Skip to main content

Russia-Ukraine War: అంతర్జాతీయ న్యాయస్థానం ఏ నగరంలో ఉంది?

International Court of Justice

రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్‌ ఫిర్యాదు చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తక్షణం అడ్డుకోవాలని కోరింది. యుద్ధాన్ని ఆపాలని రష్యాను ఆదేశిస్తూ తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరినట్లు ఫిబ్రవరి 28న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలిదిమిర్‌ జెలెన్‌స్కీ వెల్లడించారు. అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్‌ రాజధాని ది హేగ్‌ నగరంలో ఉంది. యుద్ధానికి రష్యా నేతలను బాధ్యులను చేస్తూ వారిపై వ్యక్తిగతంగా క్రిమినల్‌ ఆరోపణలు మోపి విచారించే పరిధి కోర్టుకు లేదు. దేశాల మధ్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన వంటి న్యాయపరమైన ఆరోపణలను ఇది పరిష్కరిస్తుంటుంది. ఐరాసకు సంబంధించి ఇదే అత్యుత్తమ న్యాయ సంస్థ.

రక్షణకు 113 బిలియన్‌ డాలర్లు కేటాయించిన జర్మనీ
రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశగా జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల కోసం ఏకంగా 113 బిలియన్‌ డాలర్లు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ఫిబ్రవరి 28న చాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రకటించారు. తాజా ప్రకటనతో రక్షణపై పెట్టుబడులు దేశ జీడీపీలో 2 శాతాన్ని మించాయి. ఉక్రెయిన్‌కు సాయంగా 500 స్టింగర్‌ మిసైళ్లు, 1,000 యాంటీ ట్యాంక్‌ వెపన్స్, ఇతర ఆయుధాలు, సామగ్రిని పంపుతున్నట్టు ఫిబ్రవరి 27న జర్మనీ ప్రకటించడం తెలిసిందే.

UN General Assembly: ఉక్రెయిన్‌పై దాడి తీర్మానానికి ఎన్ని దేశాలు అనుకూలంగా ఓటేశాయి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు    : ఉక్రెయిన్‌
ఎక్కడ    : ది హేగ్, నెదర్లాండ్స్‌
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తక్షణం అడ్డుకోవాలని..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Mar 2022 05:21PM

Photo Stories