Namibian President: నమీబియా అధ్యక్షుడు గీన్ గోబ్ కన్నుమూత
Sakshi Education

నమీబియా అధ్యక్షుడు హగె గాట్‌ప్రీడ్ గీన్ గోబ్ (82) మృతి చెందారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న గీన్ గోబ్ హరారేలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 4న తుదిశ్వాస విడిచారని అధ్యక్ష భవనం తెలిపింది. ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడినట్లు 2014లో గీన్ గోబ్ స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. 2015 నుంచి దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న గీన్ గోబ్ పదవీ కాలం ఈ ఏడాదితో పూర్తి కావాల్సి ఉంది.
Published date : 16 Feb 2024 03:59PM