Himachal Pradesh: హిమాచల్‌లో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం
Sakshi Education
హిమాచల్ ప్రదేశ్‌లో పీచు మిఠాయి తయారీ, నిల్వ, విక్రయాలను ఏడాది పాటు నిషేధిస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16న ఉత్తర్వులు జారీ చేసింది. 2025, మే 15 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపింది. ఇందులో కృత్రిమ రంగులుగా ఉపయోగించే ‘రోడమైన్–బీ’ ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని నిర్ధారించారు. దీంతో వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 30 Mar 2024 05:14PM