Skip to main content

Morning Consult: ప్రపంచ దేశాల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత?

Modi

అత్యధిక ప్రజాదరణ కలిగిన ప్రపంచ దేశాల నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. డేటా ఇంటెలిజెన్స్‌ కంపెనీ మార్నింగ్‌ కన్సల్ట్‌ ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసి జనవరి 21న విడుదల చేసిన జాబితాలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో ప్రధాని మోదీ తొలిస్థానంలో నిలిచారు. భారత వయోజన జనాభాలో 71 శాతం మంది మోదీకే మద్దతు తెలిపినట్లు మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ వెల్లడించింది. మోదీతో పాటు మరో 13 మంది నేతలకు ఈ జాబితాలో చోటు దక్కింది. వీరిలో మెక్సికో అధినేత ఆండ్రస్‌ మాన్యుల్‌ ఎల్‌పెజ్‌ ఒబ్రాడర్‌ 66 శాతం ప్రజాదరణతో, ఇటలీ ప్రధాని మారియో ద్రాగీ 60 శాతం ప్రజాదరణతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. జాబితాలో 26 శాతం రేటింగ్‌తో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అట్టడుగున నిలిచారు.

మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ ప్రపంచ నేతల జనాదరణను మదింపు చేయడం మొదలుపెట్టిన తర్వాత మోదీ 2020 మేలో అత్యధిక రేటింగ్‌(84 శాతం)ను, 2021 కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో అల్ప రేటింగ్‌(63 శాతం)ను పొందారు.

తిరస్కరణ జాబితాలో బోరిస్‌ టాప్‌

అత్యధికంగా ప్రజా తిరస్కరణ పొందిన నేతల్లో బోరిస్‌ జాన్సన్‌ 69 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, 59 శాతం రేటింగ్‌తో ఫ్రాన్స్‌నేత ఇమ్మానియేల్‌ మాక్రాన్, 56 శాతం రేటింగ్‌తో బొల్సెనారో రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో 21 శాతం రేటింగ్‌తో మోదీ అట్టడుగు స్థానం పొందారు. 

చ‌ద‌వండి: విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన పిన్నవయస్కురాలు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత?
ఎప్పుడు : జనవరి 21
ఎవరు    : భారత ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ    : ప్రపంచంలో..
ఎందుకు : డేటా ఇంటెలిజెన్స్‌ కంపెనీ మార్నింగ్‌ కన్సల్ట్‌ చేసి సర్వే ప్రకారం..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 22 Jan 2022 02:44PM

Photo Stories