CISF Recruitment: మాజీ అగ్నివీర్‌లకు సీఐఎస్‌ఎఫ్‌లో 10% రిజర్వేషన్..
Sakshi Education
మాజీ అగ్నివీర్‌లకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్)లో 10% రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
ఈ మేరకు సీఐఎస్‌ఎఫ్ చట్టం–1968లోని నిబంధనలను సవరించినట్లు వెల్లడించింది. మాజీ అగ్నివీర్‌లకు బీఎస్‌ఎఫ్ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ అమలు చేస్తామంటూ వారం క్రితం ప్రకటించిన కేంద్రం తాజాగా ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. అంతేకాకుండా, మొదటి బ్యాచ్ అగ్నివీర్‌లకైతే ఐదేళ్ల వరకు, తర్వాతి వారికి మూడేళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుందని వివరించింది. మాజీ అగ్నివీర్‌లకు ఫిజికల్ ఎఫిసియెన్సీ పరీక్ష నుంచి మినహాయింపు కూడా ఉంటుందని తెలిపింది. గత ఏడాది తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోకి ఎంపికైన 17.5–21 ఏళ్ల అభ్యర్థు(అగ్నివీర్)లు నాలుగేళ్లపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది. అగ్నివీర్‌లలో 25% మందిని నాలుగేళ్ల తర్వాత రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారు.
Money Laundering: ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు 3%.. వాటిల్లో 96 శాతం కేసుల్లో నేరనిరూపణ
Published date : 18 Mar 2023 01:17PM