Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిగా ఆయన కొనసాగుతున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది.
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్
జీన్ కాస్టెక్స్ స్థానంలో ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్ నియమితులయ్యారు. తద్వారా దేశప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళగా ఆమె నిలిచారు. 1991–92లో ఎడిత్ క్రేసన్ ఫ్రాన్స్ తొలి మహిళా ప్రధానిగా పని చేశారు. బోర్న్‌గత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు.
Telangana: రాష్ట్ర హైకోర్టు నూతన సీజేగా ఎవరు నియమితులు కానున్నారు?
Published date : 24 May 2022 06:53PM