Higher Education: ఉన్నత విద్య మావల్ల కావట్లేదు... నాలుగేళ్లలో 32 వేల మంది విద్యార్థులు చదువులకు స్వస్తి
ఒక్క ఐఐటీల్లోనే 2019 నుంచి 2023 వరకు అంటే ఈ నాలుగేళ్లలో 8 వేల మంది విద్యార్థులు మధ్యలోనే చదువుమానేశారు. ఈ గణాంకాలు సాక్షాత్తు కేంద్రమే వెల్లడించింది. ఐఐటీల్లోనే కాక సెంట్రల్ యూనివర్సిటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఐఐఐటీల్లోనూ వేల సంఖ్యలో విద్యార్థులు చదువులకు రాంరాం చెబుతున్నారు.
ఇవీ చదవండి: తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షపాతం నమోదు... 24 గంటల్లో 64 సెం.మీల వర్షం... ఎక్కడంటే
ఆత్మహత్యల్లోనూ ఉన్నత విద్య చదివే వారు ఉంటుండడం మరో విషాదకరం. 2018 నుంచి 39 మంది ఐఐటీల్లో చదివే విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. అలాగే పూర్తి గణాంకాలను చూస్తే... 2018 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో 98 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.
Success Story: గూడెం నుంచి అమెరికాకు... ఈ వరంగల్ ప్రొఫెసర్ సక్సెస్ జర్నీ సాగిందిలా..!
ఐఐటీల్లో 39 మంది, ఎన్‌ఐటీల్లో 25 మంది, సెంట్రల్ యూనివర్సిటీల్లో 25 మంది, ఐఐఎంల్లో నలుగురు, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో ముగ్గురు, ట్రిపుల్ ఐటీల్లో ఇద్దరు మృతి చెందారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం.. ఈ ఆత్మహత్యలకు మానసిక, కుటుంబ సమస్యలు, చదువుల్లో ఒత్తిడి, ఒంటరివారమనే భావన కారణమని కేంద్రమంత్రి సుభాస్ సర్కార్ రాజ్యసభలో తెలిపారు.
ఇవీ చదవండి: వీసా లేకుండానే 57 దేశాలను చుట్టిరావొచ్చు... ఆ దేశాలేవో ఇక్కడ తెలుసుకోండి..
మధ్యలో చదువు మానేసేవారి సంఖ్య సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎక్కువగా ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ నాలుగేళ్లలో 17,454 మంది మధ్యలోనే చదువులు ఆపేశారు. ఐఐటీల్లో 8,139 మంది, ఎన్‌ఐటీల్లో 5,623 మంది, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో 1,046 మంది, ఐఐఎంల్లో 858 మంది, ట్రిపుల్ ఐటీల్లో 803 మంది విద్యార్థులు చదువును మధ్యలో ఆపేశారు. 2019 నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో సుమారుగా 32 వేల మంది చదువులకు స్వస్తి చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది.