Zaporizhzhia Nuclear Power Plant: ప్రమాదంలో జపొరిజియా అణువిద్యుత్ కేంద్రం
Sakshi Education
![Zaporizhzhia nuclear power plant in danger](/sites/default/files/images/2023/05/20/zaporizhzhia-nuclear-power-1684589866.jpg)
ఉక్రెయిన్‌లోని జపొరిజియా అణువిద్యుత్కేంద్ర పరిస్థితిపై అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ‘జపొరిజియా దగ్గర పరిస్థితి అనూహ్యంగా, ప్రమాదకరంగా ఉంది. భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ప్లాంట్ అణు భద్రతపై నేను చాలా ఆందోళనగా ఉన్నాను’ అని ఐఏఈఏ అధిపతి రఫెల్ గ్రాసీ తెలిపారు. జపొరిజియా నుంచి పౌరులు ఖాళీ చేయాలని ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన రష్యా ప్రకటించిన నేపథ్యంలో.. గ్రాసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్లాంట్‌కు సమీపంలోనే ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 20 May 2023 07:07PM