Union Government: 'కేంద్రం'కు బదులు 'యూనియన్ ' అందాం
అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రకటనలు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో 'కేంద్ర (సెంట్రల్) ప్రభుత్వం' అని పేర్కొనడానికి బదులు.. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం 'యూనియన్ ' లేక 'యూనియన్ ప్రభుత్వం' అని ఉపయోగించాలని కోరుతూ కోల్‌కతాకు చెందిన 84ఏళ్ల ఆత్మారాం సరావగీ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం దిల్లీ హైకోర్టు ముందుకు వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అనే పదబంధాన్ని బ్రిటిష్ వలస పాలకులు ఉపయోగించేవారని, స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఈ పదానికి కాలం చెల్లిపోయిందని పిటిషనర్ వాదించారు. యూనియన్ అంటే రాష్ట్రాలతో కూడినదని అర్థం వస్తుందని.. కేంద్ర, రాష్ట్రాలు అందులో భాగమనే భావన, ఐక్యత బలపడతాయని పేర్కొన్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP