Foreign Contribution Control Act : ఏడాదికి రూ.10 లక్షల విదేశీ నిధులు తీసుకోవచ్చు
Sakshi Education
విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి(ఎఫ్‌సీఆర్‌ఏ) సంబంధించి కొన్ని నిబంధనలను తాజాగా కేంద్ర హోంశాఖ సవరించింది. ఈమేరకు భారతీయులెవరైనా అధికారులకు ఎలాంటి సమాచారం అందించకుండానే విదేశాల్లో ఉంటున్న తమ సంబంధీకుల నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు వరకూ తీసుకోవచ్చు. ఇంతకుముందు ఈ పరిమితి రూ.లక్ష వరకు మాత్రమే ఉంది. తాజా నిబంధనల ప్రకారం–పరిమితిని మించి ఎవరైనా నిధులు పొందితే.. ఆ విషయాన్ని 90 రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇంతవరకు ఇది 30 రోజులుగా ఉండేది. ఈమేరకు ఎఫ్‌సీఆర్‌ఏ కొత్త నిబంధనలపై కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 16 Jul 2022 07:05PM