PM Modi: మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?
మణిపూర్ రాజధాని నగరం ఇంఫాల్‌లో రూ.4,815 కోట్ల విలువైన 22 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జనవరి 4న ప్రధాని మోదీ ప్రారంభించిన వాటిలో వాటిలో.. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఇంఫాల్ స్మార్ట్ సిటీ మిషన్, అత్యాధునిక కేన్సర్ ఆస్పత్రి ఉన్నాయి. వీటితోపాటు మణిపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ భవనానికి, 5 జాతీయ రహదారుల నిర్మాణానికి, మూడు తాగునీటి ప్రాజెక్టులు తదితరాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన త్రిపుర రాజధాని నగరం అగర్తలాలో మహారాజా బీర్ బిక్రమ్(ఎంబీబీ) విమానాశ్రయంలో రెండో టెర్మినల్ భవనంతోపాటు పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు.
గల్వాన్‌లో మువ్వన్నెల జెండా
లద్దాఖ్‌లోని గల్వాన్‌లోయలో భారీ భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న ఆర్మీ బలగాల ఫొటోలను జనవరి 4న రక్షణ వర్గాలు విడుదల చేశాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా భారత సైనిక బలగాలు లోయలో భారత జెండాతో ప్రదర్శన నిర్వహించాయి. ఈ లోయ తమ అదీనంలో ఉన్నట్లు చూపుతూ చైనా ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలను తిప్పికొట్టేందుకే భారతీయ రక్షణ వర్గాలు తాజా ఫొటోలు విడుదల చేశాయి.
చదవండి: 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.4,815 కోట్ల విలువైన 22 అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఇంఫాల్, మణిపూర్
ఎందుకు : మణిపూర్ రాష్ట్రాభివృద్ధి కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్