలు విధించింది?
1) క్యూబా
2) సిరియా
3) వెనెజులా
4) మెక్సికో
- View Answer
- సమాధానం: 3
26. ఇటీవల ఏ దేశం సైన్యంలో ట్రాన్సజెండర్లు చేరకుండా నిషేధం విధించింది?
1) యూఎస్ఏ
2) కెనడా
3) సూడాన్
4) ఉత్తర కొరియా
- View Answer
- సమాధానం: 1
27. 2016 సంవత్సరంలో అతి తక్కువ మంది పర్యాటకులను ఆకర్షించిన దేశం ఏది?
1) సిరియా
2) రష్యా
3) తువాలు
4) ఫిజి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) 2016లో అతి తక్కువ పర్యాటకులను ఆకర్షించిన దేశంగా తువాలు (2000 మంది) ను ప్రకటించింది. 2014 సంవత్సరంలో తువాలు 1000 మందిని మాత్రమే ఆకర్షించగల్గింది. ఆ దేశం మొత్తం జనాభా 11,000.
- సమాధానం: 3
28. ఇండియా మరియు ఇజ్రాయిల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిని ఎక్కడ తయారు చేశారు?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) భోపాల్
4) కాన్పూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ, దీర్ఘశ్రేణి ఉపరితలం నుండి గగన తలంలోకి ప్రయోగించే క్షిపణిని హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో నౌకాదళంనకు అందజేశారు.
- సమాధానం: 2
29. ఇటీవల ఇండియా, చైనా నుంచి దిగుమతి అవుతున్న ఏ వస్తువుల మీద యాంటి డంపింగ్ డ్యూటీని విధించింది?
1) సల్ఫర్
2) బంగారం
3) పటాసులు
4) సోడియం నైట్రేట్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సోడియం నైట్రేట్‌ను ఫార్మాసూటికల్స్, డై పరిశ్రమ, మాంసం ప్రాసెసింగ్ మరియు వస్త్రాల తయారీలో ఉపయోగిస్తారు. దేశంలోని పరిశ్రమలను కాపాడేందుకు చైనా నుంచి దిగుమతి అవుతున్ను సోడియం నైట్రేట్పై టన్నుకు 72.95 డాలర్ల యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది.
- సమాధానం: 4
30. భారత సుప్రీంకోర్టుకు 45వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైంది ఎవరు?
1) జస్టీన్ ఎమ్ఎన్ నాయక్
2) జస్టీస్ దీపక్ మిశ్రా
3) జస్టీస్ జెఎస్ ఖేహర్
4) జస్టీస్ సౌమిత్రాసేన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: సుప్రీం కోర్టు 45వప్రధాన న్యాయమూర్తిగాజస్టీస్ దీపక్ మిశ్రా నియమితులయ్యారు. ఇతను 13 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. త్రీవవాది యాకుబ్ మెమన్ ఉరికి సంబంధించిన తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టీస్ దీపక్ మిశ్రా కూడా ఉన్నారు.
- సమాధానం: 2
31. ఇటీవల పత్తి కాండాల ద్వారా బయో ఇథనాల్‌ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1) CSIR - NIIST
2) CCMB
3) IISC బెంగళూరు
4) IIT ఖరగ్‌పూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: CSIR - National Institute for Interdisciplinary science and Technology, తిరువనంతపురం, పత్తి కాండాల ద్వారా బయో ఇథనాల్‌ను తయారు చేసే విధానంను అభివృద్ధి చేసింది. భారతదేశంలో 9.4 మిలియన్ హెక్టార్ల పత్తిని పండిస్తారు. ప్రతి హెక్టార్లో 2 మిలియన్ టన్నుల పత్తి కాండాలు వృధా అవుతాయి.
- సమాధానం: 1
32. కిడ్నీలోని సమస్యలను గుర్తించడానికి బయో సెన్సార్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
1) CCMB
2) IISC బెంగూళూరు
3) IIT బొంబాయి
4) IIT ఖరగ్‌పూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కిడ్నీలోని సమస్యలను గుర్తించడానికి IIT బొంబాయి మరియు ఇండోర్లు సంయుక్తంగాబయోసెన్సార్లను అభివృద్ధి చేశాయి. ఈ సెన్సార్లు ఎనిమిది నిమిషాలలోపే సమస్యను గుర్తిస్తాయి.
- సమాధానం: 3
33. 23వ BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహించారు?
1) బీజింగ్
2) సింగపూర్
3) పారిస్
4) గ్లాస్గో
- View Answer
- సమాధానం: 4
వివరణ: స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో 23వ BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించారు. మహిళల సింగిల్స్‌లో నోజొమ ఓకుహరా (జపాన్) పురుషుల సింగిల్స్‌లో విక్టర్ ఆక్స్ల్సెన్ టైటిల్‌ను గెలుచుకున్నారు. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు రజతం, సైనా నెహ్వల్ కాంస్యంను గెలుచుకున్నారు.
- సమాధానం: 4
34. దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కప్ అండర్-15 టైటిల్‌ను గెలుచుకున్న దేశం?
1) ఇండియా
2) నేపాల్
3) శ్రీలంక
4) మలేషియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కప్ అండర్ -15 లో అతిథ్య జట్టు నేపాల్‌ను ఓడించి ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 1
35. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం, SBIలో ఎంత బంగారంను డిపాజిట్ చేసింది?
1) 3000 కేజీలు
2) 3500 కేజీలు
3) 2,780 కేజీలు
4) 2000 కేజీలు
- View Answer
- సమాధానం: 3
వివరణ: తిరుమల తిరుపతి దేవస్థానం12 సంవత్సరాల కాలానికిగాను 2,780 కేజీల బంగారంను SBIలో డిపాజిట్ చేసింది. దీని మీద ప్రతి సంవత్సరం 2.5% వడ్డీ వస్తుంది.
- సమాధానం: 3
36. అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ఏ ప్రాంతంలో అణు ఇంధనం రిజర్‌వను ఏర్పాటు చేసింది?
1) ఆస్ట్రేలియా
2) ఖజకిస్థాన్
3) తజకిస్థాన్
4) ఉజ్బెకిస్థాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీతక్కువ సమృద్ధి యురేనియం బ్యాంకును ఖజకిస్థాన్ లోఏర్పాటు చేయనుంది. దీనిని విద్యుత్ ఉత్పత్తిలో లైట్ వాటర్ అణుశక్తి రియాక్టర్ లో వాడతారు. ఇక్కడ 90 టన్నులు యురేనియం నిల్వలు ఉంచుతారు.
- సమాధానం: 2
37. UEFA మహిళల ఉత్తమ క్రీడాకారిణి పురస్కారంనకు ఎంపికైంది ఎవరు?
1) లీకే మార్టెన్స
2) హోప్ సోల్
3) కార్లి లైయార్డ
4) టొనీడుగ్గన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: UEFA మహిళల ఉత్తమ క్రీడాకారిణిగా లీకే మార్టెన్స ఎంపికైంది. ఈమె నెదర్లాండ్‌సకు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారిణి.
- సమాధానం: 1
38. 14వ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2017 ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) న్యూయార్క
3) బీజింగ్
4) పారిస్
- View Answer
- సమాధానం: 4
39. జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఆగస్టు 25
2) ఆగస్టు 29
3) ఆగస్టు 31
4) సెప్టెంబర్ 3
- View Answer
- సమాధానం: 2
వివరణ: హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజు (ఆగస్టు 29)ని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇతను 1928, 1932 మరియు 1936 ఒలింపిక్స్‌లో హకీలో భారత దేశానికి బంగారు పతకాలు సాధించారు. 1956లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.
- సమాధానం: 2
40. అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 29
2) ఆగస్టు 27
3) ఆగస్టు 25
4) ఆగస్టు 23
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2009లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించింది.
- సమాధానం: 1
41. జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఆగస్టు 20
2) ఆగస్టు 25
3) ఆగస్టు 30
4) సెప్టెంబర్ 10
- View Answer
- సమాధానం: 3
వివరణ: సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రతి సంవత్సరం ఆగస్టు 30న జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం నిర్వహిస్తుంది.
- సమాధానం: 3
42. ఇటీవల ఏ ప్రాంతంలో పండే వరికి భౌగోళిక గుర్తింపు లభించింది?
1) తెలంగాణ
2) పశ్చిమ బెంగాల్
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
వివరణ: పశ్చిమ బెంగాల్ లోని బుర్ధ్వాన్ జిల్లాలో పండించే గోబిందోభొగ్ అనే వరి ధాన్యమునకు భౌగోళిక గుర్తింపు లభించింది. భౌగోళిక గుర్తింపును భౌగోళిక గుర్తింపు రిజీస్ట్రీ ఇండియా ప్రదానం చేస్తుంది.
- సమాధానం: 2
43. మహిళల ట్రాన్సఫార్మింగ్ ఇండియా పురస్కారం 2017నకు ఎంపికైంది ఎవరు?
1) లక్ష్మీ అగర్వాల్
2) సఫినా హుస్సన్
3) అరుణిమ సిన్హా
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 4
వివరణ: నీతి అయోగ్, ఐక్యరాజ్య సమితి భారతశాఖ సహకారంతో ఈ పురస్కారంను ప్రారంభించింది. ఈ సంవత్సరం సమాజంలో మార్పునకు కృషి చేసిన 12 మందిని ఈ పురస్కారంనకు ఎంపిక చేశారు. వారు లక్ష్మీ అగర్వాల్ (మహిళల రక్షణ) సఫినా హుస్సన్ (మహిళల విద్య) కమల్ కుంబర్, సుబాసిని మిస్త్రి (పేదల కోసం ఆసుపత్రి) అరుణిమ సిన్హా (కృత్రిమ కాలుతో ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి మహిళ)
- సమాధానం: 4
44. ఫిఫా అండ ర్ 17 ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్న దేశం ఏది?
1) ఇండియా
2) చైనా
3) కెనడా
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫిఫా అండర్-17 ప్రపంచ కప్‌ను ఇండియా తొలిసారి నిర్వహిస్తుంది.
- సమాధానం: 1
45. CSO ప్రకటించిన నివేదిక ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) అరుణాచల్ ప్రదేశ్
3) గోవా
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ర్ట దేశీయోత్పత్తిలో జమ్ము కాశ్మీర్ (14.7) మరియు అరుణాచల్ ప్రదేశ్ (15.5%) రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అని CSO ప్రకటించింది.
- సమాధానం: 2
46. CSO ప్రకటించిన నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో తొలి స్థానంలో ఉన్న రాష్ర్టం ఏది?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) మహారాష్ర్ట
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: CSO ప్రకటించిన నివేదిక ప్రకారం గుజరాత్ 1,22,502 రూపాయల తలసరి ఆదాయంతో తొలిస్థానంలో ఉంది. తరువాత స్థానాలలో మహారాష్ర్ట (రూ.1,21,514) కర్ణాటక (రూ.1,13,506) మరియు తమిళనాడు (రూ.1,11,453) ఉన్నాయి.
- సమాధానం: 4
47. ఇండియా యురోపియన్ యూనియన్ త్రీవవాద వ్యతిరేక సదస్సును ఎక్కడ నిర్వహించారు?
1) పారిస్
2) న్యూఢిల్లీ
3) లండన్
4) వియన్నా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 10వ ఇండియా - యురోపియన్ యూనియన్ త్రీవవాద వ్యతిరేక సదస్సు మరియు సైబర్ భద్రత డైలాగ్ ను న్యూఢిల్లీలో నిర్వహించారు. 2018 సమావేశంను బ్రస్సెల్స్‌లో నిర్వహిస్తారు.
- సమాధానం: 2
48. జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఎంపికైన రాష్ర్టం ఏది?
1) తెలంగాణ
2) కేరళ
3) ఆంధ్రప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, ఆరోగ్య ప్రమాణాలను మెరుగ్గా పాటిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారంను ఇస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు రాజస్థాన్‌లు తొలి మూడు స్థానాలలో ఉన్నాయి.
- సమాధానం: 3
49. తెలంగాణలో తొలి స్మార్ట పొలీస్ స్టేషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) జమ్మికుంట
2) జగిత్యాల
3) నల్గొండ
4) భువనగిరి
- View Answer
- సమాధానం: 1
వివరణ: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన తొలి స్మార్ట పోలీస్ స్టేషన్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.
- సమాధానం: 1
50. జాతీయ ఉత్తమ అంగన్వాడీ కార్యకర్త పురస్కారంనకు ఎంపికైంది ఎవరు?
1) కొండ ఉమాదేవి
2) రాచకుంట్ల పద్మావతి
3) కత్తి రత్నమ్మ
4) మల్లమ్మ
- View Answer
- సమాధానం: 4
వివరణ: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి అంగన్వాడీ టీచర్ మల్లమ్మకు జాతీయ ఉత్తమ అంగన్ వాడీ కార్యకర్త పురస్కారం లభించింది. ఈ పురస్కారంను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రదానం చేస్తుంది. మల్లమ్మ ఆ శాఖ మంత్రి మనేకా గాంధీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకుంది. పురస్కారం కింద 25 వేల నగదు, ప్రశంసా పత్రం మరియు జ్ఞాపిక ఇస్తారు.
- సమాధానం: 4