Oscar Fernandes: మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ ఫెర్నాండెజ్ అస్తమయం
2021, జూలై నెలలో ఆయన నివాసంలో వ్యాయామం చేస్తుండగా కింద పడటంతో తలకు గాయమై మెదడులో రక్తం గడ్డకట్టింది. దీనికి సంబంధించి చికిత్స పొందుతూ సెప్టెంబర్ 13న మంగళూరులోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 50 ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన ఫెర్నాండెజ్ కర్ణాటకలోని ఉడుపి నియోజకవర్గం నుంచి తొలిసారిగా 1980లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాతా వరసగా నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నియ్యారు. రాజ్యసభకు తొలిసారిగా 1998లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత మూడు సార్లు ఎన్నికయ్యారు. 2006 నుంచి 2009 వరకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
చదవండి: బీపీసీఎల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఆస్కార్ ఫెర్నాండెజ్(80)
ఎక్కడ : మంగళూరు, కర్ణాటక
ఎందుకు : వ్యాయామం చేస్తుండగా కింద పడటంతో తలకు తగిలిన గాయం కారణంగా...