Skip to main content

Didi ki library: ‘దీదీ కీ లైబ్రరీ’

Didi ki library

ఆడపిల్లలకు ఎన్నో కలలు.. బాగా చదవాలని, మంచి ఉద్యోగం చేయాలని ఆశిస్తారు. ఆ స్వప్నాలకు పరిస్థితులు సంకెళ్లు వేస్తుంటాయి. అందునా బీహార్‌లాంటి చోట మరీ కష్టం. అందుకే అక్కడ ఊరికో కమ్యూనిటీ లైబ్రరీ ఏర్పాటవుతున్నది. ఫిబ్రవరిలో మొదలుపెట్టిన ఈ ప్రయోగం ఇప్పటికే వంద గ్రామాలను చేరింది. వాటి పేరు ‘దీదీ కీ లైబ్రరీ’. రెండు గదులు, ఒక హాల్‌ ఉంటాయి. ఇప్పటికే 12 వేల మందికిపైగా సభ్యత్వం తీసుకున్నారు. వాళ్లలో 80 శాతం బాలికలే. ఒక గదిలో డిజిటల్‌ లైబ్రరీ, ఆఫీస్‌ ఉంటాయి. మరో గదిని స్టడీ రూమ్‌గా ఉపయోగిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, ఇ–బుక్స్‌ అందుబాటులో ఉంచుతున్నారు. గ్రామీణ బాలికలు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఇదో మంచి వేదిక అవుతున్నది. బాగా చదువుకోవాలనుకునే పేదింటి ఆడపిల్లలకు దీదీ కీ లైబ్రరీ ఓ వరం.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 20 May 2023 06:52PM

Photo Stories