Skip to main content

Italy's first Female Prime Minister: ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని

Giorgia Meloni is Italy's first female prime minister

ఇటలీ చరిత్రలోనే తొలిసారి ఓ మహిళా నేత ప్రధాని పదవి చేపట్టనున్నారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత జార్జియా మెలోని(45) ఇటీవల జరిగిన ఎన్నికల్లో 26.37శాతం ఓట్లు సాధించారు. ఆమె నేతృత్వంలోని కూటమి 43శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించింది. మెలోని అతివాద నాయకురాలు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన పూర్తి అతివాద ప్రభుత్వం కూడా ఇదే అవుతుంది. వివాదాస్పదమైన ‘గాడ్, ఫాదర్‌ ల్యాండ్‌ అండ్‌ ఫ్యామిలీ’ నినాదంతో మెలోని ముందుకు సాగారు. ఆమె ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇటలీ నౌకాదళం లిబియా సముద్ర మార్గాన్ని మూసివేయాలని ఆమె కోరుకుంటున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Oct 2022 03:33PM

Photo Stories