BYJU’s Global Brand Ambassador : బైజూస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ.. ఈ ఏడాది ఫిఫా ప్రపంచ కప్‌కి..
విద్యను ప్రోత్సహించడానికి బైజూస్‌తో ఒప్పందంపై సంతకం చేశాడని.. బైజూస్ ఒక ప్రకటనలో తెలిపింది. బైజూస్ సోషల్ ఇంపాక్ట్ సంస్థ అయిన ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ విభాగానికి మొదటి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించింది.
Jobs : 2,500 మంది తీసి.. 10,000 మంది టీచర్లను.. నియమించుకుంటాం.. ఇదే మా టార్గెట్..
ఈ సందర్భంగా కో-ఫౌండర్ దివ్య గోకుల్‌నాథ్ మాట్లాడుతూ..
మా గ్లోబల్ అంబాసిడర్‌గా లియోనెల్ మెస్సీతో కలిసి పని చేయడానికి గౌరవంగా ఉందన్నారు. అతను అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి అత్యంత విజయవంతమైన క్రీడాకారుల్లో ఒకడిగా నిలిచాడన్నారు. బైజూస్ ఎడ్యుకేషనల్ ఫర్ ఆల్ 5.5 మిలియన్ల పిల్లల కోసం పనిచేస్తోందని తెలిపారు.
Byju Raveendran: బైజూస్ సక్సెస్ ఫార్ములా ఇదే...
ఫిఫా ప్రపంచ కప్ 2022కి.. బైజూస్
బైజూస్ ఖతార్‌లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ 2022కి అధికారిక స్పాన్సర్‌గా మారింది. లియోనెల్ మెస్సీ అర్జెంటీనా జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా 2022 ఫిఫా ప్రపంచ కప్‌ను గెలవడానికి సన్నద్ధమవుతున్న సమయంలో బైజూస్ ఈ ఒప్పందం చేసుకుందని, బైజూస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ప్రచారంలో మెస్సీని చూస్తారని బైజూస్ ప్రకటించింది.