Skip to main content

సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా దినేశ్‌కు బాధ్యతలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా టీవీఎస్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ ఆర్‌ దినేశ్‌ బాధ్యతలు స్వీకరించారు. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సీఎండీ సంజీవ్‌ బజాజ్‌ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు.
dinesh
dinesh

అలాగే, ఎర్న్‌స్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియా చైర్మన్‌ రాజీవ్‌ మెమాని సీఐఐ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన సీఐఐ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో 2023–24కు గాను కొత్త ఆఫీస్‌–బేరర్లను ఎన్నుకున్నారు. 

Published date : 26 May 2023 01:42PM

Photo Stories