Women's Reservation Bill: లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రెండో రోజు, పార్లమెంట్ నూతన భవనంలో ఉభయసభలు కొలువుదీరిన తొలిరోజు మంగళవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ‘రాజ్యాంగ(128వ సవరణ) బిల్లు–2023’ను దిగువ సభలో ప్రవేశపెట్టారు.
మహిళా కోటా ఇప్పుడే కాదు
జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి రానుంది. అంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం లేదు. 2029 లోక్‌సభ ఎన్నికల్లో అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 2027 తర్వాతే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు. మహిళల కోటా బిల్లు చట్టంగా మారిన తర్వాత 15 సంవత్సరాలపాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కాల వ్యవధిని పొడిగించవచ్చు.
Cinematograph (Amendment) Bill, 2023: సినిమాటోగ్రఫీ(చట్ట సవరణ) బిల్లు–2023
బిల్లులో ఏముంది?
► మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఆరు పేజీల బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
► లోక్‌సభలో, శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తారు. రాజ్యసభలో, రాష్ట్రాల శాసన మండలిలో ఈ రిజర్వేషన్లు వర్తించవు.
► మహిళల కోటాలో మూడో వంతు సీట్లను ఎస్సీలు, ఎస్టీలకు కేటాయిస్తారు.
► నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారి మహిళల రిజర్వ్‌డ్ సీట్లు రొటేషన్ అవుతుంటాయి. అంటే మహిళకు కేటాయించిన నియోజకవర్గాలు స్థిరంగా ఉండవు.
► బిల్లులో ఓబీసీ(ఇతర వెనుకబడిన తరగతులు)లను చేర్చడంపై ఎలాంటి ప్రస్తావన లేదు. ఓబీసీ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉండవు.
► ఆంగ్లో–ఇండియన్ మహిళలకు కూడా ప్రత్యేకంగా రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉండవు.
► ప్రస్తుతం లోక్‌సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళా సభ్యుల సంఖ్య కేవలం 14 శాతం ఉంది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇలా చాలా తక్కువ.
► రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం.. రాజ్యాంగ సవరణ బిల్లును కనీసం 50 శాతం రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Delhi ordinance bill passed in Lok Sabha: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం