Skip to main content

New Chairman of CBDT: సీబీడీటీ నూతన ఛైర్మన్‌ గా నితిన్‌ గుప్తా

IRS officer Nitin Gupta appointed as the new CBDT chairman
IRS officer Nitin Gupta appointed as the new CBDT chairman

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నూతన ఛైర్మన్‌ గా ఐఆర్‌ఎస్‌ అధికారి నితిన్‌ గుప్తా నియమితులయ్యారు. 1986 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన గుప్తా ప్రస్తుతం సీబీడీటీ బోర్డు సభ్యులు(ఇన్వెస్టిగేషన్‌ )గా ఉన్నారు. సీబీడీటీ ఛైర్మన్‌ గా ఉన్న జేబీ మోహపాత్ర ఈ ఏడాది ఏప్రిల్‌ 30న పదవీ విరమణ పొందారు. దీంతో ఐఆర్‌ఎస్‌ అధికారిణి సంగీతా సింగ్‌కు తాత్కాలికంగా ఛైర్‌పర్సన్‌ బాధ్యతలు అప్పగించారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Jul 2022 07:59PM

Photo Stories