United States: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారాలను భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్(57)కు నవంబర్ 19న కొద్దిసేపు బదిలీ చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు ఆయనకు మత్తు మందు (అనస్తీషియా) ఇవ్వడమే ఇందుకు కారణం. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా బైడెన్ రికార్డుకెక్కారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు.
తొలి మహిళగా..
అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు స్పృహలో లేనిపక్షంలో ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు. బైడెన్‌కు నవంబర్ 19న మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆయన కొంతసేపు స్పృహలో లేరు. ఈ సమయంలో కమలా హ్యారిస్ వైట్‌హౌస్ వెస్ట్‌వింగ్‌లోని తన కార్యాలయం నుంచి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించారు. దీంతో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కమల గుర్తింపు పొందారు. పరీక్షల అనంతరం బైడెన్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాలన్నీ మళ్లీ ఆయనకే సంక్రమించాయి.
చదవండి: రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన తొలి దళిత వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అధ్యక్షురాలిగా కొద్దిసేపు బాధ్యతలు చేçపట్టిన భారత సంతతి మహిళ?
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్
ఎందుకు : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు... సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు మత్తు మందు (అనస్తీషియా) ఇచ్చిన నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్