Supreme Court: బిల్కిస్ పిటిషన్ కొట్టివేత
ఈ కేసుకు సంబంధించిన 11 మంది దోషుల్లో ఒకరు ముందస్తు విడుదల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అది గుజరాత్ ప్రభుత్వ అధికార పరిధిలోని అంశమంటూ మే 13న కోర్టు తీర్పు వెలువరించింది. దానిపై సమీక్షకు బానో పెట్టుకున్న పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ విక్రం నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఇన్–చాంబర్ విచారణ జరిపింది.
దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతీ మలీవాల్ అసంతృప్తి వెలిబుచ్చారు. ‘హంతకులను గుజరాత్ ప్రభుత్వం స్వేచ్ఛగా వదిలేసింది. దీనిపై సుప్రీంకోర్టులోనే న్యాయం జరగకపోతే ఇక పౌరులు ఇంకెవరిని ఆశ్రయించాలి?’ అని ప్రశ్నించారు. తీర్పు కాపీ చూశాక భావి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని బానో తరఫు న్యాయవాది శోభా గుప్తా తెలిపారు. అయితే మొత్తం 11 మంది దోషుల ముందస్తు విడుదలను సవాలు చేస్తూ బానో విడిగా వేసిన మరో పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం తెలిసిందే.