Law Minister: కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత
Sakshi Education
మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్(97)..
జనవరి 31న ఢిల్లీలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. న్యాయవాదిగా ఇటీవలి కాలం వరకు చురుగ్గానే ఉన్నారు. రాఫెల్ డీల్‌పై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఆయన వాదించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని అలహాబాద్ హైకోర్టులో కేసు వేసిన రాజ్ నారాయణ్ తరపున శాంతి భూషణ్ వాదించి గెలిచారు. శాంతి భూషణ్ ఇద్దరు కుమారులు జయంత్, ప్రశాంత్ భూషణ్ కూడా ప్రముఖ న్యాయవాదులే.
Published date : 06 Feb 2023 05:26PM