Skip to main content

United Nations: ప్రపంచ సముద్ర జీవజాల పరిరక్షణ ఒప్పందానికి ఐరాస ఆమోదం

Conservation of Marine Life

చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ సముద్రా­ల్లో నివసించే జీవజాలాల పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఏకగ్రీవ ఒప్పందానికి వచ్చా­యి. ఏ దేశానికీ చెందని ఈ సముద్ర జలాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని రక్షించడమంటే.. సగం భూగోళాన్ని కాపాడటమే అని ఇటీవల జరిగిన సమావేశం అభిప్రాయపడింది. ఈ ఒప్పందాన్ని తీసుకురావడానికి 20 ఏళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలైనప్పటికీ.. అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. చివరకు ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన సమావేశాల్లో ఒప్పందానికి సభ్యులందరూ ఆమోదముద్ర వేశారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Mar 2023 04:48PM

Photo Stories