Skip to main content

Senior Advocate: ప్రముఖ న్యాయకోవిధుడు సత్తి వెంకట్‌రెడ్డి కన్నుమూత

ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అడ్వొకేట్‌ జనరల్, సీనియర్‌ న్యాయవాది సత్తి వెంకట్‌రెడ్డి కన్నుమూశారు.
Senior Advocate Satthi Venkat Reddy
Senior Advocate Satthi Venkat Reddy

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆగష్టు 23 న హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 97 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నా రు.   సత్తి వెంకట్‌రెడ్డి స్వస్థలం పశి్చమగోదావరి జిల్లా, కవిటం గ్రామం. అక్కడే 1926, ఫిబ్ర వరి 25న జని్మంచారు. 1951లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. కొంత కాలం పాటు రాజమండ్రిలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. అటు తరువాత 1956లో హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా పేరుగాంచారు. 1992–94 మధ్య కాలంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, సత్తి వెంకట్‌రెడ్డి అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలు అందించారు. ఆయన పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 23rd కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 24 Aug 2022 04:59PM

Photo Stories