Indian-American: అమెరికా రక్షణ శాఖలో ఇండియన్ అమెరికన్
Sakshi Education
Indian-American: అమెరికా రక్షణ శాఖలో కీలక పదవి చేపట్టిన ఇండియన్ అమెరికన్?
ఇండియన్ అమెరికన్, భద్రతా నిపుణురాలు.. రాధా అయ్యంగార్ ప్లంబ్‌కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీగా బైడెన్ సర్కారు ఆమెను నామినేట్ చేసింది. ఆమె ప్రస్తుతం రక్షణ శాఖలో అండర్ సెక్రటరీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్నారు. మరో ఇండియన్ అమెరికన్ గౌతమ్ రానా స్లొవేకియాలో అమెరికా రాయబారిగా నియమితులు కానున్నారు.
అమెరికా టాప్ సైన్స్ సలహాదారుగా భారతీయ మహిళ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఆ దేశ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ (ఓఎస్‌టీపీ) డైరెక్టర్‌గా భారతీయ సంతతికి చెందిన డాక్టర్ ఆరతి ప్రభాకర్‌ను నామినేట్ చేశారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 01 Jul 2022 05:20PM