Stealth Warship Taragiri: స్టెల్త్ యుద్ధనౌక తారాగిరి జలప్రవేశం
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్ యుద్ధనౌక తారాగిరి ఇటీవల జలప్రవేశం చేసింది. 'ప్రాజెక్ట్ 17ఏ' శ్రేణిలో ఇది మూడో యుద్ధనౌక. ముంబయిలోని మజగావ్ డాక్ లిమిటెడ్(ఎండీఎల్)లో దీన్ని నిర్మించారు. తారాగిరిని సమీకృత విధానాన్ని ఉపయోగించి నిర్మించారు. ఇందులో వివిధ ప్రదేశాల్లో హల్‌బ్లాక్‌లను నిర్మించి, ఎండీఎల్‌లో అనుసంధానించారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 మరణం కారణంగా భారత్‌లో సెప్టెంబర్ 11ను సంతాప దినంగా ప్రకటించినందువల్ల ఈ యుద్ధనౌకను సాంకేతికంగా మాత్రమే జలప్రవేశం చేశారు. ఫ్రిగేట్ తరగతికి చెందిన ఈ యుద్ధనౌక నిర్మాణం 2020 సెప్టెంబరు 10న ప్రారంభమైంది. పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక ఇది 2025 ఆగస్టులో నౌకాదళానికి అందజేస్తారు. నేవీకి చెందిన బ్యూరో ఆఫ్ నేవల్ డిజైన్ దీనికి రూపకల్పన చేసింది. రూ.25,700 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ 17ఏ తరగతి యుద్ధనౌకల నిర్మాణం జరుగుతోంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP