Nikah Halala: బహు భార్యత్వం, నిఖా హలాలాపై సుప్రీం బెంచ్
Sakshi Education
ముస్లింలు పాటిస్తున్న బహు భార్యత్వం, నిఖా హలాలా ఆచారాల రాజ్యాంగ చట్టబద్ధతను తేల్చేందుకు త్వరలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని పునరుద్ధరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
బహు భార్యత్వం, నిఖా హలాలాలను చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించాలంటూ న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిల్‌నుద్దేశిస్తూ కోర్టు ఈ విషయాన్ని తెలిపింది. ‘బహు భార్యత్వం సహా పలు కీలకాంశాలు గతంలోనే ఏర్పాటైన సంబంధిత ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉన్నాయి. అయితే ఈ బెంచ్‌లోని ఇద్దరు జడ్జీలు రిటైర్ అవడంతో కొత్త వారితో బెంచ్‌ను ఏర్పాటుచేయాల్సి ఉంది. త్వరలోనే ఈ పని పూర్తిచేస్తాం’ అని సీజేఐ అన్నారు. బహు భార్యత్వం ప్రకారం భారత్‌లోని ఒక ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండొచ్చు. కాగా, మాజీ భర్తను పెళ్లాడాలంటే ఒక ముస్లిం మహిళ.. మరొకరిని పెళ్లాడి, విడాకులు ఇవ్వాలి. ఆ తర్వాతే మాజీ భర్తను పెళ్లిచేసుకోవచ్చు.
Supreme Court: మతమార్పిళ్లకు రాజకీయ రంగు పులమొద్దు.. సుప్రీం
Published date : 21 Jan 2023 01:40PM