2022 Indian Presidential Election: తగ్గనున్న ఎంపీల ఓటు విలువ
Sakshi Education

ఈ సారి రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుల(ఎంపీ) ఓటు విలువ 700కు పడిపోనుంది. గతంలో ఇది 708గా ఉండేది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దవడమే ఇందుకు కారణం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత లద్దాఖ్, జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. జమ్మూకశ్మీర్లో శాసనసభ ఉనికిలో లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఎంపీల ఓటు విలువ తగ్గిపోతున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపీల ఓటు విలువ రాష్ట్రాల్లో శాసనసభ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నిక 2022 ఏడాది జూలైలో జరగనుంది.
Published date : 16 May 2022 07:29PM