Security Threat: భారత్ భద్రతకు ఏ దేశం నుంచి ముప్పు ఉందని సీడీఎస్ చెప్పారు?
భారత్ భద్రతకు డ్రాగన్ దేశం చైనా నుంచి అతిపెద్ద ముప్పు పొంచి ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ ఉద్ఘాటించారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం 2020 ఏడాది తరలించిన వేలాది మంది సైనికులను, ఆయుధాలను ఇప్పుడే వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేదని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ధీటుగా బదులు చెప్పేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని నవంబర్ 12న రావత్ స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ పాలన పునఃప్రారంభం కావడం భారత్ భద్రతకు ప్రమాదకరమైన పరిణామమేనని వివరించారు.
మహిళా అధికారులకు శాశ్వత కమిషన్..
మహిళా అధికారులకు శాశ్వత కమిషన్(పీసీ) ఏర్పాటు చేస్తామని భారత సైన్యం నవంబర్ 12న సుప్రీంకోర్టుకు తెలిపింది. అన్ని అర్హతలు ఉన్న తమకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలంటూ 11 మంది మహిళా అధికారులు(షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్లు) చేసుకున్న దరఖాస్తులను సైన్యం గతంలో తిరస్కరించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్ ఏర్పాటుతో మహిళలకు సైతం సైన్యంలో అత్యున్నత హోదాతో పోస్టింగ్‌లు లభిస్తాయి.
చదవండి: కేంద్రం చేపట్టిన స్టార్ కాలేజ్ మెంటార్‌షిప్ కార్యక్రమ ఉద్దేశం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్