Central Govt: 2027 నాటికి డీజిల్ వాహనాలను నిషేధించండి
దేశవ్యాప్తంగా పది లక్షల జనాభా దాటిన నగరాల్లో 2027 నాటికి డీజిల్‌తో నడిచే నాలుగు చక్రాల వాహనాలపై నిషేదం విధించాలని కేంద్ర చమురు శాఖ నియమించిన ఒక కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆయా నగరాల్లో డీజిల్ వాహనాలకు బదులు విద్యుత్తు లేదా గ్యాస్‌తో నడిచే వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అలాగే, రానున్న పదేళ్లలో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో డీజిల్‌తో నడిచే సిటీ బస్సులను కొనుగోలు చేయకూడదని.. 2035 నాటికల్లా దేశవ్యాప్తంగా ఇంటర్నల్ కంబషన్(అంతర్గత దహన) ఇంజన్లతో నడిచే మోటార్సైకిళ్లు, స్కూటర్లు, త్రిచక్రవాహనాలను కూడా దశలవారీగా వినియోగం నుంచి తప్పించాలని పేర్కొంది. ఇందుకు విద్యుత్తు వాహనాలను ప్రత్యామ్నాయ పరిష్కారంగా ప్రోత్సహించాలని అభిప్రాయపడింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP