Skip to main content

Leopard: భారత్‌లో చిరుత పులుల గణన

Census of Leopards in India   Leopard population in India   Madhya Pradesh tops with 3,907 leopards

కేంద్ర పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌.. ఫిబ్రవరి 29న భారతదేశంలో ‘చిరుతపులుల గణన’ను విడుదల చేసారు, దీని ప్రకారం–దేశంలో దాదాపు 13,874 చిరుతలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో దేశంలోనే అత్యధికంగా 3,907 చిరుతపులులు ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 569, తెలంగాణలో 297 చిరుత పులులు ఉన్నాయి. అత్యధిక చిరుతపులుల జనాభా నాగార్జున సాగర్‌ శ్రీశైలం(ఆంధ్రప్రదేశ్‌), పన్నా (మధ్యప్రదేశ్‌), సాత్పురా (మధ్యప్రదేశ్‌) టైగర్‌ రిజర్వ్‌ల్లో ఉంది. ఈ గణనను నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర అటవీ శాఖల సహకారంతో రూపొందించారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Mar 2024 11:47AM

Photo Stories