Sharad Yadav: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
Sakshi Education
సీనియర్ రాజకీయవేత్త, లోక్‌తాంత్రిక్ జనతా దళ్(ఎల్‌జేడీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్(75) గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 12న మరణించారు.
ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి ట్విటర్ ద్వారా తెలిపారు. శరద్ యాదవ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
శరద్ యాదవ్ మొత్తం పదిసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1970వ దశకంలో జయప్రకాశ్ నారాయణ్ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సోషలిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. జనతాదళ్ నుంచి బయటకు వచ్చి 1997లో జేడీ(యూ)ను స్థాపించారు. జేడీ(యూ) నితీశ్ వర్గానికే చెందుతుందని 2017లో ఈసీ ప్రకటించింది. 2018లో తాను స్థాపించిన ఎల్‌జేడీని శరద్ యాదవ్ ఇటీవలే జేడీ(యూ)లో విలీనం చేశారు.
Darshan Singh: దర్శన్ సింగ్‌కు ప్రవాసీ సమ్మాన్ అవార్డు
Published date : 13 Jan 2023 12:50PM