WHO Report: భారత్‌లో 18శాతం పెరిగిన క్షయ కేసులు
Sakshi Education
భారత్‌లో క్షయ బాధితులు పెరుగుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది.
2020తో పోలిస్తే.. 2021లో 21.4 లక్షల కేసులు కొత్తగా నమోదయ్యాయని తెలిపింది. ఇది 18 శాతం పెరుగుదలని వివరించింది. వ్యాధి నిర్ధారణ కోసం దేశంలో 22 కోట్ల మందిని స్క్రీన్ చేసినట్లు తెలిపింది.‘గ్లోబల్ టీబీ రిపోర్ట్’ పేరిట ఓ నివేదికను డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్షయ నిర్ధారణ, చికిత్సపై కొవిడ్19 మహమ్మారి ప్రభావం పడిందని పేర్కొంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 11 Nov 2022 05:55PM