Student Visas: స్టూడెంట్ వీసాల్లో హైదరాబాద్ నగరమే టాప్
Sakshi Education
విద్యార్థుల వీసా మంజూరులో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ కార్యాలయం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది.
న్యూఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో ఉన్న యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల కంటే హైదరాబాద్ నుంచే అత్యధిక విద్యార్థి వీసాల జారీ జరిగింది. భారతదేశం నుంచి అమెరికా వెలుతున్న 10 మందిలో ఒకరు హైదరాబాద్ నుంచే ఉన్నారు. 2023లో దేశంలోని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలు రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల వీసాలను జారీ చేశారు. కాగా విజిటింగ్ వీసా వేయిటింగ్ సమయం 75 శాతం తగ్గింది. యూఎస్‌లో చదువుతున్న పది లక్షల (ఒక మిలియన్) మంది విద్యార్థుల్లో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు.
California schools: కాలిఫోర్నియాలో కలిపిరాత మస్ట్.. ఎందుకు అంటే..?
Published date : 02 Feb 2024 10:39AM