Caste Census: కులగణనను ఆపాలంటూ ఆదేశాలు ఇవ్వలేం..సుప్రీంకోర్టు
Sakshi Education
రాష్ట్రంలో కులగణన చేపట్టాలంటూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
సర్వేను ఆపాలంటూ వేసిన పిటిషన్‌లు విచార్హమైనవి కాదంటూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ సేథ్‌ల ధర్మాసనం పేర్కొంది. పిటిషన్ దారులు సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ‘ఇవి ప్రచారం కోసం వేసిన పిటిషన్లు. ఫలానా కులానికి రిజర్వేషన్ ఇంతే ఇవ్వాలని మేమెలా చెప్పగలం? ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది. ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేం. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టలేం’ అని పేర్కొంది. పిటిషన్లను ఉపసంహరించుకుని, ఈ అంశంపై తగు నిర్ణయం కోసం పట్నా హైకోర్టుకు వెళ్లేందుకు పిటిషన్ దారులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
Supreme Court: భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Published date : 21 Jan 2023 12:24PM