Joint Air Exercise: దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు
Sakshi Education
ఉత్తరకొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపిన నేపథ్యంలో ఫిబ్రవరి 19న దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించాయి.

ఫిబ్రవరి 19న జరిపిన ఈ విన్యాసాల్లో అమెరికా వ్యూహాత్మక బాంబర్లు పాల్గొన్నాయి. అమెరికా బి–1బి బాంబర్లకు దక్షిణ కొరియా ఎఫ్–35ఏ, ఎఫ్–15ఏ, అమెరికా ఎఫ్–16 రక్షణగా నిలిచాయి. రెండు మిత్ర దేశాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమకున్న రక్షణ సంసిద్ధతను ప్రదర్శించాయని దక్షిణ కొరియా ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్‌తో కలిసి అమెరికా సంయుక్త వైమానిక విన్యాసాలు జరుపనుందని జపాన్ వార్తా సంస్థ తెలిపింది. ఉత్తరకొరియా ఫిబ్రవరి 18న రాజధాని ప్యాంగ్‌యాంగ్ నుంచి లాంగ్–రేంజ్ క్షిపణిని జపాన్ సముద్రం తీరంలోకి ప్రయోగించింది. ఈ క్షిపణి గంటలో 900 కిలోమీటర్లు (560 మైళ్లు) ప్రయాణించింది. జపాన్‌కు చెందిన ఓషిమా దీవికి 200 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో క్షిపణి కూలిపోయినట్లు సమాచారం.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (22-28 జనవరి 2023)
Published date : 20 Feb 2023 11:55AM