America's Richest self made Women: అమెరికా సంపన్న మహిళల జాబితాలో నలుగురు భారతీయులు
పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రా నూయి(67), అరిస్టా నెట్‌వర్క్స్ (కంప్యూటర్ నెట్‌వర్కింగ్ కంపెనీ) ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్(62), సింటే (ఐటీ కన్సల్టెంగ్ కంపెనీ) సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేతి(68), కన్‌ఫ్లూయెంట్ (క్లౌడ్ కంపెనీ) సహ వ్యవస్థాపకురాలు నేహా నార్కడే (38) ఫోర్బ్స్ ‘అమెరికా సంపన్న మహిళల’జాబితాలో చోటు దక్కించుకున్నారు.
వీరి ఉమ్మడి సంపద 4.06 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33292 కోట్లు)గా ఉంది. 100 మంది మహిళలు ఉమ్మడిగా 124 బిలియన్ డాలర్లు కలిగి ఉన్నారని, ఏడాది క్రితంతో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు ఫోర్బ్స్ తెలిపింది. జాబితాలో జయశ్రీ ఉల్లాల్ 2.4 బిలియన్ డాలర్ల సంపదతో 15వ ర్యాంకులో ఉన్నారు. నీర్జా సేతి 990 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు.
నార్కడే 520 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 38వ స్థానంలో ఉన్నారు. ఇంద్రా నూయి 2019లో పెప్సీకో సీఈవోగా రిటైర్ అయ్యారు. 350 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 77వ స్థానంలో నిలిచారు.