Guinness World Record: గిన్నిస్ రికార్డు.. గంటలో 3,206 పుష్ అప్‌లు
Sakshi Education
జిమ్ చేసే సిక్స్‌ప్యాక్ బాడీ అయినా రోజూ 100 పుష్‌అప్‌లు చేస్తేనే బాగా అలిసిపోతారు. అలాంటిది ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి కేవలం గంటలో 3,206 పుష్‌అప్‌లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కారు.
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 33 ఏళ్ల లుకాస్ హెల్మెక్ పుష్ అప్‌లు చేయడం ద్వారా తనకున్న స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించాడు. గంటకి 3,182 పుష్ అప్‌లు చేసి రికార్డు సాధించిన సాటి ఆ్రస్టేలియన్ డేనియల్ స్కాలి పేరు మీదున్న రికార్డుల్ని బద్దలు కొట్టాడు. లుకాస్ నిమిషానికి 53 పుష్ అప్‌లు చేశాడని గిన్నిస్ వరల్డ్ అధికారులు వెల్లడించారు. ఈ రికార్డు సాధించడానికి అనుభవజు్ఞలైన జిమర్‌ల దగ్గర రెండు మూడేళ్ల పాటు శిక్షణ కూడా తీసుకున్నట్టు లుకాస్ వెల్లడించాడు.
World's Youngest Author: గిన్నిస్ రికార్డు.. నాలుగేళ్లకే పుస్తకాన్ని రాసి ప్రచురించిన బాలుడు
Published date : 17 Apr 2023 05:05PM